త్వరలో ప్రారంభంకానున్న వెస్టిండీస్ పర్యటనకు భారత జట్ల ఎంపిక పూర్తయ్యింది. విండీస్ పర్యటనలో భారత్ మూడు ఫార్మాట్ల సిరీస్‌లు ఆడనుంది. ఈ మూడు సిరీస్‌ల కోసం భారత సెలెక్టర్లు మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. అయితే ఈ పర్యటన నిమిత్తం ఎంపిక చేసిన ఆటగాళ్లలో సెలెక్టర్లు నలుగురికి పెద్ద పీట వేశారు. వారు తమకు వెరీ వెరీ స్పెషల్ అన్నట్లుగా వ్యవహరించారు.
రోహిత్, కోహ్లిల కంటే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. హిట్‌మ్యాన్, రన్ మెషీన్‌లను టీ20 జట్టులోకి తీసుకోని సెలెక్టర్లు.. మూడు ఫార్మాట్ల జట్లలో ఆ నలుగరుని ఎంపిక చేసి, వన్డే వరల్డ్‌కప్ కోసం వారిని సిద్దం చేస్తున్నామన్న సంకేతాలిచ్చారు. ఆ నలుగురు ఎవరంటే.. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్.
ఈ నలుగరు క్రికెటర్లు టెస్ట్, వన్డే, టీ20 జట్లకు ఎంపికయ్యారు. సెలెక్టర్లు వీరికి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి చూస్తే మూడు ఫార్మాట్ల తుది జట్టలో వీరు ఉండటం ఖాయమని తెలుస్తుంది. గిల్ సూపర్ ఫామ్ దృష్ట్యా ఎలాగూ తుది జట్టులో ఉంటాడు. టీమిండియాకు రెగ్యులర్ వికెట్‌కీపర్ లేనందున ఇషాన్ కిషన్ కూడా లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.
ఒకవేళ సంజూ శాంసన్‌ను కూడా తుది జట్టులోకి తీసుకోవాలని భావిస్తే, ఇషాన్ బ్యాటర్‌గానైనా కొనసాగే అవకాశం ఉంది. టెస్ట్‌ల్లో జడేజాకు అవకాశం ఇచ్చినా.. వన్డే, టీ20ల్లో అక్షర్ పటేల్ స్థానానికి ఢోకా ఉండదు. ఇక ఈ నలుగురిలో మోస్ట్ లక్కీ ఎవరంటే ముకేశ్ కుమారేనని చెప్పాలి. షమీ గైర్హాజరీలో స్పెషలిస్ట్ రైట్ ఆర్మ్ పేసర్ కోటాలో ముకేశ్ జాక్‌పాట్ కొట్టాడు. ఈ నలుగురు విండీస్ పర్యటన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో రాణిస్తే, వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకోవడం ఖాయం.
విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
వన్డే సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, చహల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్.
టీ20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
విండీస్ పర్యటన వివరాలు..
జులై 12-16- తొలి టెస్ట్, డొమినికా
జులై 20-24- రెండో టెస్ట్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌టౌన్
జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌టౌన్
ఆగస్ట్ 1- మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
ఆగస్ట్ 4- తొలి టీ20, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
ఆగస్ట్ 6- రెండో టీ20, గయానా
ఆగస్ట్ 8- మూడో టీ20, గయానా
ఆగస్ట్ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా
ఆగస్ట్ 13- ఐదో టీ20, ఫ్లోరిడా
Comments
Please login to add a commentAdd a comment