![Liam Livingstone's unbeaten century guides England to victory over West Indies in 2nd Odi](/styles/webp/s3/article_images/2024/11/3/Liam-Livingstone1.jpg.webp?itok=O6Q6eMLA)
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో ఇంగ్లండ్ సమం చేసింది. 329 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 47.3 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
లక్ష్య చేధనలో ఇంగ్లండ్ స్టాండింగ్ కెప్టెన్ లైమ్ లివింగ్ స్టోన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. లివింగ్ స్టోన్ 85 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 124 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో లివింగ్ స్టోన్‌తో పాటు సాల్ట్(59), బెతల్(55), సామ్ కుర్రాన్(52) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్ 3 వికెట్లు పడగొట్టగా, జోషఫ్, ఛేజ్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ కెప్టెన్ హోప్(117) విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.
అతడితో పాటు కార్టీ(71), రుథర్‌ఫర్డ్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో టర్నర్, రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, అర్చర్, లివింగ్ స్టోన్ చెరో వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే నవంబర్ 6న బార్బోడస్ వేదికగా జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment