సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-0 తేడాతో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. 2019 తర్వాత కరేబియన్ గడ్డపై టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.
ఇక వర్షం కారణంగా 50 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తొలుత విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.
విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ రావ్‌మన్ పావెల్(54) టాప్ స్కోరర్‌గా నిలవగా..షెఫర్డ్(30) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్, జెమ్మీ ఓవర్టన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 146 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది.
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్(26 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 41) అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. లివింగ్ స్టోన్(39), విల్ జాక్స్(32) పరుగులతో సత్తాచాటారు. విండీస్ స్పిన్నర్ 4 వికెట్లతో చెలరేగినప్పటకి తన జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. ఇక నాలుగో టీ20 ఇరు జట్ల మధ్య నవంబర్ 16న సెయింట్ లూసియా వేదికగా జరగనుంది.
చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 18 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై!
Comments
Please login to add a commentAdd a comment