
బ్రిడ్జిటౌన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించింది.
విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ రావ్‌మన్ పావెల్(43) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షెఫార్డ్ 22 పరుగులతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, మౌస్లీ, మహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు అర్చర్, రషీద్ చెరో వికెట్ పడగొట్టారు.
జోస్ బట్లర్ విధ్వంసం..
అనంతరం 159 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 14.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు.
అతడితో పాటు విల్ జాక్స్(38) రాణించాడు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ రెండు, అకిల్ హోస్సేన్ ఓ వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 నవంబర్ 14న సెయింట్ లూసియా వేదికగా జరగనుంది.
చదవండి: IND vs SA: సంజూ శాంసన్ అత్యంత చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు
Comments
Please login to add a commentAdd a comment