రెండో వన్డేలో టీమిండియాకు కరిబీయన్ జట్టు షాకిచ్చింది. సొంతగడ్డపై సత్తా చాటుతూ భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 36.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష‍్యఛేదనకు బరిలోకి వెస్టీండీస్ తరఫున ఓపెనర్ కైల్ మేయర్స్ 36 పరుగులతో రాణించాడు.
విండీస్ కెప్టెన్ షై హోప్(63 నాటౌట్) అర్ధసెంచరీతో సత్తా చాటాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కీసీ కార్టీ(48) పరుగులతో కెప్టెన్‌కు అండగా నిలిచాడు. కాగా.. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లతో రాణించగా.. కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది. విండీస్ తాజా విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
అంతకుముందు బ్యాటింగ్‌లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. విండీస్ బౌలర్ల ధాటికి 40.5 ఓవర్లలోనే 181 పరుగులకు చాప చుట్టేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55), శుభ్‌మన్ గిల్ ( 49 బంతుల్లో 34) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు.
Comments
Please login to add a commentAdd a comment