సంజూ శాంసన్- శుబ్‌మన్ గిల్
West Indies vs India, 4th T20I: వెస్టిండీస్‌తో నాలుగో టీ20 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ భారత ఆటగాళ్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫామ్‌లేమితో సతమతమవుతున్న బ్యాటర్లు తిరిగి పుంజుకోవడానికి ఫ్లోరిడా కంటే మంచి పిచ్ దొరకదని అభిప్రాయపడ్డాడు. కనీసం ఇప్పుడైనా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంచి స్కోర్లు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశాడు.
ఫ్లోరిడాలో టీమిండియాకు కీలక మ్యాచ్
కాగా విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండింటిలో ఓటమిపాలైన టీమిండియా.. మూడో మ్యాచ్‌లో విజయంతో సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య కీలకమైన నాలుగో టీ20 శనివారం జరుగనుంది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా హార్దిక్ సేన రోవ్‌మన్ పావెల్ బృందంతో తలపడనుంది.
ఇక్కడైనా ఫామ్‌లోకి రండి
బ్యాటర్లకు ఫ్లోరిడా పిచ్ అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో వసీం జాఫర్ ఈఎస్‌పీఎన్‌క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘సంజూ శాంసన్ రాణించాల్సి ఉంది. హై స్కోరింగ్‌కు ఆస్కారం ఉన్న గ్రౌండ్‌ను భారత బ్యాటర్లు కచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి.
సంజూ ఒక్కడే కాదు
సంజూతో పాటు.. శుబ్‌మన్ గిల్, జైశ్వాల్‌లకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి. ఫామ్‌లేని ఆటగాళ్లు తిరిగి రిథమ్‌లోకి రావడానికి ఇలాంటి పిచ్‌లను ఉపయోగించుకోవాలి’’ అని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్‌పై ప్రశంసలు కురిపించాడు.
సారథ్య బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నాడని పేర్కొన్నాడు. కాగా తాజా సిరీస్‌లో వెస్టిండీస్‌తో ఇప్పటి వరకు ఆడిన మూడు టీ20లలో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 3, 7, 6 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. ఇక సంజూ రెండు టీ20లలో వరుసగా 12, 7 పరుగులు చేశాడు.
చదవండి: టీమిండియాను భ్రష్టు పట్టిస్తున్నారు.. వీళ్ల కంటే పాక్ నయం: మాజీ క్రికెటర్ ఓవరాక్షన్
Comments
Please login to add a commentAdd a comment