న్యూజిలాండ్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం పర్యటించే భారత జట్టుకు మాజీ ఆటగాడు, జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టి20 వరల్డ్ కప్ తర్వాత విశ్రాంతి కోరడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 18నుంచి జరిగే ఈ పర్యటనలో భారత్, కివీస్ మధ్య 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి.
లక్ష్మణ్‌తో పాటు హృషికేశ్ కనిత్కర్, సాయిరాజ్ బహుతులే కూడా కోచింగ్ బృందంలో భాగంగా ఉంటారు. ఈ ఏడాది ఆరంభంలో ఐర్లాండ్, జింబాబ్వే టూర్‌లలో కూడా భారత జట్టు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్, అండర్–19 ప్రపంచ కప్‌లో కూడా భారత యువ జట్టుకు మార్గనిర్దేశనం చేశాడు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా విశ్రాంతి తీసుకోవడంతో వన్డేలకు శిఖర్ ధావన్, టి20లకు హార్దిక్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.
న్యూజిలాండ్ పర్యటనలో భారత్ తొలుత టీ20లు ఆడనుంది. నవంబర్ 18, 20, 22 తేదీల్లో టీ20లు, ఆతర్వాత నవంబర్ 25, 27, 30 తేదీల్లో వన్డేలు ఆడనుంది.
న్యూజిలాండ్ పర్యటనకు భారత టీ20 జట్టు..
హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
న్యూజిలాండ్ పర్యటనకు భారత వన్డే జట్టు..
శిఖర్ ధవన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్
Comments
Please login to add a commentAdd a comment