Ind Vs WI T20: Rohit Sharma Shares Pic With Pant And Karthik At Trinidad - Sakshi
Sakshi News home page

Rohit Sharma Latest Photo: వెస్టిండీస్‌కు చేరుకున్న టీమిండియా కెప్టెన్‌.. పంత్‌, డీకేతో పాటు

Published Tue, Jul 26 2022 11:02 AM | Last Updated on Tue, Jul 26 2022 11:56 AM

Ind Vs WI T20 Series: Rohit Reached Trinidad Shares Pic With Pant Karthik - Sakshi

దినేశ్‌ కార్తిక్‌, రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌ (PC: Rohit Sharma Instagram)

India Vs West Indies T20 Series 2022: టీ20 సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ వెస్టిండీస్‌కు చేరుకున్నాడు. అతడితో పాటు టీ20 జట్టులో భాగమైన వెటరన్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ సహా స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ తదితరులు ట్రినిడాడ్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరితో కలిసి దిగిన ఫొటోను రోహిత్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో షేర్‌ చేశాడు. టీమిండియా అభిమానులను ఆకర్షిస్తున్న ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. 

కాగా ఇంగ్లండ్‌ పర్యటన తర్వాత శిఖర్‌ ధావన్‌ సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ సొంతం చేసుకుంది. 

ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య బుధవారం(జూలై 27) నామమాత్రపు ఆఖరి వన్డే జరుగనుంది. ఇక రెండో వన్డే తర్వాత విరామం దొరకడంతో వన్డే జట్టులో భాగమైన టీమిండియా క్రికెటర్లు విండీస్‌ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. టొబాగోలోని పిజియన్‌ పాయింట్‌ బీచ్‌ను సందర్శించి ఎంజాయ్‌ చేశారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 సిరీస్‌ ఆడనుంది. జూలై 29 నుంచి ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆరంభం కానుంది. 

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్‌ హుడా, శ్రేయాస్‌ అయ్యర్, దినేశ్‌ కార్తీక్, రిషబ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్*, భువనేశ్వర్‌ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్‌.. (కరోనా బారిన పడ్డ కేఎల్‌ రాహుల్‌ కోలుకుని, ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న తర్వాత జట్టుతో చేరతాడు)

చదవండి: Shreyas Iyer: సిరీస్‌ గెలిచినా.. ఆ విషయంలో అయ్యర్‌కు నిరాశ! ద్రవిడ్‌ సర్‌ చాలా టెన్షన్‌ పడ్డారు!
Ind Vs WI 2nd ODI: టీమిండియా అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన నాలుగో జట్టుగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement