ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో 75 పరుగులతో ఇంగ్లండ్ ఘన విజయం అందుకుంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-2 సమం చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు విధ్వసంం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 3 వికెట్ల నష్టానికి ఏకంగా 267 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. 57 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 119 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో సాల్ట్‌కు వరుసగా ఇది రెండో సెంచరీ.
అతడితో పాటు కెప్టెన్ జోస్ బట్లర్(29 బంతుల్లో 55, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), లివింగ్ స్టోన్(21 బంతుల్లో 54) మెరుపు సెంచరీలతో చెలరేగారు. విండీస్ బౌలర్లలో అకిల్ హోస్సేన్, రస్సెల్, హోల్డర్‌కు చెరో వికెట్ దక్కింది. అనంతరం 268 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 15.10 ఓవర్లలో ఆలౌటైంది.
విండీస్ బ్యాటర్లలో ఆండ్రీ రస్సెల్(51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. పూరన్(39),రూథర్ ఫర్డ్(36) తమ వంతు ప్రయత్నం చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లీ 3 వికెట్లతో చెలరేగగా.. కుర్రాన్, రెహన్ అహ్మద్ తలా వికెట్ పడగొట్టారు. వీరితో పాటు మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్ చెరో వికెట్ సాధించారు. కాగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఐసీసీ ఫుల్‌మెంబర్ జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment