అర్ధ శతకంతో మెరిసిన ఇషాన్ కిషన్(PC: BCCI)
West Indies vs India, 2nd ODI: వెస్టిండీస్‌తో రెండో వన్డేలో టీమిండియా చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపడం జట్టుకు ఏమాత్రం కలిసిరాలేదు. కాగా బార్బడోస్‌లో శనివారం నాటి మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది.
రోహిత్, కోహ్లి లేకుండానే
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వగా.. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాడు. వీరిద్దరి స్థానంలో సంజూ శాంసన్, అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు. ఇక బార్బడోస్‌లో మొదటి వన్డే మాదిరే రెండో మ్యాచ్‌లోనూ ఇషాన్, కిషన్, శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేశారు.
మరోసారి ఇషాన్ హాఫ్ సెంచరీ
గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ మరోసారి అర్ధ శతకం(55)తో సత్తా చాటగా.. వరుస వైఫల్యాల నేపథ్యంలో గిల్(49 బంతుల్లో 34) ఈసారి పర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో సంజూ శాంసన్ బ్యాటింగ్‌కు రాగా.. నాలుగో స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆడించారు. 18వ ఓవర్ మూడో బంతికి రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ అవుట్ కాగా.. అక్షర్ క్రీజులోకి వచ్చాడు.
బెడిసికొట్టిన ప్రయోగం
ఇక ఆ ఓవర్లో షెఫర్డ్ కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా పరుగుల ఖాతా తెరవలేకపోయిన అతడు.. మరుసటి ఓవర్లో అల్జారీ జోసఫ్ బౌలింగ్‌లో సింగిల్ తీశాడు. అయితే 20 ఓవర్ రెండో బంతికే పెవిలియన్ చేరాడు. విండీస్ పేసర్ షెఫర్డ్ సంధించిన షార్ట్ బాల్‌ను తప్పుగా అంచనా వేసి మూల్యం చెల్లించుకున్నాడు. వికెట్ కీపర్ షాయీ హోప్‌నకు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
సంజూ సైతం..
మొత్తంగా 8 బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే తీసిన అక్షర్.. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. ‘‘మంచి ఛాన్స్‌ను మిస్ చేశావు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా 24.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 113 పరుగులు చేసింది. సంజూ శాంసన్(9), హార్దిక్ పాండ్యా(7) కూడా పూర్తిగా నిరాశపరిచారు. ఇక ఇప్పటికే తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత జట్టు.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందున్న సంగతి తెలిసిందే.
చదవండి: కావాలనే రోహిత్, కోహ్లి లేకుండా! మ్యాచ్ ఓడిపోతేనే! ఆసియా కప్ తర్వాత ఇద్దరూ అవుట్?
Ishan Kishan gets to his fifty. Can he make it a big one here?
— FanCode (@FanCode) July 29, 2023
.
.#INDvWIAdFreeonFanCode #INDvWI pic.twitter.com/FlqtTjBImC
Comments
Please login to add a commentAdd a comment