విండీస్‌లో భారత పర్యటన జులై 12న మొదలయ్యే తొలి టెస్ట్ నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. డొమినికా వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ను దూరదర్శన్ ఛానల్‌తో పాటు జియో సినిమా ఫ్యాన్ కోడ్ యాప్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ తర్వాత దాదాపు నెల పాటు విరామం తీసుకున్న టీమిండియా.. విండీస్‌తో టెస్ట్ సిరీస్ ద్వారా తిరిగి బరిలోకి దిగనుంది. డబ్ల్యూటీసీ 20223-25 సైకిల్‌లో భారత్‌కు ఇది తొలి మ్యాచ్ కావడంతో అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
యువకులు, అనుభవజ్ఞులు జట్టులో ఉండటంతో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ విషయంపై పలు ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్‌లు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. విండీస్‌తో తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు ఇలా ఉండబోతుందంటూ తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి.
వెబ్‌సైట్‌లలో కథనాల విషయాన్ని పక్కన పెడితే.. బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు విండీస్‌తో తొలి టెస్ట్ ద్వారా ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు టెస్ట్ అరంగేట్రం చేయనున్నారని తెలుస్తోంది. యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్ తొలిసారి భారత టెస్ట్ జెర్సీల్లో కనిపించనున్నారని సమాచారం.
ఈ ముగ్గురు తుది జట్టులో ఉండటం ఖాయమని.. ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్, రుతరాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్, ఉనద్కత్, నవ్‌దీప్ సైనీలకు మొండిచెయ్యి తప్పదని తెలుస్తోంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగుతారని, యశస్వి జైస్వాల్.. పుజారా స్థానంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తాడని సమాచారం.
ఆతర్వాత విరాట్ కోహ్లి, అజింక్య రహానే బరిలోకి దిగుతారని, ఇషాన్ కిషన్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని తెలుస్తోంది. ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్‌లు తుది జట్టులో ఉంటారని, స్పెషలిస్ట్ పేసర్‌గా మహ్మద్ సిరాజ్‌తో పాటు ముకేశ్ కుమార్ తుది జట్టులో చోటు దక్కించుకుంటాడని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment