విండీస్‌తో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. డొమినిక వేదికగా రేపటి నుంచి (జులై 12) ప్రారంభం కాబోయే మ్యాచ్‌లో అశ్విన్ మరో 3 వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా, అంతర్జాతీయ స్థాయిలో 16వ బౌలర్‌గా, ఓవరాల్‌గా ఆరో స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.
అశ్విన్‌కు ముందు భారత స్పిన్నర్లు అనిల్ కుంబ్లే (956), హర్భజన్ సింగ్ (711) మాత్రమే 700 వికెట్ల మైలురాయిని అధిగమించారు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 270 మ్యాచ్‌ల్లో (92 టెస్ట్‌లు, 113 వన్డేలు, 65 టీ20లు) 697 వికెట్లు (టెస్ట్‌ల్లో 474, వన్డేల్లో 151, టీ20ల్లో 72) ఉన్నాయి.
మ్యాచ్ విషయానికొస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో టీమిండియాకు ఇది తొలి టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుంది. గత రెండు దశాబ్దాల రికార్డును చూస్తే విండీస్‌పై టీమిండియాకు స్పష్టమైన ఆధిక్యత ఉండటంతో ఈ సిరీస్‌లో రోహిత్ సేననే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది.
ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లలో పోలిస్తే విండీస్ గడ్డపై అశ్విన్‌కు మెరుగైన రికార్డు ఉంది. కరీబియన్ గడ్డపై అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీశాడు. ఇక్కడే కాకుండా ఓవరాల్‌గా చూసినా అశ్విన్‌కు విండీస్‌పై మెరుగైన రికార్డు ఉంది. ఆ జట్టుతో ఆడిన 11 మ్యాచ్‌ల్లో యాష్, 4 సెంచరీల సాయంతో 552 పరుగులు చేసి, 60 వికెట్లు పడగొట్టాడు. విండీస్ గడ్డపై ఆడిన 4 మ్యాచ్‌ల్లో అతను 2 సెంచరీల సాయంతో 58.75 సగటున పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment