
లాడర్‌హిల్: వెస్టిండీస్‌ను వన్డే సిరీస్‌లో చిత్తు చేసిన భారత్ టి20 సిరీస్‌ను కూడా 3–1తో సొంతం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 59 పరుగులతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
రిషభ్ పంత్ (31 బంతుల్లో 44; 6 ఫోర్లు), రోహిత్ శర్మ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజు సామ్సన్ (23 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (14 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. విండీస్ బౌలర్ మెకాయ్ 4 ఓవర్లలో 66 పరుగులిచ్చాడు. అనంతరం విండీస్ 19.1 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. పూరన్ (24), రావ్‌మన్ పావెల్ (24) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు. భారత బౌలర్లలో అర్‡్షదీప్ 3 వికెట్లు పడగొట్టగా... అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు తీశారు. చివరిదైన ఐదో టి20 నేడు ఇదే మైదానంలో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment