టీమిండియా డ్రెస్సింగ్ రూంలో అనుకోని అతిధి.. ఏం చేశాడో చూడండి..! | IND VS WI 1st ODI: Brian Lara Visit Indian Dressing Room At Queen's Park Oval | Sakshi
Sakshi News home page

IND VS WI 1st ODI: టీమిండియా డ్రెస్సింగ్ రూంలో క్రికెట్ దిగ్గ‌జం.. ఏం చేశాడో చూడండి..!

Published Sat, Jul 23 2022 4:01 PM | Last Updated on Sat, Jul 23 2022 4:01 PM

IND VS WI 1st ODI: Brian Lara Visit Indian Dressing Room At Queen's Park Oval - Sakshi

విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, మ్యాచ్‌ అనంతరం గెలుపు సంబురాల్లో ఉన్న టీమిండియా సభ్యులను పలకరించేందుకు ఓ అనుకోని అతిధి భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రత్యక్షమయ్యాడు. మ్యాచ్‌కు వేదిక అయిన ట్రినిడాడ్‌ బ్యాటింగ్‌ దిగ్గజం బ్రియాన్‌ లారాకు స్వస్థలం కావడంతో అతను మ్యాచ్‌ను వీక్షించేందుకు మైదానానికి వచ్చాడు. ఈక్రమంలో స్టాండ్స్‌లో టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను కలిసిన లారా.. అనంతరం భారత జట్టు సభ్యులను విష్‌ చేసేందుకు డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చాడు. 

డ్రెస్సింగ్‌ రూమ్‌లో లారా కనిపించడంతో టీమిండియా సభ్యులు చహల్‌, కెప్టెన్‌ ధవన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లు అతనితో మాట కలిపేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఈ ముగ్గురితో కాసేపు ముచ్చట్లు పెట్టిన లారా అనంతరం అక్కడి నుంచి బయల్దేరాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం వైరలవుతోంది. అంతకుముందు లారా కోచ్‌ ద్రవిడ్‌తో కలిసి దిగిన ఫోటోను కూడా బీసీసీఐ ట్వీటర్‌లో షేర్‌ చేసింది. 'టూ లెజెండ్స్ ఇన్ వ‌న్ ఫ్రేమ్' అంటూ ఈ ఫోటోకు క్యాప్ష‌న్ జోడించింది. ఇదిలా ఉంటే, బ్రియాన్‌ లారా ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైద‌రాబాద్‌ జ‌ట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విషయం తెలిసిందే.


చదవండి: రాహుల్‌ రికార్డును బ్రేక్‌ చేసిన శ్రేయస్‌ అయ్యర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement