వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లు ముగిసాక టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, అతని సహాయక సిబ్బందికి కొన్ని రోజుల పాటు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం విండీస్ సిరీస్ ముగిసాక టీమిండియా.. ఐర్లాండ్‌తో వారి స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌కు వెళ్లకుండా స్వదేశంలో రెస్ట్ తీసుకునేందుకే ద్రవిడ్ బృందానికి బీసీసీఐ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. విండీస్‌తో ఆఖరి రెండు టీ20ల తర్వాత ద్రవిడ్ అండ్ కో యునైటెడ్ స్టేట్స్ (ఆఖరి 2 టీ20లు విండీస్‌లో కాకుండా యుఎస్‌ఏలో జరుగనున్నాయి) నుంచి నేరుగా భారత్‌కు పయనమవుతుంది.
ద్రవిడ్ టీమ్‌లో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో పాటు మరికొంత మంది సభ్యులు ఉన్నారు. సమీప భవిష్యత్తులో టీమిండియాకు ఉన్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా వీరికి విశ్రాంతి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ద్రవిడ్ టీమ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) సిబ్బంది ఐర్లాండ్ పర్యటనను నిర్వహిస్తారు. లక్ష్మణ్ టీమ్‌లో బ్యాటింగ్ కోచ్‌గా హృషికేశ్ కనిత్కర్, బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే ఉన్నారు. కాగా, గతంలోనూ పలు సందర్భాల్లో ద్రవిడ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా కోచింగ్ బాధ్యతలను నిర్వర్తించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న భారత్ డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారీ విజయం సాధించి, మరో విజయం కోసం తహతహలాడుతుంది. ఈ సిరీస్‌లో భారత్ తదుపరి మరో టెస్ట్ మ్యాచ్, 3 వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది. తొలి టెస్ట్‌లో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ శతకాలు సాధించి, టీమిండియా భారీ స్కోర్‌కు దోహదపడగా.. అశ్విన్ 12 వికెట్లు పడగొట్టి, భారత గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment