
3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ల నిమిత్తం భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరనుంది. 2022 జులై 22 నుంచి ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లు ప్రారంభంకానున్నాయి. విండీస్ పర్యటనలో భారత్ తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20లు ఆడనుంది. బీసీసీఐ, విండీస్ క్రికెట్ బోర్డు అందించిన సమాచారం మేరకు ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానం వేదికగా జూలై 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం జూలై 29న తొలి టీ20, ఆగస్టు 1, 2 తేదీల్లో రెండు, మూడు టీ20లు, ఆగస్టు 6, 7 తేదీల్లో చివరి రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.
చదవండి: 'వార్నర్ కంటే అవమానాలు.. హార్దిక్ పరిస్థితి అలా కాదుగా'