బార్బడోస్ వేదికగా విండీస్‌తో ఇవాళ (జులై 27) జరుగనున్న తొలి వన్డేకు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగలింది. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డే సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. వర్క్ లోడ్ కారణంగా సిరాజ్‌కు విశ్రాంతి కల్పించినట్లు తెలుస్తుంది. వన్డే, టీ20 జట్లలో లేని టీమిండియా సభ్యులతో పాటు సిరాజ్ స్వదేశానికి పయనమయ్యాడని సమాచారం. ఆసియా కప్, వరల్డ్‌కప్‌లను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
విండీస్‌తో రెండో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన సిరాజ్.. గత కొంత కాలంగా నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు. సీనియర్లు బుమ్రా, షమీ గైర్హాజరీలో ఆ ఫార్మాట్, ఈ ఫార్మాట్ అన్న తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలో బిజీగా మారాడు. బిజీగా మారడమే కాకుండా భారత పేస్ విభాగాన్ని విజయవంతంగా ముందుండి నడిపించాడు.
త్వరలో టీమిండియా మెగా ఈవెంట్లలో పాల్గొననున్న నేపథ్యంలో సిరాజ్ గాయాల బారిన పడకుండా ఉండేందుకు బీసీసీఐ అతన్ని విండీస్ పర్యటన నుంచి అర్థాంతరంగా స్వదేశానికి పిలిపించింది. సిరాజ్‌కు రీప్లేస్‌మెంట్ ఎవరనే దానిపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి క్లూ ఇవ్వలేదు. అందుబాటులో ఉన్న బౌలర్లతోనే నెట్టుకురావలన్నది బీసీసీఐ ఆలోచనగా తెలుస్తుంది.
ఇదిలా ఉంటే, విండీస్ ఇవాళ జరుగనున్న తొలి వన్డేలో సిరాజ్ గైర్హాజరీలో ఉమ్రాన్ మాలిక్ టీమిండియా పేస్ విభాగానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం జట్టులో ఉన్న పేసర్లలో ఉమ్రానే ఎక్కువ వన్డేలు (8) ఆడాడు. తొలి వన్డే కోసం ఎంపిక చేసే తుది జట్టులో స్పెషలిస్ట్ పేసర్లుగా ఉమ్రాన్, ఉనద్కత్‌లకు అవకాశం దక్కవచ్చు. పార్ట్ టైమ్ పేసర్లుగా ఆల్‌రౌండర్లు హార్ధిక్, శార్దూల్ ఠాకూర్‌లు తుది జట్టులో ఉండవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment