భారతదేశంలో సిరీస్ను అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్లినందుకు దాదాపు 250 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ తెలిపింది. వెస్టిండీస్ జట్టు భారత సిరీస్ను సగంలో వదిలిపెట్టి వెళ్లిపోయినందుకు తమకు భారీ నష్టం వాటిల్లిందని, వెంటనే దీనికి సంబంధించిన పరిష్కారంతో ముందుకు రావాలంటూ వెస్టిండీస్ బోర్డుకు బీసీసీఐ ఓ లేఖ రాసింది. ఇందుకు 15 రోజుల గడువు ఇచ్చింది.
ఒక్క మీడియా హక్కుల రూపంలోనే బీసీసీఐకి 35 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. టికెట్ అమ్మకాల రూపంలో మరో 2 మిలియన్ డాలర్లు, టైటిల్ స్పాన్సర్షిప్ కోసం మైక్రోమాక్స్కు 1.6 మిలియన్ డాలర్లు.. ఇలా భారీ నష్టమే వాటిల్లిందని చెబుతున్నారు. ఇవి కాక ఇంకా నైక్ ఇచ్చిన కిట్ స్పాన్సర్షిప్.. ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటన్నింటినీ వివరిస్తూ వెస్టిండీస్ బోర్డుకు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ లేఖ రాశారు.
రూ. 250 కోట్లు డిమాండ్ చేస్తున్న క్రికెట్ బోర్డు
Published Sat, Nov 1 2014 1:05 PM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM
Advertisement
Advertisement