IPL 2022: England Jason Roy Smashes 36 Ball Century in T20 Series - Sakshi
Sakshi News home page

జేసన్‌ రాయ్‌ విధ్వంసం.. సిక్సర్లతో వీరవిహారం

Published Thu, Jan 20 2022 4:47 PM | Last Updated on Thu, Jan 20 2022 5:40 PM

Jason Roy Smashes 36 Ball Century Ahead Of T20 Series In West Indies - Sakshi

వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జేసన్‌ రాయ్‌ విధ్వంసం సృష్టించాడు. 36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో శతక్కొట్టాడు. బార్బడోస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో జేసన్ ఈ ఫీట్‌ను సాధించాడు. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తం 47 బంతులను ఎదుర్కొన్న జేసన్‌.. 115 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను పొట్టి ఫార్మాట్‌లో పదో వేగవంతమైన శతకాన్ని సాధించాడు.

ఫలితంగా ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ప్రత్యర్ధి కేవలం 137 పరుగులకే చేతులెత్తేయడంతో పర్యాటక జట్టు విజయం సాధించింది. ఈ సునామీ ఇన్నింగ్స్‌తో జేసన్‌ రాయ్‌ ఐపీఎల్‌ జట్లకు ఛాలెంజ్‌ విసిరాడు. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్‌ మెగా వేలం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఇన్నింగ్స్‌ అతనికి భారీ ధర సమకూర్చి పెట్టే అవకాశం ఉంది. కాగా, రాయ్‌.. గత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. 
చదవండి: టీమిండియా క్రికెటర్లకు మరో అవమానం.. పాక్‌ ఆటగాళ్లకే అందలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement