Australia squad
-
రీఎంట్రీ ఇచ్చిన ఆసీస్ స్టార్ ఆటగాళ్లు
మెల్బోర్న్: విండీస్‌తో జులై 10 నుంచి ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం 23 మంది సభ్యులతో కూడిన బృందాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సోమవారం ప్రకటించింది. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు దూరమైన స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ పర్యటన నిమిత్తం ఆసీస్ సెలెక్షన్ కమిటీ ఏకంగా నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. అరోన్ ఫించ్ సారథ్యంలోని ఆసీస్ జట్టు విండీస్ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరుగబోయే టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా జంబో జట్టును ప్రకటించింది. జట్టు వివరాలు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఆస్టన్ అగర్, జేసన్ బెహ్రెరెన్డార్ఫ్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మోసిస్ హెన్రిక్స్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రిలే మెరిడిత్, జోష్ ఫిలిప్, కేన్ రిచర్డ్సన్, జై రిచర్డ్సన్, తన్వీర్ సంఘా, డి షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్వెప్సన్, అండ్రూ టై, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా చదవండి: నేను సచిన్ పోస్టర్లు చించితే.. అతను అఫ్రిది ఫోటోలను చించాడు -
ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్లు!
సిడ్నీ : బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపిన ఈ సంఘటనతో ఆస్ట్రేలియా ప్రధాన ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బెన్‌క్రాఫ్ట్‌లు జట్టుకు దూరమయ్యారు. దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన ఈ ఉదంతం క్రీడా స్పూర్తినే దెబ్బతీసింది. దీంతో అప్పటికప్పుడే స్మిత్, వార్నర్, బెన్‌క్రాఫ్ట్‌లపై నిషేధం విధిస్తూ చర్యలు తీసుకున్న సీఏ.. తాత్కలిక కెప్టెన్‌గా యువ ఆటగాడు, వికెట్ కీపర్ టీమ్ పెయిన్‌ను ప్రకటించింది. తాజాగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న ఆసీస్ జట్టు కోసం వన్డేలకు టీమ్ పెయిన్, టీ20లకు ఆరోన్ ఫించ్‌ను కెప్టెన్లుగా నియమించింది. మంగళవారం ఇంగ్లండ్‌లో పర్యటించే 15 మంది సభ్యులతో కూడిన టీ20, వన్డే జట్టులను ప్రకటించింది. నాథన్ లియోన్, షాన్ మార్ష్‌లు తుదిజట్టులో స్థానం దక్కించుకోగా స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్‌లిన్ చోటు కోల్పోయాడు. వన్డేల్లో ఫించ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. టీ20ల్లో టీమ్ పెయిన్‌కు స్థానం లేకపోవడం గమనార్హం. ఆసీస్ ఇంగ్లండ్‌తో 5 వన్డేలులతో పాటు జింబాంబ్వే, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 ట్రై సిరీస్‌లో ఆడనుంది. వన్డే జట్టు: టీమ్ పెయిన్ (కెప్టెన్), ఆరోన్ ఫించ్ (వైస్ కెప్టెన్), డీఆర్సీ షార్ట్, ట్రావిస్ హెడ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, షాన్ మార్ష్, అలెక్స్ కారే, మార్కస్ స్టోయినిస్, జోష్ హజల్‌వుడ్, బిల్లీ స్టాన్లేక్, ఆండ్రూ టై, కేన్ రిచర్డ్సన్, జేయ్ రిచర్డ్సన్, నాథన్ లియోన్, అస్థోన్ అగర్ టీ20 జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ కారే(వైస్ కెప్టెన్), డీఆర్సీ షార్ట్, ట్రావిస్ హెడ్, గ్లేన్ మాక్స్వెల్, నిక్ మాడిసన్, మిచెల్ స్వెప్సన్, జాక్ విల్డేర్ ముథ్, మార్కస్ స్టోయినిస్, బిల్లీస్టేన్లేక్, ఆండ్రూ టై, కేన్ రిచర్డ్సన్, జేయ్ రిచర్డ్సన్, అస్థోన్ అగర్ -
క్రికెటర్ ప్రశ్నిస్తే.. జట్టులో చోటు!
సిడ్నీ: శ్రీలంక చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమికి కేవలం జట్టులోని ఒకరిద్దరు ఆటగాళ్లనే బలిపశులవులను చేశారన్న ఆస్ట్రేలియా ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా వ్యాఖ్యలు ప్రభావం చూపించాయి. దాంతో మళ్లీ ఆసీస్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చే వారం దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్ కు ఖవాజా ఆసీస్ క్రికెట్ బోర్డు నుంచి పిలుపు అందుకున్నాడు. లంక గడ్డపై- వారి చేతిలోనే మూడు టెస్టుల సిరీస్ లో 3-0తో వైట్ వాష్ కు గురైన తర్వాత.. ఖవాజా, జోయ్ బర్న్స్ లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆస్ట్రేలియా టీమ్ లంకపై టెస్టుల్లో మాత్రమే కాదు, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో వన్డే చరిత్రలోనే తొలిసారిగా 5-0తో వైట్ వాష్ కాలేదా అని ఖవాజా ప్రశ్నించాడు. దీంతో అతడికి మళ్లీ అవకాశం ఇవ్వాలని జట్టు బోర్డు భావించి సఫారీలతో సిరీస్ కు ఎంపిక చేసింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్, షాన్ మార్ష్, హజెల్ వుడ్ సఫారీలతో టెస్టు సిరీస్ లో రాణించేందుకు సన్నద్ధమయ్యారు. జో మెన్నీ అనే ఆటగాడు అరంగేట్రం చేయనున్నాడు. ఇప్పటికే టెస్టు, వన్డేల్లో ఘోర వైఫల్యాలతో ఎదురీదుతున్న ఆసీస్ ఈ టెస్ట్ సిరీస్ నెగ్గి వన్డే సిరీస్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఆస్ట్రేలియా టెస్టు జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్(వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, అడమ్ వోజెస్, షాన్ మార్ష్, మిచెల్ మార్ష్, పీటర్ నెవిల్, జో మెన్నీ, మిచెల్ స్టార్క్, పీటర్ సిడిల్, నాథన్ లియాన్, హజెల్ వుడ్