టీమ్ పెయిన్, ఆరోన్ ఫించ్
సిడ్నీ : బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపిన ఈ సంఘటనతో ఆస్ట్రేలియా ప్రధాన ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బెన్‌క్రాఫ్ట్‌లు జట్టుకు దూరమయ్యారు. దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన ఈ ఉదంతం క్రీడా స్పూర్తినే దెబ్బతీసింది. దీంతో అప్పటికప్పుడే స్మిత్, వార్నర్, బెన్‌క్రాఫ్ట్‌లపై నిషేధం విధిస్తూ చర్యలు తీసుకున్న సీఏ.. తాత్కలిక కెప్టెన్‌గా యువ ఆటగాడు, వికెట్ కీపర్ టీమ్ పెయిన్‌ను ప్రకటించింది.
తాజాగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న ఆసీస్ జట్టు కోసం వన్డేలకు టీమ్ పెయిన్, టీ20లకు ఆరోన్ ఫించ్‌ను కెప్టెన్‌లుగా నియమించింది. మంగళవారం ఇంగ్లండ్‌లో పర్యటించే 15 మంది సభ్యులతో కూడిన టీ20, వన్డే జట్టులను ప్రకటించింది. నాథన్ లియోన్, షాన్ మార్ష్‌లు తుదిజట్టులో స్థానం దక్కించుకోగా స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్‌లిన్ చోటు కోల్పోయాడు. వన్డేల్లో ఫించ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. టీ20ల్లో టీమ్ పెయిన్‌కు స్థానం లేకపోవడం గమనార్హం. ఆసీస్ ఇంగ్లండ్‌తో 5 వన్డేలులతో పాటు జింబాంబ్వే, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 ట్రై సిరీస్‌లో ఆడనుంది.
వన్డే జట్టు: టీమ్ పెయిన్ (కెప్టెన్), ఆరోన్ ఫించ్ (వైస్ కెప్టెన్), డీఆర్సీ షార్ట్, ట్రావిస్ హెడ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, షాన్ మార్ష్, అలెక్స్ కారే, మార్కస్ స్టోయినిస్, జోష్ హజల్‌వుడ్, బిల్లీ స్టాన్‌లేక్, ఆండ్రూ టై, కేన్ రిచర్డ్సన్, జేయ్ రిచర్డ్సన్, నాథన్ లియోన్, అస్థోన్ అగర్
టీ20 జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ కారే(వైస్ కెప్టెన్), డీఆర్సీ షార్ట్, ట్రావిస్ హెడ్, గ్లేన్ మాక్స్‌వెల్, నిక్ మాడిసన్, మిచెల్ స్వెప్సన్, జాక్ విల్‌డేర్ ముథ్, మార్కస్ స్టోయినిస్, బిల్లీస్టేన్‌లేక్, ఆండ్రూ టై, కేన్ రిచర్డ్సన్, జేయ్ రిచర్డ్సన్, అస్థోన్ అగర్
Comments
Please login to add a commentAdd a comment