Ind Vs WI ODI Series 2022: Team India Land In West Indies Watch Video - Sakshi
Sakshi News home page

Ind Vs WI ODI Series 2022: ఫుల్‌ జోష్‌లో ధావన్‌ సేన.. ద్రవిడ్‌ సర్‌ మీరు కూడానా! వీడియో వైరల్‌..

Published Wed, Jul 20 2022 9:38 AM | Last Updated on Wed, Jul 20 2022 12:04 PM

Ind Vs WI ODI Series 2022: Team India Land In West Indies Watch Video - Sakshi

ధావన్‌, గిల్‌, జడేజా, సిరాజ్‌, ద్రవిడ్‌(PC: Shikhar dhawan instagram)

India tour of West Indies, 2022- Rahul Dravid Joins Dhawan gang Hilarious Video: వన్డే సిరీస్‌ ఆడేందుకై శిఖర్‌ ధావన్‌ సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌లో అడుగుపెట్టింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ట్రినిడాడ్‌కు చేరుకుంది. ఇక ఈ సిరీస్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కాగా.. వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సారథిగా వ్యవహరించనున్నాడు.

కాగా ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా టీ20, వన్డే సిరీస్‌లను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా రెట్టింపు ఉత్సాహంతో విండీస్‌కు పయనమైంది. ఇక జట్టు వరుస విజయాల నేపథ్యంలో ఆటగాళ్లు సహా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం ఫుల్‌జోష్‌లో ఉన్నాడు.

ద్రవిడ్‌ సర్‌ మీరు కూడానా!
విండీస్‌ చేరుకోగానే ధావన్‌ షేర్‌ చేసిన వీడియోలో ద్రవిడ్‌ భాయ్‌ను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ధావన్‌ ముందుండి నడవగా.. శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, చహల్‌, జడేజా, సిరాజ్‌ తమదైన శైలిలో హాయ్‌ అంటూ ఎంట్రీ ఇచ్చారు. ద్రవిడ్‌ భాయ్‌ సైతం వారిని అనుసరిస్తూ చిరునవ్వులు చిందించడం విశేషం. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

‘‘ద్రవిడ్‌ సర్‌ని ఎప్పుడూ ఇలా చూడలేదు.. మీతో పాటు ఆయనను కూడా మార్చేశారు కదా.. యోయో బాయ్స్‌’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా వెస్టిండీస్‌ టూర్‌లో భాగంగా టీమిండియా మూడు వన్డేలతో పాటు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. జూలై 22 నుంచి వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది. ఇక టీ20 సిరీస్‌కు రోహిత్‌ శర్మ అందుబాటులోకి రానున్నాడు. ప్రస్తుతం అతడు హాలిడే మూడ్‌లో ఉన్నాడు. భార్య రితికా, కూతురు సమైరాతో సెలవులను ఎంజాయ్‌ చేస్తున్నాడు.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు:
శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), రవీంద్ర జడేజా(వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుబ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), శార్దూల్‌ ఠాకూర్‌, యజువేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌, ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

చదవండి: India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌.. షెడ్యూల్‌, జట్లు, పూర్తి వివరాలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement