మెల్‌బోర్న్: విండీస్‌తో జులై 10 నుంచి ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం 23 మంది సభ్యులతో కూడిన బృందాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సోమవారం ప్రకటించింది. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు దూరమైన స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ పర్యటన నిమిత్తం ఆసీస్ సెలెక్షన్ కమిటీ ఏకంగా నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. అరోన్ ఫించ్ సారథ్యంలోని ఆసీస్ జట్టు విండీస్ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరుగబోయే టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా జంబో జట్టును ప్రకటించింది.
జట్టు వివరాలు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఆస్టన్ అగర్, జేసన్ బెహ్రెరెన్డార్ఫ్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మోసిస్ హెన్రిక్స్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రిలే మెరిడిత్, జోష్ ఫిలిప్, కేన్ రిచర్డ్‌సన్, జై రిచర్డ్‌సన్, తన్వీర్ సంఘా, డి షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్వెప్సన్, అండ్రూ టై, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
చదవండి: నేను సచిన్ పోస్టర్లు చించితే.. అతను అఫ్రిది ఫోటోలను చించాడు
Comments
Please login to add a commentAdd a comment