విరాట్లో నచ్చింది అదే: కుంబ్లే | Will Not Curb Virat Kohli's Aggression: Anil Kumble | Sakshi
Sakshi News home page

విరాట్లో నచ్చింది అదే: కుంబ్లే

Published Mon, Jul 4 2016 3:20 PM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

విరాట్లో నచ్చింది అదే: కుంబ్లే

విరాట్లో నచ్చింది అదే: కుంబ్లే

బెంగళూరు: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిలోని దూకుడును తాను ఎన్నటికీ అడ్డుకోనని ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. విరాట్ కు సహజసిద్ధంగా లభించిన దూకుడు అంటే తనకు కూడా చాలా ఇష్టమన్నాడు. ' నాకు విరాట్లో దూకుడు అంటే ఇష్టం. నేను కూడా నా వరకూ దూకుడుగానే ఉంటా.  కొంతమందికి సహజసిద్ధంగా లభించింది ఏదొకటి ఉంటుంది. ఆటగాళ్లలో ఉన్న వారి సహజత్వాన్ని నేను ఎప్పటికీ అడ్డుకోను. విరాట్ లో నాకు నచ్చింది అతని దూకుడే' అని కుంబ్లే తెలిపాడు.

 

మరో రెండు రోజుల్లో వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా బయల్దేరనుంది. దీనిలో భాగంగా సోమవారం బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కుంబ్లే-విరాట్లో  మాట్లాడారు. తొలుత విరాట్ నాయకత్వంపై కుంబ్లే విశ్వాసం వ్యక్తం చేశాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా మరిన్ని విజయాలను సాధిస్తుందన్న కుంబ్లే.. తమకు విండీస్ పర్యటన ఒక సవాల్ అని పేర్కొన్నాడు. ఆ తరువాత విరాట్ మాట్లాడుతూ.. తమతో అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ ఆటగాడు ఉండటం నిజంగా జట్టు అదృష్టమన్నాడు. అతనికున్న  విశేషమైన అనుభవం కచ్చితంగా జట్టుకు లాభిస్తుందన్నాడు. ప్రస్తుత విండీస్ పర్యటనతో తొలి అంతర్జాతీయ సవాల్కు కుంబ్లే సిద్ధమయ్యాడని విరాట్ అన్నాడు. ఈ సిరీస్ను దిగ్విజయంగా ముగించి తిరిగి రావడమే తమ ముందన్న లక్ష్యమని విరాట్ పేర్కొన్నాడు.

 

విండీస్ పర్యటనలో భారత్ నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. జూలై 21 నుంచి 25 వరకు ఆంటిగ్వాలో తొలి టెస్టు, జూలై 30 నుంచి ఆగస్టు 3 వరకు జమైకాలో రెండో టెస్టు జరుగుతాయి. మూడో టెస్టు ఆగస్టు 9 నుంచి 13 వరకు సెయింట్ లూసియాలో, నాలుగో టెస్టు ఆగస్టు 18 నుంచి 22 వరకు ట్రినిడాడ్‌లో జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement