West Indies tour
-
టీమిండియాకు షాక్.. రెండో వన్డేలో విండీస్ విజయం
రెండో వన్డేలో టీమిండియాకు కరిబీయన్ జట్టు షాకిచ్చింది. సొంతగడ్డపై సత్తా చాటుతూ భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 36.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్యఛేదనకు బరిలోకి వెస్టీండీస్ తరఫున ఓపెనర్ కైల్ మేయర్స్ 36 పరుగులతో రాణించాడు. విండీస్ కెప్టెన్ షై హోప్(63 నాటౌట్) అర్ధసెంచరీతో సత్తా చాటాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కీసీ కార్టీ(48) పరుగులతో కెప్టెన్‌కు అండగా నిలిచాడు. కాగా.. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లతో రాణించగా.. కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది. విండీస్ తాజా విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతకుముందు బ్యాటింగ్‌లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. విండీస్ బౌలర్ల ధాటికి 40.5 ఓవర్లలోనే 181 పరుగులకు చాప చుట్టేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55), శుభ్‌మన్ గిల్ ( 49 బంతుల్లో 34) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. -
టీమిండియాకు ఊహించని షాక్.. స్వదేశానికి పయనమైన స్టార్ ప్లేయర్
బార్బడోస్ వేదికగా విండీస్‌తో ఇవాళ (జులై 27) జరుగనున్న తొలి వన్డేకు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగలింది. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డే సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. వర్క్ లోడ్ కారణంగా సిరాజ్‌కు విశ్రాంతి కల్పించినట్లు తెలుస్తుంది. వన్డే, టీ20 జట్లలో లేని టీమిండియా సభ్యులతో పాటు సిరాజ్ స్వదేశానికి పయనమయ్యాడని సమాచారం. ఆసియా కప్, వరల్డ్‌కప్‌లను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. విండీస్‌తో రెండో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన సిరాజ్.. గత కొంత కాలంగా నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు. సీనియర్లు బుమ్రా, షమీ గైర్హాజరీలో ఆ ఫార్మాట్, ఈ ఫార్మాట్ అన్న తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలో బిజీగా మారాడు. బిజీగా మారడమే కాకుండా భారత పేస్ విభాగాన్ని విజయవంతంగా ముందుండి నడిపించాడు. త్వరలో టీమిండియా మెగా ఈవెంట్లలో పాల్గొననున్న నేపథ్యంలో సిరాజ్ గాయాల బారిన పడకుండా ఉండేందుకు బీసీసీఐ అతన్ని విండీస్ పర్యటన నుంచి అర్థాంతరంగా స్వదేశానికి పిలిపించింది. సిరాజ్‌కు రీప్లేస్మెంట్ ఎవరనే దానిపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి క్లూ ఇవ్వలేదు. అందుబాటులో ఉన్న బౌలర్లతోనే నెట్టుకురావలన్నది బీసీసీఐ ఆలోచనగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే, విండీస్ ఇవాళ జరుగనున్న తొలి వన్డేలో సిరాజ్ గైర్హాజరీలో ఉమ్రాన్ మాలిక్ టీమిండియా పేస్ విభాగానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం జట్టులో ఉన్న పేసర్లలో ఉమ్రానే ఎక్కువ వన్డేలు (8) ఆడాడు. తొలి వన్డే కోసం ఎంపిక చేసే తుది జట్టులో స్పెషలిస్ట్ పేసర్లుగా ఉమ్రాన్, ఉనద్కత్‌లకు అవకాశం దక్కవచ్చు. పార్ట్ టైమ్ పేసర్లుగా ఆల్‌రౌండర్లు హార్ధిక్, శార్దూల్ ఠాకూర్లు తుది జట్టులో ఉండవచ్చు. -
IND VS WI 2nd Test: రాహుల్ ద్రవిడ్‌కు విశ్రాంతి
వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లు ముగిసాక టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, అతని సహాయక సిబ్బందికి కొన్ని రోజుల పాటు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం విండీస్ సిరీస్ ముగిసాక టీమిండియా.. ఐర్లాండ్‌తో వారి స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌కు వెళ్లకుండా స్వదేశంలో రెస్ట్ తీసుకునేందుకే ద్రవిడ్ బృందానికి బీసీసీఐ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. విండీస్‌తో ఆఖరి రెండు టీ20ల తర్వాత ద్రవిడ్ అండ్ కో యునైటెడ్ స్టేట్స్ (ఆఖరి 2 టీ20లు విండీస్‌లో కాకుండా యుఎస్ఏలో జరుగనున్నాయి) నుంచి నేరుగా భారత్‌కు పయనమవుతుంది. ద్రవిడ్ టీమ్‌లో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో పాటు మరికొంత మంది సభ్యులు ఉన్నారు. సమీప భవిష్యత్తులో టీమిండియాకు ఉన్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా వీరికి విశ్రాంతి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ద్రవిడ్ టీమ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) సిబ్బంది ఐర్లాండ్ పర్యటనను నిర్వహిస్తారు. లక్ష్మణ్ టీమ్‌లో బ్యాటింగ్ కోచ్‌గా హృషికేశ్ కనిత్కర్, బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే ఉన్నారు. కాగా, గతంలోనూ పలు సందర్భాల్లో ద్రవిడ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా కోచింగ్ బాధ్యతలను నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న భారత్ డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారీ విజయం సాధించి, మరో విజయం కోసం తహతహలాడుతుంది. ఈ సిరీస్‌లో భారత్ తదుపరి మరో టెస్ట్ మ్యాచ్, 3 వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది. తొలి టెస్ట్‌లో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ శతకాలు సాధించి, టీమిండియా భారీ స్కోర్‌కు దోహదపడగా.. అశ్విన్ 12 వికెట్లు పడగొట్టి, భారత గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. -
టీమిండియాపై గెలిచి రెండు దశాబ్దాలు దాటిపోయింది.. ఇప్పుడు అస్సలు కాదు..!
ఒకప్పటి మేటి జట్టు వెస్టిండీస్.. టెస్ట్‌ల్లో టీమిండియాపై విజయం సాధించి రెండు దశాబ్దాలు దాటిపోయిందంటే ఎవరైనా నమ్మగలరా..? నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం. విండీస్ జట్టు చివరిసారిగా 2002లో జమైకాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియాపై గెలుపొందింది. అప్పటి నుంచి 21 సంవత్సరాలుగా విండీస్‌కు టీమిండియాపై గెలుపే లేదు. విండీస్‌తో రేపటి నుంచి (జులై 12) తొలి టెస్ట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. మరి 21 సంవత్సరాల తర్వాతైనా విండీస్.. టీమిండియాపై గెలుస్తుందా అంటే..? అసంభవమనే చెప్పాలి. ప్రస్తుత భారత జట్టుకు విండీస్ కనీస పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్్కప్ క్వాలిఫయర్స్‌లో ఆ జట్టు దయనీయ పరిస్థితిని అందరం చూశాం. అయితే ముఖాముఖి రికార్డుల్లో మాత్రం భారత్‌పై విండీస్‌దే పై చేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన 98 మ్యాచ్‌ల్లో.. విండీస్ 30 గెలిస్తే, భారత్ 22 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలు సాధించింది. 46 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. జట్ల వివరాలు.. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయ్‌దేవ్ ఉనద్కత్, నవ్‌దీప్ సైని, ముఖేశ్ కుమార్. వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, త్యాగ్‌నారాయణ్ చంద్రపాల్, రఖీమ్ కార్న్‌వాల్, జోష్వా ద సిల్వా, షనోన్ గాబ్రియల్, జేసన్ హోల్డర్, అల్జారి జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికన్ రిజర్వ్ ఆటగాళ్లు: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్ -
IND VS WI 1st Test: టీమిండియా స్టార్ బౌలర్ ముంగిట అత్యంత అరుదైన రికార్డు
విండీస్‌తో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. డొమినిక వేదికగా రేపటి నుంచి (జులై 12) ప్రారంభం కాబోయే మ్యాచ్‌లో అశ్విన్ మరో 3 వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్లో 700 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా, అంతర్జాతీయ స్థాయిలో 16వ బౌలర్‌గా, ఓవరాల్‌గా ఆరో స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. అశ్విన్‌కు ముందు భారత స్పిన్నర్లు అనిల్ కుంబ్లే (956), హర్భజన్ సింగ్ (711) మాత్రమే 700 వికెట్ల మైలురాయిని అధిగమించారు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 270 మ్యాచ్‌ల్లో (92 టెస్ట్‌లు, 113 వన్డేలు, 65 టీ20లు) 697 వికెట్లు (టెస్ట్‌ల్లో 474, వన్డేల్లో 151, టీ20ల్లో 72) ఉన్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో టీమిండియాకు ఇది తొలి టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుంది. గత రెండు దశాబ్దాల రికార్డును చూస్తే విండీస్‌పై టీమిండియాకు స్పష్టమైన ఆధిక్యత ఉండటంతో ఈ సిరీస్‌లో రోహిత్ సేననే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లలో పోలిస్తే విండీస్ గడ్డపై అశ్విన్‌కు మెరుగైన రికార్డు ఉంది. కరీబియన్ గడ్డపై అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీశాడు. ఇక్కడే కాకుండా ఓవరాల్‌గా చూసినా అశ్విన్‌కు విండీస్‌పై మెరుగైన రికార్డు ఉంది. ఆ జట్టుతో ఆడిన 11 మ్యాచ్‌ల్లో యాష్, 4 సెంచరీల సాయంతో 552 పరుగులు చేసి, 60 వికెట్లు పడగొట్టాడు. విండీస్ గడ్డపై ఆడిన 4 మ్యాచ్‌ల్లో అతను 2 సెంచరీల సాయంతో 58.75 సగటున పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు. చదవండి: టీమిండియాకు చుక్కలు చూపించిన బంగ్లా బౌలర్లు -
బాగా సన్నబడ్డ రోహిత్.. వడపావ్ ముద్రను చెరిపివేసుకున్న టీమిండియా కెప్టెన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా సన్నబడ్డాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందు బాగా వెయిట్ లాస్ అయ్యాడు. బరువు పెరగడంతో ఫీల్డ్‌లో చురుగ్గా ఉండలేకపోయిన హిట్‌మ్యాన్.. ఒబేసిటి కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అమితంగా అభిమానించే వాళ్లు సైతం రోహిత్‌ను పలు సందర్భాల్లో వడాపావ్ అని సంబోధించేవారు. ఓవర్ వెయిట్ కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న రోహిత్.. ఇటీవలికాలంలో పరుగులు చేసేందుకు కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. అసలే నిదానంగా, బద్దకంగా కనిపించే రోహిత్.. బరువు పెరగడంతో మరింత నెమ్మదించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతని స్థాయి ఇన్నింగ్స్ ఆడి చాలాకాలమైంది. అయితే తాజాగా హిట్‌మ్యాన్ వెయిట్‌లాస్ కావడం చూస్తుంటే అతను మునుపటి ఫామ్‌ను అందుకుంటాడని నమ్మకం కలుగుతుంది. అతను బరువు తగ్గేందుకు చాలా శ్రమించినట్లు కనిపిస్తుంది. కఠినమైన డైట్, వ్యాయామాలు చేస్తే తప్పిస్తే అంత ఔట్పుట్ రాదు. రోహిత్‌ను ఇప్పుడు చూసిన వారెవరైనా.. ఏంటీ ఇంత పలచబడ్డాడని అనక మానరు. అంతలా బరువును తగ్గించుకుని ఫిట్‌గా కనిపిస్తున్నాడు రోహిత్. అతనిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరిగినట్లు కనిపిస్తున్నాయి. మునుపటితో పోలిస్తే చాలా హుషారుగా కనిపిస్తున్నాడు. ఇది చూసిన అతని అభిమానులు.. హిట్‌మ్యాన్ ఇదే మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నారు. Captain interviews vice-captain 🎙️pic.twitter.com/xSEfXzqeVG — CricTracker (@Cricketracker) July 11, 2023 కొత్త టెస్ట్ జెర్సీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.. పెదవి విరుస్తున్న అభిమానులు వెస్టిండీస్‌తో సిరీస్ ముందు టీమిండియా ఆటగాళ్లు కొత్త టెస్ట్ జెర్సీల్లో కనిపించారు. డ్రీమ్ ఎలెవెన్ టీమిండియా జెర్సీ స్పాన్సర్షిప్ దక్కించుకోవడంతో ఆ పేరు ముద్రించిన కొత్త కిట్లలో టీమిండియా ఆటగాళ్లు దర్శనమిచ్చారు. కొత్త జెర్సీలో తీసుకున్న సెల్ఫీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిన్న సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా అనూహ్య స్పందన వచ్చింది. హిట్‌మ్యాన్ ఏంటీ.. గుర్తుపట్టలేనంతగా ఇలా సన్నబడిపోయాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ వెయిట్ లాస్ అయినట్లు ఈ జెర్సీలో స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు కొత్త జెర్సీ డిజైన్‌పై టీమిండియా అభిమానులు పెదవి విరుస్తున్నారు. జెర్సీ ఛండాలంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. Indian Top 5 in Tests cricket. pic.twitter.com/cZX1lmS7lq— Johns. (@CricCrazyJohns) July 11, 2023 -
విండీస్ పర్యటనకు జట్ల ఎంపిక పూర్తి.. నలుగురు మాత్రం వెరీ వెరీ స్పెషల్
త్వరలో ప్రారంభంకానున్న వెస్టిండీస్ పర్యటనకు భారత జట్ల ఎంపిక పూర్తయ్యింది. విండీస్ పర్యటనలో భారత్ మూడు ఫార్మాట్ల సిరీస్‌లు ఆడనుంది. ఈ మూడు సిరీస్‌ల కోసం భారత సెలెక్టర్లు మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. అయితే ఈ పర్యటన నిమిత్తం ఎంపిక చేసిన ఆటగాళ్లలో సెలెక్టర్లు నలుగురికి పెద్ద పీట వేశారు. వారు తమకు వెరీ వెరీ స్పెషల్ అన్నట్లుగా వ్యవహరించారు. రోహిత్, కోహ్లిల కంటే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. హిట్‌మ్యాన్, రన్ మెషీన్లను టీ20 జట్టులోకి తీసుకోని సెలెక్టర్లు.. మూడు ఫార్మాట్ల జట్లలో ఆ నలుగరుని ఎంపిక చేసి, వన్డే వరల్డ్‌కప్ కోసం వారిని సిద్దం చేస్తున్నామన్న సంకేతాలిచ్చారు. ఆ నలుగురు ఎవరంటే.. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్. ఈ నలుగరు క్రికెటర్లు టెస్ట్, వన్డే, టీ20 జట్లకు ఎంపికయ్యారు. సెలెక్టర్లు వీరికి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి చూస్తే మూడు ఫార్మాట్ల తుది జట్టలో వీరు ఉండటం ఖాయమని తెలుస్తుంది. గిల్ సూపర్ ఫామ్ దృష్ట్యా ఎలాగూ తుది జట్టులో ఉంటాడు. టీమిండియాకు రెగ్యులర్ వికెట్‌కీపర్ లేనందున ఇషాన్ కిషన్ కూడా లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఒకవేళ సంజూ శాంసన్‌ను కూడా తుది జట్టులోకి తీసుకోవాలని భావిస్తే, ఇషాన్ బ్యాటర్‌గానైనా కొనసాగే అవకాశం ఉంది. టెస్ట్‌ల్లో జడేజాకు అవకాశం ఇచ్చినా.. వన్డే, టీ20ల్లో అక్షర్ పటేల్ స్థానానికి ఢోకా ఉండదు. ఇక ఈ నలుగురిలో మోస్ట్ లక్కీ ఎవరంటే ముకేశ్ కుమారేనని చెప్పాలి. షమీ గైర్హాజరీలో స్పెషలిస్ట్ రైట్ ఆర్మ్ పేసర్ కోటాలో ముకేశ్ జాక్‌పాట్ కొట్టాడు. ఈ నలుగురు విండీస్ పర్యటన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో రాణిస్తే, వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకోవడం ఖాయం. విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. వన్డే సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, చహల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్. టీ20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. విండీస్ పర్యటన వివరాలు.. జులై 12-16- తొలి టెస్ట్, డొమినికా జులై 20-24- రెండో టెస్ట్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌టౌన్ జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌టౌన్ ఆగస్ట్ 1- మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 4- తొలి టీ20, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 6- రెండో టీ20, గయానా ఆగస్ట్ 8- మూడో టీ20, గయానా ఆగస్ట్ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా ఆగస్ట్ 13- ఐదో టీ20, ఫ్లోరిడా -
ఇద్దరు అంతే వెలగబెట్టారు.. పుజారాపై లేని నమ్మకం కోహ్లిపై ఎందుకో..?
వెస్టిండీస్ పర్యటన కోసం ప్రకటించిన భారత టెస్ట్ జట్టులో నయా వాల్ పుజారా పేరు గల్లంతు కావడంపై అతని అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వారితో కొందరు టీమిండియా మాజీలు, విశ్లేషకులు గొంతు కలుపుతున్నారు. పుజారాపై లేని నమ్మకం కోహ్లిపై మాత్రం ఎందుకోనని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు ఒకేలా చెత్త ప్రదర్శనలు చేసినప్పడు కోహ్లిపై సెలెక్టర్లకు ప్రత్యేక ప్రేమ ఎందుకోనని నిలదీస్తున్నారు. ఈ విషయాన్ని గణాంకాల ఆధారంగా రుజువు చేస్తూ సెలెక్టర్ల తీరుపై ధ్వజమెత్తుతున్నారు. 2020 నుంచి పుజారా 28 టెస్ట్‌లు ఆడి 29.69 సగటున పరుగులు చేస్తే, కోహ్లి సైతం అదే యావరేజ్‌తో (25 మ్యాచ్‌ల్లో) పరుగులు చేశాడని, ఇద్దరూ ఒకేలా వెలగబెట్టినప్పుడు కోహ్లిపై మాత్రమే ప్రత్యేకమైన ఇంటరెస్ట్ చూపడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు. పుజారాతో పాటు కోహ్లిని కూడా తప్పిస్తే అతనికీ తెలుసొచ్చేది, అలాగే మిడిలార్డర్లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చినట్లూ ఉండేదని అంటున్నారు. పుజారా, కోహ్లిలను పక్కకు పెడితే 2020 నుంచి టెస్ట్‌ల్లో గిల్ (16 మ్యాచ్‌ల్లో 32.89 సగటు), రహానే (20 మ్యాచ్‌ల్లో 26.50)లు కూడా అడపాదడపా ప్రదర్శనలే చేశారని, వీరితో పోలిస్తే రోహిత్ శర్మ (18 మ్యాచ్‌ల్లో 43.2) ఒక్కడే కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడని గణాంకాలతో సహా సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. అందరూ ఓపెనర్లే.. మిడిలార్డర్లో ఎవరు..? వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన భారత టెస్ట్ జట్టుపై పలువురు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వన్ డౌన్ ఆటగాడు పుజారాను పక్కకు పెట్టారు సరే.. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని ఎక్కడ తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. టెస్ట్ జట్టుకు కొత్తగా ఎంపికైన యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లు ఓపెనర్ బ్యాటర్లేనని, అలాంటప్పుడు పుజారా స్థానాన్ని ఎలా భర్తీ చేయగలరని నిలదీస్తున్నారు. జట్టులో ఆల్రెడీ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్లు ఓపెనర్లుగా ఉన్నప్పుడు కొత్తగా మిడిలార్డర్ బ్యాటర్‌ను తీసుకుని ఉంటే జట్టు సమతూకంగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్‌ను ఎందుకు తీసుకోలేదు..? ఓ మిడిలార్డర్ బ్యాటర్‌పై (పుజారా) వేటు వేసినప్పుడు అతని స్థానాన్ని మరో మిడిలార్డర్ ఆటగాడితోనే భర్తీ చేయాలన్న లాజిక్‌ను సెలెక్టర్లు ఎలా మిస్ అయ్యారని భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. జట్టులో అందరూ ఓపెనర్లనే ఎంపిక చేయకపోతే, దేశవాలీ క్రికెట్లో అద్భుతాలు చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఆటగాడిని తీసుకొని ఉండవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. -
రోహిత్ కు విశ్రాంతి మరి కోహ్లీ సంగతి ఏంటి..!
-
తదుపరి కెప్టెన్ రహానే..!
-
టీమిండియా విండీస్ పర్యటన షెడ్యూల్ ఖరారు..!
3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ల నిమిత్తం భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరనుంది. 2022 జులై 22 నుంచి ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లు ప్రారంభంకానున్నాయి. విండీస్ పర్యటనలో భారత్ తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20లు ఆడనుంది. బీసీసీఐ, విండీస్ క్రికెట్ బోర్డు అందించిన సమాచారం మేరకు ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానం వేదికగా జూలై 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం జూలై 29న తొలి టీ20, ఆగస్టు 1, 2 తేదీల్లో రెండు, మూడు టీ20లు, ఆగస్టు 6, 7 తేదీల్లో చివరి రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. చదవండి: 'వార్నర్ కంటే అవమానాలు.. హార్దిక్ పరిస్థితి అలా కాదుగా' -
జేసన్ రాయ్ విధ్వంసం.. 36 బంతుల్లోనే శతకం
వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జేసన్ రాయ్ విధ్వంసం సృష్టించాడు. 36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో శతక్కొట్టాడు. బార్బడోస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో జేసన్ ఈ ఫీట్‌ను సాధించాడు. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తం 47 బంతులను ఎదుర్కొన్న జేసన్.. 115 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను పొట్టి ఫార్మాట్లో పదో వేగవంతమైన శతకాన్ని సాధించాడు. ఫలితంగా ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ప్రత్యర్ధి కేవలం 137 పరుగులకే చేతులెత్తేయడంతో పర్యాటక జట్టు విజయం సాధించింది. ఈ సునామీ ఇన్నింగ్స్‌తో జేసన్ రాయ్ ఐపీఎల్ జట్లకు ఛాలెంజ్ విసిరాడు. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఇన్నింగ్స్ అతనికి భారీ ధర సమకూర్చి పెట్టే అవకాశం ఉంది. కాగా, రాయ్.. గత ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా క్రికెటర్లకు మరో అవమానం.. పాక్ ఆటగాళ్లకే అందలం -
మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లకు కరోనా..
న్యూయార్క్: కరోనా మహామ్మారి క్రికెట్ ప్రపంచంపై మరోసారి పంజా విసురుతుంది. కొద్ది గంటల క్రితమే ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కాగా.. తాజాగా మరో ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు పాజిటివ్‌గా తేలింది. కీలకమైన విండీస్ పర్యటనకు ముందు అమెరికాలో బస చేస్తున్న ఐర్లాండ్ ఆటగాళ్లు పాల్ స్టిర్లింగ్, షేన్ గెట్‌కేట్ కరోనా బారిన పడ్డారు. వచ్చే ఏడాది జనవరి 8 నుంచి 23 వరకు విండీస్‌తో మూడు వన్డేలు, టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. జట్టులోని ఇద్దరు కీలక ఆటగాళ్లు మహమ్మారి బారిన పడడంతో ఐర్లాండ్ జట్టులో కలవరం మొదలైంది. స్టిర్లింగ్, గెట్కేట్లు ఇద్దరు వేర్వేరుగా 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నట్లు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వీరిద్దరు జనవరి 9న తిరిగి(రెండోసారి పరీక్షల అనంతరం) జట్టులో చేరే అవకాశం ఉందని జట్టు యాజమాన్యం పేర్కొంది. కాగా, పాల్ స్టిర్లింగ్ ఐర్లాండ్ తరఫున 134 వన్డేల్లో 38.09 సగటుతో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీల సాయంతో 4982 పరుగులు, 94 టీ20ల్లో 30.06 సగటుతో ఓ సెంచరీ, 19 హాఫ్ సెంచరీల సాయంతో 2606 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో 43 వన్డే వికెట్లు, 20 టీ20 వికెట్లు ఉన్నాయి. ఇక, షేన్ గెట్‌కేట్ విషయానికొస్తే.. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఐర్లాండ్ తరఫున 4 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. చదవండి: IND Vs SL Final: భారత బౌలర్ల ధాటికి లంక జట్టు విలవిల.. -
క్రికెట్ ఆస్ట్రేలియాకు షాక్.. విదేశీ సిరీస్‌ల నుంచి ఏడుగురు ఔట్
సిడ్నీ: ఐపీఎల్ 2021లో ఆడిన అగ్రశ్రేణి ఆసీస్ క్రికెటర్లు వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనల నుంచి వైదొలుగుతూ, క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు షాకిచ్చారు. ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, సీఏ ఈ రెండు విదేశీ పర్యటనలను ఖరారు చేయగా, ఆసీస్ స్టార్ ఆటగాళ్లు మాత్రం నిరాసక్తత కనబర్చారు . కొందరు వ్యక్తిగత కారణాలు సాకుగా చూపిస్తూ, మరికొందరు గాయాల నుంచి కోలుకోలేదని నివేదికలు సమర్పిస్తూ ఈ రెండు విదేశీ పర్యటనలకు డుమ్మా కొట్టారు. సీనియర్లు డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టాయినీస్‌లు వ్యక్తిగత కారణాల వల్ల తమను ఈ టూర్ కోసం పరిగణించవద్దని విజ్ఞప్తి చేయగా, స్టీవ్ స్మిత్, జే రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, డేనియల్ సామ్స్‌లు ఐపీఎల్ సమయంలో తగిలిన గాయాల కారణంగా జట్టు నుంచి తప్పించమని అభ్యర్ధించారు. టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ నెలలో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆటగాళ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చూపుతూ జట్టుకు దూరంగా ఉండటం సీఏను కలవరపెడుతుంది. ఇదిలా ఉంటే, విండీస్, బంగ్లా టూర్ కోసం 18 మందితో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం ప్రకటించింది. ఆసీస్ జట్టు జూలై 9 నుంచి 24 మధ్య విండీస్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉండగా, బంగ్లాదేశ్‌లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై ఇంకా స్పష్టతరావాల్సి ఉంది. చదవండి: KL RAHUL: ప్రియసఖితో తొలిసారి.. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే -
రీఎంట్రీ ఇచ్చిన ఆసీస్ స్టార్ ఆటగాళ్లు
మెల్బోర్న్: విండీస్‌తో జులై 10 నుంచి ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం 23 మంది సభ్యులతో కూడిన బృందాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సోమవారం ప్రకటించింది. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు దూరమైన స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ పర్యటన నిమిత్తం ఆసీస్ సెలెక్షన్ కమిటీ ఏకంగా నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. అరోన్ ఫించ్ సారథ్యంలోని ఆసీస్ జట్టు విండీస్ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరుగబోయే టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా జంబో జట్టును ప్రకటించింది. జట్టు వివరాలు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఆస్టన్ అగర్, జేసన్ బెహ్రెరెన్డార్ఫ్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మోసిస్ హెన్రిక్స్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రిలే మెరిడిత్, జోష్ ఫిలిప్, కేన్ రిచర్డ్సన్, జై రిచర్డ్సన్, తన్వీర్ సంఘా, డి షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్వెప్సన్, అండ్రూ టై, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా చదవండి: నేను సచిన్ పోస్టర్లు చించితే.. అతను అఫ్రిది ఫోటోలను చించాడు -
హోప్‌పై వేటు వేశారు
సెయింట్ జాన్స్ (అంటిగ్వా): న్యూజిలాండ్‌తో వచ్చే నెలలో మొదలయ్యే టి20, టెస్టు సిరీస్‌లకు వెస్టిండీస్ జట్లను ప్రకటించింది. టెస్టు జట్టులోకి డారెన్ బ్రేవో, హెట్‌మైర్, కీమో పాల్ పునరాగమనం చేయగా... బ్యాట్స్‌మన్ షై హోప్ ఉద్వాసనకు గురయ్యాడు. గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న హోప్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. టెస్టు జట్టుకు సారథిగా జేసన్ హోల్డర్ వ్యవహరించనున్నాడు. వికెట్ కీపర్ ఆండ్రూ ఫ్లెచర్ 2018 తర్వాత తొలిసారి టి20 జట్టులో స్థానం దక్కించుకోవడం విశేషం. కరోనా నేపథ్యంలో తాము న్యూజిలాండ్ పర్యటనలో పాల్గొనలేమని ఆల్‌రౌండర్ ఆండ్రూ రసెల్, ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్, ఎవిన్ లూయిస్‌లు విండీస్ బోర్డుకు తెలియజేయడంతో వారిని పరిగణనలోకి తీసుకోలేదు. టి20 జట్టుకు కీరన్ పొలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. వెస్టిండీస్... న్యూజిలాండ్ పర్యటనను టి20 సిరీస్‌తో ఆరంభించనుంది. నవంబర్ 27, 29, 30వ తేదీల్లో మూడు టి20లను ఆడనున్న కరీబియన్ జట్టు... డిసెంబర్ 3–7, 11–15 మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల్లో కివీస్‌తో తలపడనుంది. -
బంగర్... ఏమిటీ తీరు?
న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన అనంతరం సంజయ్ బంగర్ ప్రవర్తించిన తీరు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మిగతా కోచింగ్ సిబ్బందికి పొడిగింపు ఇచ్చి తనను విస్మరించినందుకు రగిలిపోయిన బంగర్... ఇటీవలి వెస్టిండీస్ పర్యటనలో జట్టుతో పాటు ఉన్న జాతీయ సెలక్టర్ దేవాంగ్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించాడు. హోటల్లోని దేవాంగ్ గాంధీ గదికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఓ దశలో మరింత కోపోద్రిక్తుడయ్యాడు. ఈ విషయమంతా బోర్డు దృష్టికి వచ్చింది. దీంతో బంగర్‌ను ప్రశ్నించాలని నిర్ణయించింది. అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ సునీల్ సుబ్రమణియన్, చీఫ్ కోచ్ రవిశాస్త్రిలను ఘటనపై నివేదిక కోరింది. బంగర్ ఆవేదనలో అర్థం ఉన్నా సెలక్టర్లను ప్రశ్నించే హక్కు అతడికి లేదని స్పష్టంచేసింది. ‘రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ల పనితీరు బాగున్నందుకే కొనసాగింపు ఇచ్చాం. అదేమీ లేని బంగర్ మళ్లీ అవకాశం దక్కుతుందని ఎలా అనుకుంటాడు? ఎవరైనా సరే నిబంధనలు పాటించాల్సిందే. జట్టు మేనేజ్మెంట్ నివేదిక వచ్చాక దానిని క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ) ముందుంచుతాం’ అని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇటీవలి ప్రక్రియలో హెడ్ కోచ్ నియామకాన్ని క్రికెట్ సలహా మండలి చూసుకోగా, సహాయ కోచ్‌లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. మరోవైపు జట్టులోకి తీసుకోకపోవడంపై ఆటగాళ్లు సోషల్ మీడియాలో సెలక్టర్లపై కామెంట్లు చేస్తుండటం పైనా చర్చ నడుస్తోంది. గత సీజన్లో 850 పైగా పరుగులు చేసినా దులీప్ ట్రోఫీకి పరిగణనలోకి తీసుకోని వైనాన్ని సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ షెల్డన్ జాక్సన్ ప్రశ్నించాడు. ఇలాంటివాటిపై చర్యలు తీసుకునేలా సీవోఏ ఓ విధానం రూపొందించాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నారు. -
కోహ్లికి మద్దతు పలికిన పాక్ క్రికెటర్
ఇస్లామాబాద్ : ప్రపంచకప్ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు అప్పగించాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. ప్రపంచకప్ ప్రదర్శనపై ఒక్క సమీక్షా సమావేశం లేకుండానే కోహ్లిని తిరిగి కెప్టెన్‌గా కొనసాగించడాన్ని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ సైతం తప్పుబట్టాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ క్రికెట్ విషయాలపై ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేసే పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ మాత్రం టీమిండియా కెప్టెన్సీ మార్పు అవసరం లేదన్నాడు. కెప్టెన్‌గా కోహ్లినే సరైనవాడని చెప్పుకొచ్చాడు. మంగళవారం ట్విటర్‌రో అభిమానుల అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని.. ‘రోహిత్ శర్మ టీమిండియా సారథ్య బాధ్యతలు చేపడుతాడా?’ అని ప్రశ్నించాడు. దీనికి అక్తర్ ఆ అవసరం లేదని సమాధానమిచ్చాడు. ప్రస్తుతం కోహ్లినే సరైన వాడని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ ఓటమితో జట్టు విభేదాలు తలెత్తాయని, ముఖ్యంగా కోహ్లి, రోహిత్ శర్మకు అసలు పడటం లేదని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కెప్టెన్సీ కాపాడుకోవడానికే కోహ్లి వెస్టిండీస్ పర్యటకు వెళ్తున్నాడనే పుకార్లు వెలువడ్డాయి. వీటిపై కెప్టెన్ కోహ్లి విండీస్ పర్యటనకు ముందు నిర్వహించిన సమావేశంలో స్పష్టతనిచ్చినా ఈ తరహా ప్రచారం ఆగడం లేదు. Not required — Shoaib Akhtar (@shoaib100mph) July 29, 2019 -
అంతా నాన్సెన్స్ : రవిశాస్త్రి
ముంబై : జట్టులో విభేదాలు అంటూ చేస్తున్న ప్రచారమంతా నాన్సెన్స్ అని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కొట్టిపారేశాడు. ప్రపంచకప్ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు తలెత్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆయన ఘాటుగా స్పందించాడు. క్రికెటర్ల భార్యలు బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేస్తున్నారనే వార్తలు కూడా త్వరలో చదువుతారని, పరస్థితి ఆస్థాయికి దిగజారిందన్నాడు. వీండిస్ పర్యటనకు బయల్దేరేముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్ కోహ్లితో కలిసి రవిశాస్త్రి మాట్లాడాడు. ‘జట్టులో ఆటకన్నా ఎవరు గొప్ప కాదు. అది కెప్టెన్ విరాట్ అయినా, నేనైనా.. ఇంకెవరైనా అందరం జట్టుకోసమే ఆలోచించేవాళ్లమే. జట్టులో విభేదాలుంటే అన్ని ఫార్మాట్లలో ఇంత నిలకడగా, ఇన్నేళ్లు ఏ జట్టు రాణించేది కాదు. డ్రెస్సింగ్ రూంలోని ఓ వ్యక్తిగా చెబుతున్నా జట్టులో ఎలాంటి విభేదాలు లేవు’ అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. అయితే ప్రపంచకప్ గెలవాల్సిందని కానీ దురదృష్టవశాత్తు చేజారిందన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ప్రారంభ 30 నిమిషాలు ఎంతో గుణపాఠాన్ని నేర్పిందని చెప్పుకొచ్చాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం జట్టులో అంతా బాగుందని, ఎవరో కావాలని ఇలాంటివి పుట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. కోచ్‌గా రవిశాస్త్రికే తన ఓటని అతనితో ఉన్న అనుబంధాన్ని కోహ్లి మరోసారి ప్రదర్శించాడు. ‘కోచ్ ఎంపిక విషయంపై సీఏసీ ఇప్పటి వరకైతే నన్ను ఏమీ అడగలేదు. అయితే నాకు, శాస్త్రికి మధ్య మంచి సమన్వయం ఉంది. ఆయన కోచ్‌గా కొనసాగాలని కోరుకుంటున్నా. నన్ను అభిప్రాయం అడిగితే మాత్రం ఇదే చెబుతా’ అని కోహ్లి స్పష్టం చేశాడు. విండీస్ పర్యటనలో భాగంగా కోహ్లిసేన ఆగస్టు 3,4న రెండు టీ20లు, 8 నుంచి 14 మధ్య మూడు వన్డేలు, ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 3 మధ్య రెండు టెస్ట్‌లు ఆడనుంది. -
అలాంటిదేమి లేదు.. కోహ్లి వివరణ
ముంబై : ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా ఓటమి అనంతరం ఓపెనర్ రోహిత్ శర్మతో విభేదాలు తలెత్తాయన్నా వార్తలను సారథి విరాట్ కోహ్లి కొట్టిపారేశాడు. వెస్టిండీస్ పర్యటనకు భారత క్రికెట్ జట్టు బయల్దేరి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పలు ఆసక్తిక విషయాలను వెల్లడించాడు. ప్రపంచకప్ ఓటమి ప్రభావం కుర్రాళ్లపై పడకూడదనే ఉద్దేశంతోనే విండీస్ టూర్‌కు విశ్రాంతి తీసుకోలేదని వివరించాడు. ఇక రోహిత్ శర్మతో వాగ్వాదం జరిగిందని, మాట్లాడుకోవడం లేదనేది అసత్యమని తేల్చిచెప్పారు. ‘రోహిత్-కోహ్లి మధ్య విభేదాలు అనే వార్తలు నేను కూడా విన్నాను. డ్రెస్సింగ్ రూంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటేనే విజయం వరిస్తుంది. ఒకవేళ ఆ వార్తలే నిజమైతే.. మేం ఇంత గొప్పగా రాణించేవాళ్లం కాదు. విజయాలు సాధించే వాళ్లం కాదు. నేను ఎవరినైనా ద్వేషిస్తే అది నా ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. నేను రోహిత్‌ని ఎప్పుడు ప్రశంసిస్తూనే ఉంటాను. ప్రపంచకప్ హీరో అయిన రోహిత్‌తో నేను గొడవపడటం ఏంటి. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇవన్నీ సృష్టించడం వల్ల ఎవరు లాభపడ్డారో అందరికీ తెలుసు. డ్రెస్సింగ్ రూంలో సీనియర్లను ఎలా గౌరవిస్తామో.. జూనియర్లతో కూడా అలానే ఉంటాం. టీమిండియా ప్రదర్శన, ఆటగాళ్ల తీరును చూస్తే ఎటుమంటి సమస్యలు మా మధ్య లేవనే అనుకుంటున్నాను. రవి భాయ్(రవి శాస్త్రి)నే కోచ్‌గా కొనసాగిస్తే.. మాకు అది ఆనందమే. ఈ విషయంపై క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)తో నేను మాట్లాడలేదు’అంటూ కోహ్లి వివరించాడు. -
ధోని స్థానాన్ని భర్తీ చేయగలను.. కానీ
ముంబై: టీమిండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని వారసుడిగా పేర్కొంటున్న యువ సంచలనం రిషభ్ పంత్‌పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కెరీర్ ఆరంభంలోనే భారత్ మిస్టర్ 360గా పేరుగాంచిన ఈ యువ ఆటగాడు.. తనదైన స్టైలీష్ ఆటతో అభిమానులను అలరిస్తుంటాడు. దీంతో పంత్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. వెస్టిండీస్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మూడు ఫార్మట్లలో చోటు దక్కించుకున్న పంత్.. టీమిండియా భవిష్యత్ ఆశాకిరణంగా సెలక్టర్లు భావిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘ధోని వంటి దిగ్గజ ఆటగాడి స్థానంలో ఆడుతున్న విషయం తెలుసు. కాని దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తే సమస్యలు ఏర్పాడతాయి. ధోని స్థానాన్ని భర్తీ చేయగలను. కానీ ఇప్పుడే కాదు.. దానికి కొంచెం సమయం పడుతుంది. ఇక అభిమానులు ఏం అనుకుంటున్నారో ఎక్కువగా ఆలోచించను. ప్రస్తుతం నా దృష్టంతా మంచి ప్రదర్శన చేయడం.. ఆటను మెరుగుపరుచుకోవడం. స్టైలీష్‌గా ఆడటం కంటే జట్టు పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం ముఖ్యం. ప్రస్తుతం నేర్చుకునే దశలోనే ఉన్నాను. తప్పిదాలు చేయడం సహజం. కానీ పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకుంటున్నాను. ఇక ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు చేయగలను. ప్రస్తుతం నాలుగు స్థానంలోనైనా దిగడానికి సిద్దం. కీపింగ్‌లో మరింత మెరుగుపడాలి. ధోనిని ఎప్పుడు కలిసినా కీపింగ్ మెళుకువలపై చర్చిస్తుంటా. టెస్టులతోనే నా ఆటలో పరిణితి చెందిందని భావిస్తున్నా. చిన్ననాటి కోచ్‌ల నుంచి ఇప్పటి ప్రధాన కోచ్‌ల వరకు ఆందరూ నా ఆట మెరుగుపడడానికి, ఈ స్థాయికి రావడానికి కృషి చేసిన వారే. వారందరికీ రుణపడి ఉంటాను’అంటూ పంత్ వివరించాడు. -
అందుకే కోహ్లి విశ్రాంతి తీసుకోలేదు!
న్యూఢిల్లీ : ప్రపంచకప్ నిష్క్రమణ అనంతరం భారత జట్టులో గ్రూపు తగాదాలున్నాయనే ఊహాగానాలు వెలువడిన విషయం తెలిసిందే. ప్రధానంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ చెరో క్యాంప్ నడుపుతున్నారనే పుకార్లు హల్చల్ చేసాయి. కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మకు ఇవ్వాలనే డిమాండ్ కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే ఇండియాకు ఇద్దరి కెప్టెన్లను తీసుకొచ్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు... కోహ్లి కెప్టెన్సీని టెస్ట్‌లకే పరిమితం చేస్తూ లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్ బాధ్యతలను రోహిత్‌కు ఇవ్వనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అభద్రతాభావానికి లోనైన కోహ్లి.. విశ్రాంతిని కాదనుకొని వెస్టిండీస్ పర్యటనకు వెళ్తున్నాడనే మాటలు వినిపించాయి. అయితే ఇవన్నీ తప్పుడు మాటలేనని బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపినట్లు టౌమ్స్‌నౌ పేర్కొంది. ప్రపంచకప్ ఓటమి అనంతరం ఆత్మవిశ్వాసం కోల్పోయిన జట్టును వీడి విశ్రాంతి తీసుకోవడం కెప్టెన్‌గా భావ్యం కాదని భావించే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ‘ప్రపంచకప్ నిష్క్రమణ అనంతరం జట్టు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఉన్న జట్టును విండీస్ పర్యటనకు పంపించడం భావ్యం కాదని, ఆటగాళ్లలో సానుకూల ధృక్పథం తీసుకురావాలని భావించాడు. ప్రపంచకప్ ఓటమి జట్టులో ప్రతి ఒక్కరిని బాధపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో జట్టుకు దూరంగా ఉండటం కన్నా జట్టుతో ఉండడమే ఓ కెప్టెన్ కర్తవ్యమని కోహ్లి భావించాడు.’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత జట్లను బీసీసీఐ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లకు కోహ్లినే కెప్టెన్‌గా కొనసాగించింది. -
‘ఆ క్రెడిట్ అంతా గంభీర్‌దే’
న్యూఢిల్లీ: తనలోని టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించినందుకు గౌతం గంభీర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని టీమిండియా యువ పేసర్ నవదీప్ షైనీ పేర్కొన్నాడు. తన కెరీర్ ఎదుగుదలలో గంభీర్ భయ్యా చేసిన సాయాన్ని ఎప్పటికీ మరువలేని తాజాగా తెలిపాడు. విండీస్ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్న షైనీ మాట్లాడుతూ.. తన టాలెంట్‌ను గంభీర్ గుర్తించడమే కాకుండా ఎంతో అండగా నిలిచాడన్నాడు. ‘నా కెరీర్లో గంభీర్ భయ్యా సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఈ స్థాయిలో నేను ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం అతడే. నేను ఏమైనా సాధిస్తే, అందులో గంభీర్ పేరు తప్పక ఉంటుంది. నా ఎదుగుదల క్రెడిట్ అంతా గంభీర్ భయ్యాదే’ అని షైనీ పేర్కొన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో సైతం నవదీప్ షైనీ తన పదునైన బంతులతో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన రెండో ఆటగాడిగా నవదీప్ షైనీ 152.85 కి.మీ వేగంతో రికార్డు నెలకొల్పాడు. దేశవాళీ క్రికెట్లో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. -
ధోని దరఖాస్తుకు ఆమోద ముద్ర!
న్యూఢిల్లీ: ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన దరఖాస్తుకు భారత ఆర్మీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. ఈ మేరకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. విండీస్ పర్యటన నుండి స్వయంగా తప్పుకున్న ధోని.. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో రెండు నెలల పాటు పారామిలటరీ రెజిమెంట్‌లో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా ఆర్మీలో పని చేయడానికి ఇటీవల భారత ఆర్మీ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేశాడు. తాజాగా భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్.. ధోని దరఖాస్తుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం తెలిసింది. ప్యారాచూట్ రెజిమెంట్ బెటాలియన్‌లో రెండు నెలల పాటు శిక్షణ తీసుకుంటాడు. కశ్మీర్ లోయ పరిసర ప్రాంతాల్లో శిక్షణ ఉండే అవకాశం ఉంది. -
విండీస్ సిరీస్‌కు సై
ముంబై: ప్రపంచ కప్ సాధించలేకపోయిన బాధను అధిగమిస్తూ వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియాను ఎంపిక చేసింది జాతీయ సెలక్టర్ల బృందం. విడివిడిగా కాకుండా మూడేసి టి20లు, వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఒకేసారి జట్లను ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఆదివారం ఇక్కడ సమావేశమైన సెలక్టర్లు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు 15 మంది చొప్పున, టెస్టులకు 16 మంది సభ్యుల పేర్లను వెల్లడించారు. వీరిలో పేసర్ నవదీప్ సైనీ (ఢిల్లీ), స్పిన్నర్ రాహుల్ చహర్ (రాజస్తాన్) పూర్తిగా కొత్త ముఖాలు. విశ్రాంతి ఊహాగానాలను తోసిరాజంటూ కెప్టెన్ విరాట్ కోహ్లి మొత్తం పర్యటనలో పాల్గొననున్నాడు. వన్డే ప్రపంచ కప్ జట్టులో ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌పై వేటు పడింది. పనిభారం రీత్యా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను టెస్టులకే పరిమితం చేయగా, ఫిట్నెస్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను పరిగణనలోకి తీసుకోలేదు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరిగే కరీబియన్ పర్యటనలో భారత్ 3 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడుతుంది. హార్దిక్‌ది గాయయా? విశ్రాంతా? మూడు ఫార్మాట్లలోనూ కీలకమైన పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను మొత్తం విండీస్ టూర్‌కే ఎంపిక చేయలేదు. ప్రపంచ కప్‌లో బాగానే రాణించిన హార్దిక్... సెమీస్‌కు వచ్చేసరికి ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. కొంతకాలంగా అతడిని వేధిస్తున్న వెన్నునొప్పి తిరగబెట్టకుండా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. పృథ్వీ షా మళ్లీ మిస్... అరంగేట్రంలోనే సెంచరీతో అదరగొట్టిన యువ సంచలనం పృ థ్వీ షాను ఆ తర్వాత దురదృష్టం వెంటాడుతున్నట్లుంది. పట్టిం చుకోనవసరం లేని ప్రాక్టీస్ మ్యాచ్‌లో క్లిష్టమైన క్యాచ్ అందుకోబోయి పాదం గాయానికి గురై, కెరీర్‌కు కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన పృథ్వీ... ఇప్పుడు మరో గాయంతో వెస్టిండీస్ సిరీస్‌నూ చేజార్చుకున్నాడు. రెండు నెలల క్రితం ముంబై టి20 లీగ్‌లో ఆడుతూ గాయం బారినపడ్డ అతడు ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో ఆడుతున్న భారత ‘ఎ’ జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. విండీస్‌తో టెస్టులకు కొంత సమయం ఉన్నా సెలక్టర్లు పృథ్వీని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో విదేశాల్లో సత్తా చాటేందుకు అతడు ఇంకొంత కాలం ఆగక తప్పలేదు. టెస్టు జట్టు: సభ్యులు 16 ఎంపిక తీరు: మయాంక్ అగర్వాల్, రాహుల్, పుజారా, కోహ్లి, రహానే, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, సాహా, అశ్విన్, జడేజా, కుల్దీప్, షమీ, ఇషాంత్ శర్మ, బుమ్రా, ఉమేశ్ యాదవ్. ఎంపిక తీరు: స్పెషలిస్ట్ మూడో ఓపెనర్‌గా ఎవరినీ తీసుకోలేదు. మయాంక్, రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. అవసరమైతే తెలుగు ఆటగాడు విహారిని ఓపెనింగ్‌కు పరిశీలించే వీలుంది. ఈ కారణంగానే దేశవాళీ, ‘ఎ’ జట్ల తరఫున సెంచరీలతో దుమ్మురేపుతున్న ప్రియాంక్ పాంచాల్ (గుజరాత్), అభిమన్యు ఈశ్వరన్ (బెంగాల్)లకు పిలుపు అందలేదు. ప్రపంచ కప్ టాప్ స్కోరర్ రోహిత్ శర్మకు మళ్లీ అవకాశం దక్కింది. రోహిత్ ఆస్ట్రేలియాలో పర్యటించిన జట్టులోనూ సభ్యుడు. ఏడాదిగా గాయంతో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన వృద్ధిమాన్ సాహాను రెండో వికెట్ కీపర్‌గా తీసుకున్నారు. ఆసీస్ టూర్లో జట్టులో ఉన్న మిగతా నలుగురు పేసర్లకూ స్థానం కల్పించిన సెలెక్టర్లు పేసర్ భువనేశ్వర్‌ను పక్కన పెట్టారు. స్పిన్ బాధ్యతలను అశ్విన్–జడేజా–కుల్దీప్ త్రయం మోయనుంది. వన్డే జట్టు: సభ్యులు 15 ఎంపిక తీరు: రోహిత్ శర్మ, ధావన్, కోహ్లి, రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, పంత్, జడేజా, కుల్దీప్, చహల్, కేదార్ జాదవ్, షమీ, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ. ఎంపిక తీరు: వేలి గాయంతో ప్రపంచ కప్ నుంచి తప్పుకొన్న ఓపెనర్ శిఖర్ ధావన్ ఫిట్నెస్ సాధించడంతో అందుబాటులోకి వచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో నంబర్–4 స్థానం సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో నిఖార్సైన బ్యాట్స్‌మెన్ అయ్యర్, పాండేలకు అవకాశం దక్కింది. సీనియర్ దినేశ్ కార్తీక్‌పై వేటుతో రిషభ్ పంత్ ఏకైక కీపర్‌గా వ్యవహరించనున్నాడు. ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ను తప్పిస్తారని ఊహించినా అతడిపై భరోసా ఉంచారు. ఎడంచేతి వాటం పేసర్ ఖలీల్ పునరాగమనం చేస్తున్నాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ పేరు ప్రస్తావనకు రాలేదు. టి20 జట్టు: సభ్యులు 15 ఎంపిక తీరు: రోహిత్, ధావన్, కోహ్లి, రాహుల్, అయ్యర్, పాండే, పంత్, కృనాల్ పాండ్యా, జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చహర్, దీపక్ చహర్, ఖలీల్, భువనేశ్వర్, నవదీప్ సైనీ. ఎంపిక తీరు: జాతీయ జట్టు సభ్యులుగా సోదర ద్వయం రాహుల్ చహర్ (స్పిన్), దీపక్ చహర్ (పేసర్) తొలిసారి మైదానంలో దిగే వీలుంది. దీపక్ గతంలో ఒక వన్డే, ఒక టి20 ఆడాడు. ఐపీఎల్, ‘ఎ’ జట్టు తరఫున అదరగొట్టిన 19 ఏళ్ల రాహుల్ చహర్ తన ప్రతిభకు గుర్తింపుగా టీమిండియా గడప తొక్కాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లకు పట్టించుకోని వాషింగ్టన్ సుందర్‌కు తిరిగి పిలుపొచ్చింది. మణికట్టు ద్వయం కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్‌ను ఎంపిక చేయకపోవడం గమనార్హం. బుమ్రా అందుబాటులో లేని నేపథ్యంలో షమీని పొట్టి ఫార్మాట్‌కు పరిగణించలేదు. అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ అతడిపై మరింత భారం మోపకుండా ఖలీల్, దీపక్, సైనీ వంటి యువ పేసర్లను పరీక్షించనున్నారు. భువీ ప్రధాన పేసర్‌గా వ్యవహరిస్తాడు.