ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా లియామ్‌ లివింగ్‌స్టోన్‌ | Buttler Ruled Out Of West Indies ODI Series, Livingstone Named Captain | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా లియామ్‌ లివింగ్‌స్టోన్‌

Published Mon, Oct 21 2024 7:50 PM | Last Updated on Mon, Oct 21 2024 7:57 PM

Buttler Ruled Out Of West Indies ODI Series, Livingstone Named Captain

వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ ఈ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. బట్లర్‌ గైర్హాజరీలో ఇంగ్లండ్‌ వన్డే జట్టు కెప్టెన్‌గా లియామ్‌ లివింగ్‌స్టోన్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ సిరీస్‌ కోసం బట్లర్‌ ప్రత్యామ్నాయ ఆటగాడిని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఎంపిక చేయలేదు.

కాగా, ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ సందర్భంగా బట్లర్‌ గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతను వన్డే, టీ20 జట్లకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని విండీస్‌తో సిరీస్‌కు బట్లర్‌ను తొలుత ఎంపిక చేశారు. అయితే బట్లర్‌ పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో ఈసీబీ అతన్ని జట్టు నుంచి తప్పించింది. బట్లర్‌ విండీస్‌తో తదుపరి జరుగబోయే టీ20 సిరీస్‌ సమయానికంతా పూర్తిగా కోలుకుంటాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది.

వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ అక్టోబర్‌ 31, నవంబర్‌ 2, నవంబర్‌ 8 తేదీల్లో జరుగనుంది. అనంతరం నవంబర్‌ 9, 10, 14, 16, 17 తేదీల్లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది. ఈ రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లు విండీస్‌ వేదికగా జరుగనున్నాయి. ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు ప్రస్తుతం పాక్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.

విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌ జట్టు..
లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (వన్డే జట్టు కెప్టెన్‌), విల్‌ జాక్స్‌, డాన్‌ మౌస్లీ, జేకబ్‌ బేతెల్‌, జేమీ ఓవర్టన్‌, సామ్‌ కర్రన్‌, ఫిలిప్‌ సాల్ట్‌, జాఫర్‌ చోహాన్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, సాకిబ్‌ మహమూద్‌, రీస్‌ టాప్లే, జాన్‌ టర్నర్‌

చదవండి: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement