Jason Roy
-
నికోలస్ పూరన్ ఊచకోత.. 6 ఫోర్లు, 7 సిక్సర్లతో..!
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ (61 బంతుల్లో 93; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కైల్ మేయర్స్ (30 బంతుల్లో 60; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు. రిలీ రొస్సో 20, మికైల్ లూయిస్ 10, ఎవిన్ లూయిస్ 2 పరుగులు చేశారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 2, జేడన్ సీల్స్, అకీల్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు.THE NICHOLAS POORAN SHOW IN CPL.- 93* (43) with 6 fours and 7 sixes, the unreal dominance of Pooran. 🤯pic.twitter.com/k1f0CYfCaj— Mufaddal Vohra (@mufaddal_vohra) September 23, 2024అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. నికోలస్ పూరన్ (43 బంతుల్లో 93 నాటౌట్; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జేసన్ రాయ్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కీసీ కార్టీ 13, టిమ్ డేవిడ్ 9, కీరన్ పోలార్డ్ 10 పరుగులు చేశారు. పేట్రియాట్స్ బౌలర్లలో కైల్ మేయర్స్, అన్రిచ్ నోర్జే, తబ్రేజ్ షంషి తలో వికెట్ పడగొట్టారు.కాగా, ప్రస్తుత మ్యాచ్ గెలుపుతో సంబంధం లేకుండా నైట్‌రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. నైట్‌రైడర్స్‌తో పాటు సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్, బార్బడోస్ రాయల్స్ ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌కు చేరాయి. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు అక్టోబర్ 1, 2, 4 తేదీల్లో జరుగనున్నాయి. అక్టోబర్ 6న ఫైనల్ జరుగుతుంది.చదవండి: క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకున్న సౌతాఫ్రికా -
నరైన్, రసెల్ విఫలం.. నైట్‌రైడర్స్ ఓటమి
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో సియాటిల్ ఓర్కాస్ తొలి విజయాన్ని నమోదు చేసింది. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌తో నిన్న (జులై 9) జరిగిన మ్యాచ్‌లో ఓర్కాస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్.. జేసన్ రాయ్ (52 బంతుల్లో 69; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (22 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (5), ఉన్ముక్త్ చంద్ (18), షకీబ్ అల్ హసన్ (7), ఆండ్రీ రసెల్ (14) నిరాశపరిచారు. ఓర్కాస్ బౌలర్లలో జమాన్ ఖాన్, హర్మీత్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. గానన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఓర్కాస్.. ర్యాన్ రికెల్టన్ (66 బంతుల్లో 103; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో విజృంభించడంతో 19.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. రికెల్టన్కు జతగా క్వింటన్ డికాక్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (51 నాటౌట్) ఆడాడు. ఓర్కాస్ కోల్పోయిన ఏకైక వికెట్ (నౌమన్ అన్వర్ (9)) స్పెన్సర్ జాన్సన్‌కు దక్కింది. ఎంఎల్సీ ప్రస్తుత ఎడిషన్‌లో ఆరు మ్యాచ్‌లు అయిన అనంతరం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ ఫ్రీడం టాప్‌లో ఉంది. శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, ఎంఐ న్యూయార్క్, లాస ఏంజెలెస్ నైట్‌రైడర్స్, సీయాటిల్ ఓర్కాస్, టెక్సస్ సూపర్ కింగ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
కేకేఆర్‌లోకి విధ్వంసకర ఆటగాడు.. జేసన్ రాయ్ స్థానంలో..!
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ ఓ విధ్వంసకర ఆటగాడిని జట్టులోకి చేర్చుకుంది. వ్యక్తిగత కారణాల చేత రాబోయే సీజన్‌కు దూరంగా ఉండనున్న ఇంగ్లండ్ ఆటగాడు జేసన్ రాయ్ స్థానాన్ని అదే దేశానికి చెందిన ఫిల్ సాల్ట్‌తో భర్తీ చేసింది. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సాల్ట్‌ను కేకేఆర్ మేనేజ్మెంట్ 1.5 కోట్ల రిజర్వ్ ధరకు సొంతం చేసుకుంది. 2024 సీజన్ వేలంలో సాల్ట్ అన్ సోల్డ్‌గా మిగిలిపోయాడు. రాబోయే సీజన్‌కు సంబంధించి కేకేఆర్‌లో ఇది రెండో మార్పు. ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కిన్సన్ జాతీయ జట్టుకు ఆడాల్సి ఉండటంతో అతను ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్నాడు. దీంతో అతని స్థానాన్ని శ్రీలంక పేసర్ దుష్మంత చమీరాతో భర్తీ చేసింది కేకేఆర్ మేనేజ్మెంట్. కాగా, 27 ఏళ్ల ఫిల్ సాల్ట్‌కు విధ్వంసకర ఆటగాడిగా పేరుంది. ఇంగ్లండ్ తరఫున, లీగ్ క్రికెట్లో ఇతను మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. సాల్ట్‌కు ఐపీఎల్‌లోనూ ఓ మోస్తరు రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో అతను 9 మ్యాచ్‌లు ఆడి 2 అర్దశతకాలు చేశాడు. ఐపీఎల్లో సాల్ట్ స్ట్రయిక్ రేట్ 163.9గా ఉంది. ఇంగ్లండ్ తరఫున 19 వన్డేలు, 21 టీ20లు ఆడిన సాల్ట్.. 3 సెంచరీలు, 5 అర్దసెంచరీల సాయంతో 1258 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లోనూ సాల్ట్ స్ట్రయిక్‌రేట్ ప్రమాదకరంగా ఉంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌కు సంబంధించిన తొలి విడత షెడ్యూల్ ఇదివరకే విడుదలైంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. కేకేఆర్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. తొలి విడతలో కేకేఆర్ మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ తర్వాత కేకేఆర్.. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. -
విండీస్ ప్లేయర్ సిక్సర్ల సునామీ
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో భాగంగా కరాచీ కింగ్స్‌తో నిన్న (ఫిబ్రవరి 29) జరిగిన మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేర్స్ బ్యాటర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ చెలరేగిపోయాడు. 31 బంతుల్లో బౌండరీ, ఆర డజను సిక్సర్ల సాయంతో అజేయమైన 58 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. చివరి బంతికి బౌండరీ బాది గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కరాచీ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. జేమ్స్ విన్స్ (37) టాప్ స్కోరర్‌గా కాగా.. టిమ్ సీఫర్ట్ 21,షోయబ్ మాలిక్ 12, మొహమ్మద్ నవాజ్ 28, పోలార్డ్ 13, ఇర్ఫాన్ ఖాన్ 15, హసన్ అలీ 2 పరుగులు చేశారు. ఆఖర్లో అన్వర్ అలీ (14 బంతుల్లో 25 నాటౌట్) మెరపు ఇన్నింగ్స్ ఆడగా.. జహిద్ మహమూద్ 3 పరుగులతో అజేయంగా నిలిచారు. క్వెట్టా బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్, ఉస్మాన్ తారిక్ తలో 2 వికెట్లు, వసీం ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్వెట్టా.. 5 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయతీరాలకు చేరింది. జేసన్ రాయ్ (31 బంతుల్లో 52; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో అకీల్ హొసేన్ (17 బంతుల్లో 22 నాటౌట్) రూథర్‌ఫోర్డ్‌కు జత కలిశాడు. క్వెట్టా ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ 24, ఖ్వాజా నఫే 2, సర్ఫరాజ్ అహ్మద్ 3, రిలీ రొస్సో 6 పరుగులు చేశారు. కరాచీ బౌలర్లలో హసన్ అలీ, జహిద్ మహమూద్ తలో 2 వికెట్లు.. షోయబ్ మాలిక్ ఓ వికెట్ పడగొట్టారు. -
రఫ్ఫాడించిన రాయ్.. దంచికొట్టిన డికాక్
అబుదాబీ టీ10 లీగ్ 2023లో భాగంగా నిన్న (నవంబర్ 29) జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు చెలరేగిపోయారు. టీమ్ అబుదాబీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్రేవ్స్ ఆటగాడు జేసన్ రాయ్ (39 బంతుల్లో 84 నాటౌట్; 6 ఫోర్లు, 7 సిక్సర్లు).. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బుల్స్ ఆటగాడు క్వింటన్ డికాక్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు).. బంగ్లా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూయార్క్ స్ట్రయికర్స్ ఆటగాడు కుశాల్ పెరీరా (20 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. వీరితో పాటు ఆండ్రీ రసెల్ (5 బంతుల్లో 19 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్ (20 బంతుల్లో 34; ఫోర్, 3 సిక్సర్లు), జాన్సన్ చార్లెస్ (13 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్ (12 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) లాంటి విండీస్ స్టార్లు ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మ్యాచ్ ఫలితాల విషయానికొస్తే.. డెక్కన్ గ్లాడియేటర్స్‌పై ఢిల్లీ బుల్స్ (డికాక్ జట్టు) 9 వికెట్ల తేడాతో.. టీమ్ అబుదాబీపై చెన్నై బ్రేవ్స్ (జేసన్ రాయ్ జట్టు) 4 పరుగుల తేడాతో.. బంగ్లా టైగర్స్‌పై న్యూయార్క్ స్ట్రయికర్స్ (కుశాల్ పెరీరా జట్టు) 8 వికెట్ల తేడాతో విజయాలు సాధించాయి. -
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. వరల్డ్‌కప్ జట్టులో కీలక మార్పు
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. వరల్డ్‌కప్ జట్టులో కీలక మార్పు చేసింది. ముందుగా ప్రకటించిన జట్టులో సభ్యుడైన జేసన్ రాయ్‌పై వేటు వేసి యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకుంది. గత కొద్ది రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్న రాయ్.. కోలుకోకపోవడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2019లో ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రాయ్.. వెన్నునొప్పి కారణంగా ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఈ సిరీస్‌లో రాయ్ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన డేవిడ్ మలాన్.. అద్భుతంగా రాణించి, ఓపెనర్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. మలాన్ ఈ సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 92.33 సగటున, 105.73 స్ట్రయిక్‌రేట్‌తో 277 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో మలాన్ వరల్డ్‌కప్‌లో ఓపెనర్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. మలాన్‌ను జతగా జానీ బెయిర్‌స్టో మరో ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. మలాన్ ఓపెనర్ బెర్త్‌కు ఫస్ట్ ఛాయిస్‌గా మారడం, రాయ్ ఇటీవలికాలంలో పెద్దగా ఫామ్‌లో లేకపోవడంతో అతనిపై వేటు పడింది. అయితే, ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ సిరీస్‌లో పెద్ద ఆకట్టులేకపోయిన హ్యారీ బ్రూక్‌ను రాయ్ స్థానంలో వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. బ్రూక్ ఇతర ఫార్మాట్ల ఫామ్‌ను పరిగణలోకి తీసుకుని ఇంగ్లండ్ సెలెక్టర్లు అతన్ని వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేసి ఉండవచ్చు. బ్రూక్ మిడిలార్డర్ బ్యాటర్ కావడం అతని ఎంపికకు మరో కారణం కావచ్చు. ఇటీవల ముగిసిన హండ్రెడ్ టోర్నీలో బ్రూక్ చేసిన సెంచరీని, కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతని ఫామ్‌ను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుని ఉంవచ్చు. కాగా, ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన 4 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇదే పర్యటనలో అంతకుముందు జరిగిన 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ ప్రపంచ కప్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జో రూట్, డేవిడ్ మలాన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లే, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, డేవిడ్ విల్లీ, సామ్ కర్రన్ -
చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. ప్రపంచంలోనే రెండో క్రికెటర్‌గా..
England vs New Zealand Ben Stokes Record: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో విధ్వంసకర శతకంతో చెలరేగి పలు అరుదైన ఘనతలు సాధించాడు. కాగా వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో 50 ఓవర్ల ఫార్మాట్లో రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న స్టోక్స్ రీఎంట్రీలో తొలిసారి బ్యాట్ ఝులిపించాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కివీస్‌తో తొలి వన్డేతో పునరాగమనం చేసిన స్టోక్స్ 52 పరుగులతో రాణించాడు. అయితే, తదుపరి మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు తీసి అవుటయ్యాడు. ఈ క్రమంలో.. మూడో వన్డేలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. సంచలన ఇన్నింగ్స్‌తో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్లతో 182 పరుగులు సాధించాడు. తద్వారా వన్డేల్లో నాలుగో సెంచరీ చేసిన స్టోక్సీ.. ఈ ఫార్మాట్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఆ రికార్డులు బద్దలు.. ప్రపంచంలో రెండో క్రికెటర్‌గా ఈ క్రమంలో జేసన్ రాయ్ (180; 2018లో ఆస్ట్రేలియాపై) పేరిట ఉన్న ఈ రికార్డును స్టోక్స్ బద్దలు కొట్టాడు. అదే విధంగా.. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగు లేదంటే ఆ తర్వాతి స్థానంలో వచ్చి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. తద్వారా వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ తర్వాత ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో రాస్ టేలర్, ఏబీ డివిలియర్స్, టీమిండియా లెజెండ్ కపిల్ దేవ్లను అధిగమించాడు. వన్డేల్లో నాలుగు లేదంటే ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్లు వీరే! ►వివియన్ రిచర్డ్స్- 189 ►బెన్ స్టోక్స్- 182 ►వివియర్ రిచర్డ్స్- 181 ►రాస్ టేలర్- 181 ►ఏబీ డివిలియర్స్- 176 ►కపిల్ దేవ్- 175 ఒక్క రన్‌తో ధోని, కోహ్లి రికార్డు మిస్ కివీస్‌పై ఇన్నింగ్స్(182)తో.. వన్డేల్లో నాన్ ఓపెనర్‌గా బరిలోకి దిగి అత్యధిక స్కోరు సాధించిన ఆరో ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. చార్ల్స్ కొవంట్రీ(194), వివియన్ రిచర్డ్స్(189), ఫాఫ్ డుప్లెసిస్(185), మహేంద్ర సింగ్ ధోని(183), విరాట్ కోహ్లి(183) ఈ జాబితాలో స్టోక్స్ కంటే ముందున్నారు. ఇదిలా ఉంటే మూడో వన్డేలో ఇంగ్లండ్ 181 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చదవండి: Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి.. One of the greatest of this generation. PERIOD. 🐐 📹 | @BenStokes38 sent New Zealand bowlers to the cleaners, scoring 182 in just 124 balls 🥵#SonySportsNetwork #ENGvsNZ #BenStokes pic.twitter.com/OytoOEqNOb — Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2023 -
ఆసీస్ యువ పేసర్ సంచలనం.. 20 బంతుల్లో 1 పరుగు.. 3 వికెట్లు! వీడియో
Oval Invincibles won by 94 runs- Jason Roy- Heinrich Klaasen: ఆస్ట్రేలియా యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్ సంచలన స్పెల్‌తో మెరిశాడు. ది హండ్రెడ్ లీగ్‌లో అరంగేట్రంలోనే అత్యద్భుత గణాంకాలు నమోదు చేశాడు. 20 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ హండ్రెడ్ లీగ్‌లో జాన్సన్ ఓవల్ ఇన్విసిబుల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో మ్యాచ్‌లో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ టీ20 జట్టుకు ఎంపికైన మరుసటి రోజే 20 డెలివరీల్లో 19 డాట్ బాల్స్ వేసి సంచలనం సృష్టించాడు. మాంచెస్టర్ బ్యాటర్ జోస్ బట్లర్.. జాన్సన్ వేసిన షార్ట్ బంతిని డీప్ స్వ్కేర్ లెగ్ దిశగా ఆడి అతడి బౌలింగ్‌లో ఆ ఒక్క సింగిల్‌కు కారణమయ్యాడు. వేసిన పదకొండో బంతికి ఉసామా మిర్‌ను అవుట్ చేసితొలి వికెట్ తీసిన జాన్సన్.. ఆ తర్వాత టామ్ హార్ట్లీ, జాషువా లిటిల్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఓవల్ ఇన్విసిబుల్ బౌలర్లు గస్ అట్కిన్సన్ రెండు, నాథన్ సోవటెర్ రెండేసి వికెట్లు తీయగా.. స్పెన్సర్ జాన్సర్తో పాటు సునిల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టాడు. సొంతమైదానంలో ఓవల్ బౌలర్ల విజృంభణతో పర్యాటక మాంచెస్టర్ జట్టు 89 బంతులాడి 92 పరుగులకే కుప్పకూలింది. దీంతో.. జేసన్ రాయ్(59), హెన్రిచ్ క్లాసెన్(60) అర్ధ శతకాలతో మెరవడంతో 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసిన ఓవల్ జట్టు భారీ విజయం సాధించింది. మ్యాచ్‌లో మాంచెస్టర్‌పై 94 పరుగుల తేడాతో నెగ్గింది. చదవండి: శ్రేయస్ అయ్యర్ దూరం.. తిలక్ వర్మకు అవకాశం.. అలా అయితే..! Spencer Johnson's 3️⃣ wickets 🔥#TheHundred pic.twitter.com/kyQwS35BOC — The Hundred (@thehundred) August 9, 2023 -
ఇంగ్లండ్ క్రికెట్లో జేసన్ రాయ్ 'కాంట్రాక్ట్ కలకలం'
ఇంగ్లండ్ క్రికెట్లో జేసన్ రాయ్ కాంట్రాక్ట్ రద్దు వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో తాను ఈసీబీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై రాయ్ స్పందించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఈసీబీ కాంట్రాక్ట్ వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన మొదటి ప్రాధాన్యత అని తెలిపాడు. తాను ఈసీబీతో కేవలం ఇంక్రిమెంటల్ కాంట్రాక్ట్ (షెడ్యూల్ లేని సమయానికి డబ్బు వదులుకోవడం) మాత్రమే వదులుకున్నట్లు వివరణ ఇచ్చాడు. ఈసీబీతో తన కాంట్రాక్ట్ యధాతథంగా కొనసాగుతుందని, ఇంగ్లండ్ షెడ్యూల్ లేని సమయంలో తాను మేజర్ లీగ్ క్రికెట్లో ఆడేందుకు ఈసీబీ అధికారులు కూడా అనుమతిచ్చారని, ఈ కాలానికి తనకు ఈసీబీ నుంచి ఎలాంటి రెమ్యూనరేషన్ దక్కదని ఇన్‌స్టా వేదికగా క్లియర్‌గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సింగిల్ ఫార్మాట్ ప్లేయర్‌గా అసలు తనకు ఈసీబీతో సెంట్రల్ కాంట్రాక్టే లేదని వెల్లడించాడు. కాగా, అమెరికా వేదికగా జూలై 13 నుంచి జూలై 30 వరకు జరిగే మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఆడేందుకు జేసన్ రాయ్ ఈసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకుంటున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్‌తో రాయ్ రెండేళ్లకు గాను రూ. 36.8 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కథనాలు ప్రసారమయ్యాయి. ఇదిలా ఉంటే, 33 ఏళ్ల జేసన్ రాయ్‌ను ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ 2 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2023 మధ్యలో కేకేఆర్ టీమ్‌లో చేరిన రాయ్.. ఈ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడి 151కి పైగా స్ట్రయిక్ రేట్‌తో 285 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. చదవండి: ఐపీఎల్లో 18.50 కోట్లు పెడితే ఏం చేయలేకపోయాడు.. అక్కడికి వెళ్లగానే..? -
సంచలన క్యాచ్.. కొంచెం పట్టు తప్పినా అంతే సంగతి!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మైర్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. బౌండరీలైన వద్ద అతను చేసిన విన్యాసం అబ్బురపరిచింది. కొంచెం అటు ఇటు అయినా సిక్సర్ వెళ్లేదే. కానీ హెట్‌మైర్ ఆ తప్పు చేయకుండా చాలా పద్దతిగా.. బ్యాలెన్స్‌తో క్యాచ్ తీసుకోవడం విశేషం. కేకేఆర్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఇది చోటుచేసుకుంది. బౌల్ట్ వేసిన ఓవర్ రెండో బంతిని రాయ్ డీప్ స్వ్కేర్‌లెగ్ దిశగా ఆడాడు. స్లోబాల్ కావడంతో బ్యాట్ ఎడ్జ్‌కు తాకిన బంతి గాల్లోకి లేచింది. అయితే లాంగాఫ్‌లో ఉన్న హెట్‌మైర్ డీప్‌స్క్వేర్ లెగ్ వద్దకు పరిగెత్తుకొచ్చి గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. అయితే కొంచెం పట్టు తప్పినా హెట్‌మైర్ బౌండరీ రోప్‌ను తాకేవాడే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Shimron Hetmyer takes a stunner to dismiss Jason Roy. pic.twitter.com/6Syx5Whdjo — Cricket is Love ❤ (@cricketfan__) May 11, 2023 చదవండి: 'మా కెప్టెన్ బ్యాటింగ్ విఫలం వెనుక సీక్రెట్ అదే!' -
SRH Vs KKR: కేకేఆర్‌తో పోరుకు సన్‌రైజర్స్ సై! అతడికి నో ఛాన్స్!
IPL 2023 SRH Vs KKR: సొంతగడ్డపై.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్-2023లో గత మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఓడించిన రైజర్స్.. కోల్‌కతాపై విజయపరంపరను కొనసాగించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఈడెన్ గార్డెన్స్‌తో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని నితీశ్ రాణా సేన ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మ్యాచ్ మరింత రసవత్తరంగా మారనుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఒకే ఒక మార్పు.. ! రాయ్ వచ్చేస్తున్నాడు! దాదాపుగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆడిన జట్టునే కొనసాగించనున్న రైజర్స్.. అకీల్ హొసేన్ స్థానంలో మార్కో జాన్సెన్ను తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. ఇంగ్లంగ్ విధ్వంసకర వీరుడు జేసన్ రాయ్ పూర్తి ఫిట్‌గా ఉన్న నేపథ్యంలో కేకేఆర్ డేవిడ్ వీజ్ స్థానాన్ని అతడితో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాయ్ రాకతో కోల్‌కతా బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టం కానుంది. కాగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన జేసన్ రాయ్ 160 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్థ శతకం(61) ఉంది. ముఖాముఖి పోరులో ఐపీఎల్లో ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్- కేకేఆర్ మధ్య 24 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో హైదరాబాద్ కేవలం తొమ్మిదింట విజయాలు సాధించగా.. 15 సార్లు గెలుపు కేకేఆర్ననే వరించింది. అయితే, గత మ్యాచ్‌లో కేకేఆర్‌పై 23 పరుగులతో పైచేయి సాధించడం ద్వారా ఎస్ఆర్హెచ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. పిచ్, వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉన్న నేపథ్యంలో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. పిచ్‌పై పచ్చిక ఉన్న నేపథ్యంలో ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించే పరిస్థితి ఉంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ తుది జట్లు(అంచనా) సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్. కోల్‌కతా నైట్ రైడర్స్ జేసన్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ. చదవండి: నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్ దక్కకుండా చేస్తాడు: ఇషాన్ కిషన్ చిన్నప్పటి నుంచే అశ్విన్‌కు నాపై క్రష్! స్కూల్ మొత్తం తెలుసు! ఓరోజు.. It's time for Physix practicals says Prof. Klaasen 🥼🔥 pic.twitter.com/CHNQ0LKF8P — SunRisers Hyderabad (@SunRisers) May 4, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేకేఆర్ హీరో జాసన్ రాయ్‌కు భారీ జరిమానా..
ఐపీఎల్-2023లో చిన్నస్వామి స్టేడియం వేదికగా జగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో తన హోం గ్రౌండ్‌లోనే ఆర్సీబీని చిత్తు చేసింది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(54), లామ్రోర్(34) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు, రస్సెల్, సుయాష్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులుచేసింది. కేకేఆర్ బ్యాటర్లలో జాసన్ రాయ్(56), నితీష్ రాణా(48) పరుగులతో రాణించారు. జాసన్ రాయ్‌కు జరిమానా ఇక ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కేకేఆర్ ఓపెనర్ జాసన్ రాయ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రాయ్‌కు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు. అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. అతడు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.2ను రాయ్ ఉల్లంఘించినట్లు తెలిపింది. ఈ నియమం ప్రకారం ఆటగాడు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తే జరిమానా విధిస్తారు. అయితే రాయ్ ఏమి నేరం చేశాడన్నది ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించలేదు. చదవండి: Shahbaz Ahmed: 2.4 కోట్లు పెట్టి కొన్నారు.. గల్లీ క్రికెటర్ కంటే హీనం.. పైగా ఆల్‌రౌండరట..! -
#JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్ అహ్మద్‌ను ఉతికారేశాడు
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్ ఓపెనర్ జేసన్ రాయ్ వరుసగా రెండో అర్థశతకం సాధించాడు. బుధవారం ఆర్సీబీతో మ్యాచ్‌లో ఆరంభం నుంచే ధాటిగా ఆడిన రాయ్ 22 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన షాబాజ్ అహ్మద్‌కు జేసన్ రాయ్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో నాలుగు సిక్సర్లు బాదిన రాయ్ 24 పరుగులు పిండుకొని ఉతికారేశాడు. ఇక మ్యాచ్‌లో 29 బంతుల్లో 56 పరుగులు చేసిన జేసన్ రాయ్ విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. Oh boy, this Roy can bat! 👏#RCBvKKR #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @JasonRoy20 @KKRiders pic.twitter.com/QVYc2ZuZ2b — JioCinema (@JioCinema) April 26, 2023 చదవండి: Virat Kohli: చరిత్రకెక్కిన కోహ్లి.. 580 రోజుల తర్వాత -
కేకేఆర్‌కు గుడ్ న్యూస్.. విధ్వంసకర బ్యాటర్ వచ్చేస్తున్నాడు..!
ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి ముందే కీలక ఆటగాళ్లు దూరమై, సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలై నానా తంటాలు పడుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఇవాళ (ఏప్రిల్ 5) ఓ గుడ్‌న్యూస్ మరో బ్యాడ్‌న్యూస్ తెలిసింది. విధ్వంసకర బ్యాటర్, ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది కేకేఆర్ యాజమాన్యం. బేస్‌ప్రైజ్ రూ. 1.5 కోట్లకు అదనంగా మరో 1.3 కోట్లు (2.8 కోట్లు) చెల్లించి రాయ్‌ను సొంతం చేసుకుంది కేకేఆర్ మేనేజ్మెంట్. ఐపీఎల్లో 2017, 2018, 2021 సీజన్లు ఆడిన రాయ్.. చివరిసారిగా 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ కెరీర్లో 13 మ్యాచ్‌లు ఆడిన రాయ్ 129 స్ట్రయిక్‌రేట్‌తో 329 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. బ్యాడ్‌న్యూస్ ఏంటంటే.. గత కొన్ని సీజన్లుగా ఏదీ కలిసి రాక, ప్లేఆఫ్స్‌కు చేరేందకు కూడా అష్టకష్టాలు పడుతున్న కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సీజన్ మొత్తానికే దూరంగా కానున్నాడని తెలిసే లోపే మరో కీలక ఆటగాడు షకీబ్ అల్ హసన్ బాంబు పేల్చాడు. షకీబ్ కూడా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడం లేదని ప్రకటించాడు. అంతర్జాతీయంగా ఉన్న కమిట్మెంట్లు, వ్యక్తిగత కారణాల చేత ఐపీఎల్-2023కు అందుబాటులో ఉండటం కుదరదని షకీబ్ పేర్కొన్నాడు. మరోవైపు బంగ్లాదేశ్‌కే చెందిన లిటన్ దాస్ కూడా ఏప్రిల్ 10 వరకు ఉండటం లేదు. ఐర్లాండ్‌తో టెస్ట్ సిరీస్ కారణంగా లిటన్ 10వ తేదీ వరకు ఫ్రాంచైజీని గడువు కోరినట్లు సమాచారం. కాగా, శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో నితీశ్ రాణా కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతలు మోస్తున్న విషయం తెలిసిందే. రాణా సారథ్యంలో పంజాబ్ కింగ్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన కేకేఆర్.. డవ్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భానుక రాజపక్ష (50), కెప్టెన్ శిఖర్ ధవన్ (40) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన కేకేఆర్ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్థతిలో పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు. -
జేసన్ రాయ్ విధ్వంసకర శతకం.. టీ20ల్లో అతి భారీ లక్ష్యఛేదన రికార్డు
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పరుగుల ప్రవాహం పతాక స్థాయికి చేరింది. క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ జట్ల మధ్య నిన్న (మార్చి 8) జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు విధ్వంసకర శతకాలతో రెచ్చిపోవడంతో భారీ స్కోర్లు నమోదవ్వడంతో పాటు పలు రికార్డులు బద్దలయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలో (ఆసియా పరిధిలో) అతి భారీ లక్ష్యఛేదన రికార్డు ఈ మ్యాచ్‌లోనే నమోదైంది. Jersey # 56 lives rent-free in our hearts 🥰#SabSitarayHumaray l #HBLPSL8 l #PZvQG pic.twitter.com/e6HsozWROG — PakistanSuperLeague (@thePSLt20) March 8, 2023 పెషావర్ జల్మీ నిర్ధేశించిన 241 పరుగుల భారీ లక్ష్యాన్ని క్వెట్టా గ్లాడియేటర్స్ మరో 10 బంతులు మిగిలుండగానే ఊదేసి, ఆసియాలోనే అతి భారీ లక్ష్య ఛేదన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఊపుతో ఆ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే టీ20ల్లో మొట్టమొదటిసారి 300 పరుగుల టీమ్ స్కోర్ నమోదయ్యేది. B for Babar, B for Best 💯 Best in the world for a reason 👑#PZvQG #PSL8 #BabarAzam𓃵pic.twitter.com/XwoWJFjJOl — Cricket Pakistan (@cricketpakcompk) March 8, 2023 తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ.. బాబర్ ఆజమ్ (65 బంతుల్లో 115; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో, సైమ్ అయూబ్ (34 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), రోవమన్ పావెల్ (18 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. Roy, oh ROY! Celebrate all you want @TeamQuetta 😍#SabSitarayHumaray l #HBLPSL8 I #PZvQG pic.twitter.com/QghDUv9BQ9 — PakistanSuperLeague (@thePSLt20) March 8, 2023 60 బంతుల్లోనే శతక్కొట్టిన పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు ఇది పీఎస్ఎల్లో తొలి సెంచరీ కాగా.. పీఎస్ఎల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్ల (15) రికార్డు కూడా బాబర్ ఖాతాలోకే వెళ్లింది. అయితే గంట వ్యవధిలోనే ఈ రికార్డు తారుమారైంది. 241 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్.. జేసన్ రాయ్ (63 బంతుల్లో 145 నాటౌట్; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) సునామీ శతకంతో శివాలెత్తడంతో 18.2 ఓవర్లలోనే రికార్డు విజయం సాధించింది. New ball please ☝️🏽 because @Ravipowell26 has SENT IT OUTTA THE PARK! #SabSitarayHumaray l #HBLPSL8 l #PZvQG pic.twitter.com/Q8OA4uBA71 — PakistanSuperLeague (@thePSLt20) March 8, 2023 రాయ్‌కు మార్టిన్ గప్తిల్ (8 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్), విల్ స్మీడ్ (22 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), మహ్మద్ హఫీజ్ (18 బంతుల్లో 41 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో ఎండ్ నుంచి పూర్తిగా సహకరించారు. ఫలితంగా గ్లాడియేటర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాయ్ విధ్వంసం ధాటికి 3 పెషావర్ బౌలర్లు 11 ఓవర్లలో 167 పరుగులు సమర్పించుకున్నారు. ఈ క్రమంలో రాయ్ పీఎస్ఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (145 నాటౌట్) రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు పీఎస్ఎల్ టాప్ స్కోర్ రికార్డు కొలిన్ ఇంగ్రామ్ (127) పేరిట ఉండేది. 𝐊𝐢𝐧𝐠 𝐁𝐚𝐛𝐚𝐫 - 𝐑𝐞𝐜𝐨𝐫𝐝 𝐁𝐫𝐞𝐚𝐤𝐞𝐫 👑#PSL8 #PzvQG pic.twitter.com/By7yTLXrRy — Cricket Pakistan (@cricketpakcompk) March 8, 2023 -
జేసన్ రాయ్ విధ్వంసం; సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్
ఢాకా వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఓపెనర్ జేసన్ రాయ్(124 బంతుల్లో 132, 18 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ బట్లర్ 76 పరుగులతో రాణించాడు. చివర్లో మొయిన్ అలీ 42 నాటౌట్, సామ్ కరన్(19 బంతుల్లో 33 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. మెహదీ హసన్ రెండు, షకీబ్ , తైజుల్ ఇస్లామ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 194 పరుగులకే కుప్పకూలింది. షకీబ్ అల్ హసన్ 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తమీమ్ ఇక్బాల్ 35 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్, ఆదిల్ రషీద్‌లు చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు. ఈ విజయం ఇంగ్లండ్ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య మూడో వన్డేమ్యాచ్ సోమవారం(మార్చి 6న) చట్టోగ్రామ్ వేదికగా జరగనుంది. సెంచరీతో చెలరేగిన జేసన్ రాయ్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. -
బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. ఆ మాత్రం దానికి అంపైరింగ్ ఎందుకు?
క్రికెట్లో ఆటగాళ్లతో పాటు అంపైర్ల పాత్ర కూడా చాలా కీలకం. బౌలర్ ఎన్ని బంతులు వేస్తున్నాడు.. బ్యాటర్లు ఎన్ని పరుగులు తీశారు.. వైడ్ బాల్స్, నో బాల్స్, సిక్సర్లు, బౌండరీలు, క్యాచ్‌లు, ఎల్బీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఫీల్డ్ ఉన్న ఇద్దరు అంపైర్లు చాలా బిజీగా ఉంటారు. ఒక్కోసారి ఆటగాళ్ల మధ్య గొడవలు జరిగితే రాజీ కుదర్చడం కూడా అంపైర్ల బాధ్యత. బాధ్యతతో కూడిన అంపైరింగ్‌లో నిర్లక్ష్యం వహించడం ఎప్పుడైనా చూశారా. చూడకపోతే మాత్రం సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్‌ను రీక్యాప్ చేయండి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లెగ్ అంపైర్ మరాయిస్ ఎరాస్మస్ బౌలర్ వేసిన బంతిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకోవడం కనిపించింది. ఇందులో మరొక విషమేంటంటే.. ఆ సమయంలో ఎరాస్మస్ వెనక్కి తిరిగి చేతితో ఏదో లెక్కబెడుతున్నట్లు కనిపించింది. అప్పటికే అన్రిచ్ నోర్ట్జే బంతి వేయడం.. క్రీజులో ఉన్న జేసన్ రాయ్ షాట్ ఆడడం జరిగిపోయాయి. ఇంగ్లండ్ బ్యాటర్లు పరిగెత్తే సమయంలో అంపైర్ ఎరాస్మస్ అప్పుడే మేల్కొన్నట్లు ముందుకు తిరగడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా 24వ ఓవర్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోనూ చూసిన అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ''వన్డే క్రికెట్‌పై బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. అంపైర్ పని కాకుండా అంత బిజీగా ఏం చేస్తున్నాడబ్బా.. పట్టించుకోవడం లేదు కాబట్టే ప్రతీది థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేస్తున్నారనుకుంటా.. గుత్కా సుప్రీమసీ అంటూ కామెంట్స్ చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 27 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. వాండర్ డుసెన్ (117 బంతుల్లో 111 పరుగులు, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో మెరవగా.. డేవిడ్ మిల్లర్ 53 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటై 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్ జేసన్ రాయ్(91 బంతుల్లో 113 పరుగులు, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు సెంచరీ వృథాగా మారింది. డేవిడ్ మలన్(59 పరుగులు)మినహా మిగతావారు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేకపోయారు. ప్రొటిస్ బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే నాలుగు వికెట్లు పడగొట్టగా.. సిసందా మగల మూడు, కగిసో రబడా రెండు, తబ్రెయిజ్ షంసీ ఒక వికెట్ తీశాడు. pic.twitter.com/KKPnERRMuw — 🗂️ (@TopEdgeCricket2) January 27, 2023 చదవండి: 'ప్రయోగాలకు స్వస్తి పలకండి'.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం -
Video: స్టార్క్ దెబ్బ.. రాయ్‌కు దిమ్మతిరిగిపోయింది! వైరల్ వీడియో
England tour of Australia, 2022 - Australia vs England: ఆస్ట్రేలియాతో మొదటి వన్డే నేపథ్యంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ పూర్తిగా నిరాశపరిచాడు. అడిలైడ్ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో అతడిని పెవిలియన్‌కు పంపాడు. బిక్క ముఖం వేసిన రాయ్ ఐదో ఓవర్ రెండో బంతికి రాయ్‌ను బోల్తా కొట్టించాడు. బాల్ దూసుకురావడంతో షాట్‌కు యత్నించాలో లేదో తెలియక తికమక పడ్డాడు రాయ్. అంతలోనే బ్యాట్, ప్యాడ్స్‌కు మధ్య నుంచి దూసుకెళ్లిన బంతి వికెట్‌ను తాకింది. దీంతో బౌల్డ్ అయిన జేసన్ రాయ్ బిక్క ముఖం వేసి మైదానాన్ని వీడాడు. కాగా గత కొన్నాళ్లుగా విఫలమవుతున్న జేసన్‌రాయ్‌కు టీ20 ప్రపంచకప్-2022 జట్టులో చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆఖరి టీ20, వన్డే మ్యాచ్ ఆడిన అతడికి.. చాలా కాలం తర్వాత జట్టులో చోటు దక్కింది. అయినా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేక రాయ్ చతికిలపడ్డాడు. కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో మొదటి వన్డేలో ఓపెనర్లుగా బరిలోకి దిగిన రాయ్, ఫిలిప్ సాల్ట్ వరుసగా 6, 14 పరుగులు మాత్రమే చేయగా.. డేవిడ్ మలన్ అద్బుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. చదవండి: కోహ్లిని చూసి నేర్చుకో! మొండితనం పనికిరాదు.. జిడ్డులా పట్టుకుని వేలాడుతూ: పాక్ మాజీ క్రికెటర్ STARC! A trademark inswinger from the big quick! #AUSvENG#PlayOfTheDay | #Dettol pic.twitter.com/94zYtKeNOE — cricket.com.au (@cricketcomau) November 17, 2022 -
జాసన్ రాయ్‌కు షాకిచ్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 2022-23 సీజన్‌కుగానూ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను మంగళవారం ప్రకటించింది. ఇంగ్లండ్ పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ ఫోక్స్ తొలి సారి సెంట్రల్ కాంట్రాక్ట్(ఫుల్‌టైమ్)ను పొందారు. అదే విధంగా ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ తొలిసారి తన సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. అయితే, అతడికి ఇంక్రిమెంట్ కాంట్రాక్ట్ లిస్టులో చోటు దక్కింది. కాగా రాయ్ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందిలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని డిమోట్ చేయడం గమనార్హం. ఇక ఈ సీజన్‌కు గానూ మొత్తం 30 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కింది. అందులో 18 మందికి ఫుల్ టైమ్కాంట్రాక్ట్ , ఆరుగురికి ఇంక్రిమెంట్ కాంట్రాక్ట్, మరో ఆరుగురుకి పేస్ బౌలింగ్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ లభించింది. కాగా జాసన్ రాయ్‌తో పాటు డోమ్ బెస్, రోరీ బర్న్స్, క్రిస్ జోర్డాన్, టామ్ కర్రాన్ కూడా తమ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయారు. ఇంగ్లండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్స్: మొయిన్ అలీ (వార్విక్షైర్), జేమ్స్ ఆండర్సన్ (లంకాషైర్), జోఫ్రా ఆర్చర్ (ససెక్స్), జోనాథన్ బెయిర్‌స్టో (యార్క్‌షైర్) స్టువర్ట్ బ్రాడ్ (నాటింగ్‌హామ్‌షైర్) జోస్ బట్లర్ (లంకాషైర్) జాక్ క్రాలే (కెంట్) సామ్ కర్రాన్ (సర్రే) బెన్ ఫోక్స్ (సర్రే) జాక్ లీచ్ (సోమర్సెట్) లియామ్ లివింగ్‌స్టోన్ (లంకాషైర్) ఒల్లీ పోప్ (సర్రే) ఆదిల్ రషీద్ (యార్క్‌షైర్) ఆలీ రాబిన్సన్ (ససెక్స్) జో రూట్ (యార్క్‌షైర్) బెన్ స్టోక్స్ (డర్హామ్) క్రిస్ వోక్స్ (వార్విక్షైర్) మార్క్ వుడ్ (డర్హామ్). ఇంక్రిమెంట్ కాంట్రాక్టులు హ్యారీ బ్రూక్ (యార్క్‌షైర్), డేవిడ్ మలన్ (యార్క్‌షైర్) ,మాథ్యూ పాట్స్ (డర్హామ్), జాసన్ రాయ్ (సర్రే), రీస్ టోప్లీ (సర్రే) ,డేవిడ్ విల్లీ (నార్థాంప్టన్షైర్ 1 నవంబర్ 22 నుండి). ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ కాంట్రాక్టులు: బ్రైడన్ కార్సే (డర్హామ్) మాథ్యూ ఫిషర్ (యార్క్‌షైర్) సాకిబ్ మహమూద్ (లంకాషైర్) క్రెయిగ్ ఓవర్టన్ (సోమర్సెట్) జామీ ఓవర్టన్ (సర్రే) ఒల్లీ స్టోన్ (1 నవంబర్ 22 నుండి నాటింగ్‌హామ్‌షైర్) చదవండి: T20 World Cup 2022: ఒకే ఇన్నింగ్స్‌లో 11 మంది బౌలింగ్.. ఆశ్చర్యపరిచిన జింబాబ్వే కెప్టెన్ -
అదో భయానక పరిస్థితి.. పాకిస్థాన్ లీగ్‌పై ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) అనుభవాలను ఉద్దేశించి ఇంగ్లండ్ క్రికెటర్ జేసన్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పీఎస్ఎల్ ఆడే రోజుల్లో భయానక పరిస్థితులను ఎదుర్కొన్నానని, పాక్‌లో ఉన్నన్ని రోజుల మానసికంగా చాలా సమస్యలతో బాధపడ్డానని, ఆ రోజులు తన జీవితంలో చీకటి రోజులని చెప్పుకొచ్చాడు. నెదర్లాండ్స్‌తో రెండో వన్డే ముగిసిన అనంతరం రాయ్ ఈ మేరకు తన పీఎస్ఎల్ అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. ఐపీఎల్‌కి ముందు జరిగిన పీఎస్ఎల్ (2022 సీజన్)లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ఆడిన జేసన్ రాయ్.. ఆ సీజన్లో అంచనాలకు తగ్గట్టుగానే రాణించినా మానసిక ప్రశాంతతను పొందలేకపోయానని షాకింగ్ కామెంట్స్ చేశాడు. క్రికెట్‌ను ఎక్కడున్నా ఆస్వాదించే నేను పీఎస్ఎల్లో ఆడినన్ని ఎంజాయ్ చేయలేకపోయానని తెలిపాడు. కారణం తెలీదు కానీ పాక్‌లో ఉన్నన్ని రోజులు నరకంలో ఉన్నట్టే అనిపించిందని వాపోయాడు. అక్కడి అనుభవాల కారణంగానే ఐపీఎల్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని అన్నాడు. కాగా, ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో జేసన్ రాయ్‌ని గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే లీగ్ ప్రారంభానికి ముందే అతను బయో బబుల్‌ను సాకుగా చూపి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో వన్డేలో రాయ్ 60 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 73 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: అరుదైన ఆటగాళ్ల జాబితాలోకి నెదర్లాండ్స్ క్రికెటర్ -
నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. సిరీస్ కైవసం
ఆదివారం ఆమ్స్టెల్వీన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 36.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాసన్ రాయ్(73), ఫిలిప్ సాల్ట్(77) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కాగా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో మెర్గాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు, ఇక డచ్ బౌలర్లలో ఆర్యన్ దత్ రెండు, టామ్ కూపర్, ప్రింగల్ తలా వికెట్ సాధించారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. అయితే తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ 41ఓవర్లలలో 7 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, రషీద్ చెరో రెండు వికెట్లు, బ్రైడన్ కార్స్, లివింగ్ స్టోన్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్లు మధ్య అఖరి వన్డే బుధవారం జరగనుంది. చదవండి: ENG vs NED: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. నెదర్లాండ్స్ కెప్టెన్ సంచలన నిర్ణయం..! -
'అంతా ఓకే.. మీ పరిస్థితి తలుచుకుంటే..' వసీం జాఫర్ ట్వీట్ వైరల్
నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ పరుగుల వరద పారించింది. కొడితే ఫోర్ లేదంటే సిక్స్ అన్న చందంగా ఇంగ్లండ్ ఆటతీరు ఉంది. 50 ఓవర్లలో ఇంగ్లండ్ చేసింది 498 పరుగులు.. కోల్పోయింది నాలుగు వికెట్లు. మరో రెండు పరుగులు చేసి ఉంటే 500 పరుగుల మార్క్ అందుకునేదే. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొత్తం ఆడింది నలుగురు బ్యాటర్లు మాత్రమే. ఆ ముగ్గురు బ్యాటర్లు(జాస్ బట్లర్, సాల్ట్, డేవిడ్ మలాన్) సెంచరీలు చేస్తే.. లియామ్ లివింగ్ స్టోన్ అర్థ సెంచరీతో మెరిశాడు. మరి మిగతా ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లో ఒకరు గోల్డెన్ డక్ అయితే.. మరొకరు ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. గోల్డెన్ డక్ అయింది కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కాగా.. ఒక్క పరుగుకే ఔటయ్యింది జేసన్ రాయ్. తాజాగా మోర్గాన్, రాయ్‌లను ఉద్దేశించిన టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ''ముగ్గురు సెంచరీలు.. ఒక అర్థసెంచరీ.. ఒక గోల్డెన్ డక్.. ఒక్క పరుగుకే ఔట్.. వారెవ్వా మోర్గాన్, జేసన్ రాయ్ ఏం ఎనర్జీ భయ్యా మీ ఇద్దరిది. వేగంగా ఆడిన నలుగురు క్రికెటర్లకు అంతే పోటీగా.. అదే ఎనర్జీతో అంతే తొందరగా పెవిలియన్ చేరారు. అంతా ఓకే కాని.. మీ ఇద్దరి పరిస్థితి(మోర్గాన్, రాయ్) తలుచుకుంటే త్రీ ఇడియట్స్ సినిమా గుర్తుకువచ్చింది. అందులో తాము పరీక్షలో ఫెయిలయ్యామనే బాధలో మాధవన్, శర్మాన్ జోషిలు ''నీకు నేను.. నాకు నువ్వు'' అన్నట్లుగా అనుకుంటూ నడుస్తారు.. ఇక్కడ మోర్గాన్.. కూడా రాయ్ భుజం తడుతూ ''బాధపడకూ.. నీకు నేను తోడుగా ఉన్నా రాయ్'' అన్నట్లుగా మీమ్‌తో జాఫర్ సెటైర్ వేశాడు. Same energy 😅 #ENGvsNED pic.twitter.com/DrrfpT9lNm — Wasim Jaffer (@WasimJaffer14) June 17, 2022 చదవండి: ENG vs NED: నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోస .. బంతి కోసం చెట్లు, పుట్టల్లోకి పాక్ బౌలర్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా.. ఒక్కదానికే! -
జాసన్ రాయ్, అలెక్స్ హేల్స్‌కు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ!?
IPL 2022: ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు ఇంగ్లండ్ క్రికెటర్లు జాసన్ రాయ్, ఆలెక్స్ హేల్స్ ఆనూహ్యంగా తప్పుకుని ఆయా ఫ్రాంచైజీలను షాక్‌కు గురిచేసిన సంగతి తెలిసిందే. బయోబబుల్ నిబంధనల కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరంగా ఉంటున్నట్లు వారిద్దరూ వెల్లడించారు. ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా జాసన్ రాయ్‌ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేయగా, ఆలెక్స్ హెల్స్‌ను కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. కాగా సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఈ ఇద్దరి క్రికెటర్లపై బీసీసీఐ చర్యలు తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి వైదొలగకుండా ఆటగాళ్లు ఉండేలా సరికొత్త విధానాన్ని తీసుకురావాలని బీసీసీఐ యోచిస్తోన్నట్లు సమాచారం. తాజాగా జరిగిన ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. "లీగ్‌లో వాటాదారులైన ఫ్రాంఛైజీల పట్ల గవర్నింగ్ కౌన్సిల్ నిబద్ధతను కలిగి ఉంది. ఫ్రాంఛైజీలు చాలా ప్రణాళికలతో ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేస్తారు. వారు సరైన కారణం లేకుండా వైదొలిగితే వారి లెక్కలు తారుమారు అవుతాయి. కొత్త పాలసీ విధానాన్ని తీసుకురావాలి అని భావిస్తున్నాము. సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాము. అలా అని ఐపీఎల్ నుంచి వైదొలిగిన ప్రతి ఒక్కరినీ కొన్ని సంవత్సరాల పాటు నిషేధించే స్వీపింగ్ విధానం తీసుకురాము. వారు తప్పుకున్న కారణం నిజమైతే ఎటువంటి చర్యలు ఉండవు" అని గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఒకరు పేర్కొన్నారు. చదవండి: IPL 2022 GT Vs LSG: అతడు మంచి వన్డే ప్లేయర్ మాత్రమే.. టీ20 క్రికెట్లో అలా కుదరదు: సెహ్వాగ్ విసుర్లు -
Jason Roy: జేసన్ రాయ్‌కు భారీ షాకిచ్చిన ఈసీబీ.. ఇక
ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు గట్టి షాకిచ్చింది. అతడికి 2500 పౌండ్ల జరిమానా వేయడంతో పాటు రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ఈసీబీ తరఫున ది క్రికెట్ డిసిప్లిన్ కమిషన్(సీడీసీ) ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు.. ‘‘క్రికెట్ ప్రయోజనాలు, ఈసీబీతో పాటు అతడి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా జేసన్ రాయ్ వ్యవహరించాడు. కాబట్టి ఈసీబీ ఆదేశాల్లోని 3.3 రూల్‌ను ఉల్లంఘించినందుకు గానూ అతడిపై చర్యలు తీసుకునేందుకు సీడీసీ నిర్ణయించింది’’ అని పేర్కొంది. అదే విధంగా రాయ్‌కు విధించిన జరిమానాను మార్చి 31లోగా చెల్లించాలని ఆదేశించింది. అయితే, ఇందుకు దారి తీసిన ఘటన లేదంటే కారణాన్ని మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. కాగా ఇంగ్లిష్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. జేసన్ రాయ్ గతంలో అనుసరించిన వివక్షపూరిత వైఖరి వల్లే చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ రూ.2 కోట్లకు రాయ్‌ను కొనుగోలు చేసింది. అయితే, గత మూడేళ్లుగా బిజీ షెడ్యూల్ కారణంగా తన కుటుంబానికి దూరమయ్యానని, వారికి సమయం కేటాయించలనుకుంటున్నందు వల్ల టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: IPL 2022: ఇకపై అలా కుదరదు.. సింగిల్ తీస్తే కానీ.. IPL 2022. pic.twitter.com/fZ0LofBgSE — Jason Roy (@JasonRoy20) March 1, 2022 -
IPL 2022: కేఎల్ రాహుల్ జట్టుకు భారీ షాక్.. మరో ప్లేయర్ దూరం!
ఐపీఎల్-2022 సీజన్ ఆరంభానికి ముందే కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే జేసన్ రాయ్, అలెక్స్ హేల్స్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆటగాడు సైతం ఈ సీజన్ నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. గాయం కారణంగా ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ ఐపీఎల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి టెస్టు సందర్భంగా మార్క్ వుడ్ కుడి మోచేతికి గాయమైంది. ఈ క్రమంలో అతడు ఇంకా కోలుకోనందున ఐపీఎల్‌కి అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని, ఇంగ్లండ్ బోర్డు లక్నో ఫ్రాంఛేజీకి సమాచారం ఇచ్చినట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో పేర్కొంది. ఇక ఐపీఎల్-2022 సీజన్‌తో లక్నో జట్టు క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో మెగా వేలంలో భాగంగా మార్క్ వుడ్‌ను 7.50 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక బయో బబుల్ నిబంధనల కారణంగా జేసన్ రాయ్, అలెక్స్ హేల్స్ దూరం కాగా.. గాయం బారిన పడ్డ మార్క్ వుడ్ కూడా సీజన్ నుంచి తప్పుకోవడంతో లక్నోకు భారీ షాక్ తగిలినట్లయింది. ఇదిలా ఉండగా.. ఈ సీజన్లో ఘనంగా ఎంట్రీ ఇచ్చే క్రమంలో లక్నో.. ప్రమోషన్లతో బిజీగా ఉంది. మార్చి 28న మరో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌తో టోర్నీ ప్రయాణాన్ని ఆరంభించనుంది. చదవండి: IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. విలియమ్సన్ ఇక..! #BubbleKiBaatein: Aa gaye hai humare Captain on board, taiyaar hai banane naye record 🏏🙌 Welcome aboard, Captain💪👑@klrahul11 #LucknowSuperGiants #KLRahul #TataIPL #Mindset pic.twitter.com/zpLzHTGEo4 — Lucknow Super Giants (@LucknowIPL) March 16, 2022 .@LucknowIPL are ready to make their debut, are you ready to welcome them? Kyunki #TATAIPL mein UP ke naam ka danka bajna... #YehAbNormalHai!#IPL2022 | Mar 26 onwards | Star Sports Network & Disney+Hotstar pic.twitter.com/GQhHOmROzD — Star Sports (@StarSportsIndia) March 18, 2022 Making his 'Mark' already, eh? 😅 Loving @MAWood33's excitement on joining the Super Giants. We can't wait to have him with us. 🤩🙌#TATAIPLAuction #IPLAuction #LucknowSuperGiants pic.twitter.com/OPG7vQUzTa — Lucknow Super Giants (@LucknowIPL) February 13, 2022 -
IPL 2022: అఫ్గన్ ఆటగాడికి బంపరాఫర్..
ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్‌లో అఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్‌కు అవకాశం దక్కింది. వ్యక్తిగత కారణాలతో దూరమైన జేసన్ రాయ్ స్థానంలో టైటాన్స్ గుర్బాజ్‌ను అతని కనీస ధర రూ. 50 లక్షలకు తీసుకుంది. రషీద్, నూర్ అహ్మద్‌ల తర్వాత ఈ టీమ్‌లోకి ఎంపికైన మూడో అఫ్గాన్ క్రికెటర్ గుర్బాజ్. 2018 అండర్–19 ప్రపంచకప్‌తో వెలుగులోకి వచ్చిన గుర్బాజ్ ఆడిన 9 వన్డేల్లోనే 3 సెంచరీలు చేశాడు. కాగా వ్యక్తిగత కారణాలతో రాయ్ దూరం కావడంతో ఆ జట్టులో వృద్ధిమాన్ సాహాతో పాటు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ కూడా అందుబాటులో ఉన్నాడు. అయితే రాయ్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా గుర్బాజ్‌ను ఎంపిక చేయడంతో సాహాకు జట్టులో చోటు కష్టంగా మారనుంది. ఇదే జరిగితే టీమిండియా నుంచి దూరమైన సాహా.. ఐపీఎల్లో కూడా పేరుకు జట్టులో ఉన్నప్పటికి అవకాశాలు మాత్రం రాకపోవచ్చు. మార్చి 26 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 15వ సీజన్లో తొలి మ్యాచ్ సీఎస్కే, కేకేఆర్ మధ్య జరగనుంది. -
పాపం రైనా.. మరోసారి బిగ్ షాక్... కనీసం ఆ అవకాశం కూడా లేదుగా!
ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ బయో-బబుల్ నిబంధనల కారణంగా ఐపీఎల్-2022 నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ మెగా వేలంలో రాయ్‌ను రూ. 2 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. అయితే రాయ్ జట్టుకు దూరం కావండంతో అతడి స్ధానంలో వేలంలో అమ్ముడుపోని సురేష్ రైనాను భర్తీ చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలు అన్నీ ఆవాస్తవమని, గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే వేరే ఆటగాడితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘానిస్తాన్ విధ్వంసకర ఓపెనర్ రహ్మెనుల్లా గుర్భాజ్‌ను రాయ్ స్ధానంలో తీసుకుంటున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన గుజరాత్ టైటాన్స్ త్వరలో చేయనుంది. గుర్బాజ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఆడుతున్నాడు. ఇప్పటి వరకు18 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడిన రహ్మెనుల్లా గుర్భాజ్ 531 పరుగులు చేశాడు. ఇక ఇటీవల ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యూనైటడ్ జట్టుకు ప్రాతనిథ్యం వహించిన గుర్బాజ్.. 6 మ్యాచ్‌ల్లో 139 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్లో కొత్త జట్టుగా అవతరించిన గుజరాత్ టైటాన్స్ హార్ధిక్ పాండ్యా సారథ్యం వహించ నున్నాడు. గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఇక ఐపీఎల్-2022 వాంఖడే వేదికగా మార్చి 26 నుంచి ఫ్రారంభం కానుంది. చదవండి: Rohit Sharma: కలలో కూడా ఊహించలేదు.. నాకు దక్కిన గొప్ప గౌరవం ఇది: రోహిత్ శర్మ భావోద్వేగం -
IPL 2022: గుజరాత్ టైటాన్స్‌లోకి సురేశ్ రైనా..!
ఐపీఎల్ 2022 మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన సురేశ్ రైనాకు అదృష్టం జేసన్ రాయ్ రూపంలో తలుపుతట్టనుందంటే అవుననే చెప్పాలి. ఇటీవల ముగిసిన వేలంలో జేసన్ రాయ్‌ని గుజరాత్ టైటాన్స్ రూ.2 కోట్ల కనీస ధరకు సొంతం చేసుకోగా.. వ్యక్తిగత కారణాల చేత అతను ఈ ఏడాది లీగ్‌కు అందుబాటులో ఉండనని సీజన్ ఆరంభానికి ముందే ప్రకటించాడు. దీంతో రాయ్ స్థానాన్ని మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాతో భర్తీ చేయాలని నెటిజన్ల నుంచి భారీ ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. రైనా చేరికతో పసలేని గుజరాత్ జట్టుకు బలం చేకూరుతుందని, అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని నెటిజన్లు సూచిస్తున్నారు. రైనాకు 2016, 2017 సీజన్లలో నాటి గుజరాత్ లయన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవముందని, జేసన్ రాయ్ మాదిరిగానే రైనా కూడా విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడగల సమర్ధుడని, రైనాను రాయ్‌కి రిప్లేస్‌మెంట్‌గా తీసుకునేందుకు ఇంతకంటే పెద్ద అర్హతలు అవసరం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. Excellent choice.. Electric Raina can fire the Titan ship ..All the best... — Leo Christopher (@Leomdu) March 2, 2022 ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం కూడా రైనాను తీసుకునేందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రైనా, జేసన్ రాయ్‌లకు గతంలో గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉంది. ఈ ఫ్రాంచైజీ తరఫున రాయ్ కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడగా, రైనా.. రెండు సీజన్లలో కలిపి 40కి పైగా సగటుతో 800 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి సీఎస్కే (2016,2017ల్లో గుజరాత్ లయన్స్‌కు ఆడటం మినహా) జట్టుకు ఆడిన రైనా.. గత సీజన్ మినహాయించి లీగ్ మొత్తంలో అద్భుతంగా రాణించాడు. 205 మ్యాచ్‌ల్లో 32.52 సగటు, 135కు పైగా స్ట్రైక్‌రేట్‌తో 5528 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలున్నాయి. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. లీగ్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వెలువడాల్సి ఉంది. హార్ధిక్ పాండ్యా సారధ్యంలో గుజరాత్ టైటాన్స్, కేఎల్ రాహుల్ నేతృత్వంలో లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. Dear @gujarat_titans, if you pick Suresh Raina as a replacement of Roy, you are not just picking Raina for the team also you would getting almost 10M+ followers for your team who would promote your matches and support. This is important for your brand value. #SureshRaina𓃵 #IPL — CriiicWorld (@Criiicworld) March 2, 2022 Please take raina — Rdx Bipin Roy (@rdx_bipin) March 2, 2022 చదవండి: IPL 2022: వేలంలో ఎవరూ కొనలేదు.. కనీసం విదేశీ లీగ్‌లు ఆడే అనుమతైనా ఇవ్వండి..! -
గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం
ఐపీఎల్లో కొత్త జట్టుగా అవతరించిన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ బయో బబుల్ నిబంధనల కారణంగా కారణంగా ఐపీఎల్-2022 నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాగా ఐపీఎల్ మెగా వేలంలో రూ.2 కోట్లకు రాయ్‌ను గుజరాత్ టైటాన్స్ కోనుగొలు చేసింది. అయితే రాయ్ తన నిర్ణయాన్ని గుజరాత్ ఫ్రాంచైజీకు తెలియజేసినట్లు తెలుస్తోంది. గతేడాది కూడా ఐపీఎల్ తొలి ఫేజ్‌కు దూరమైన రాయ్.. సెకెండ్ ఫేజ్‌లో సన్‌రైజర్స్ తరుపున ఆడాడు. అంతకు ముందు ఢిల్లీకు రాయ్ ప్రాతినిథ్యం వహించాడు. ఇక జాసన్ రాయ్ చివరిసారిగా పాకిస్థాన్ సూపర్ లీగ్ -2022లో పాల్గొన్నాడు. పీఎస్‌ల్లో రాయ్ అద్భుతంగా రాణించాడు. కేవలం 6 మ్యాచ్‌లు ఆడిన రాయ్.. 303 పరుగులు సాధించించాడు. అతడి ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా తన ఐపీఎల్ కెరీర్లో 13 మ్యాచ్‌లు ఆడిన రాయ్ 329 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్-2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తం మహారాష్ట్రలోనే జరగనుంది. ముంబై, పుణే వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది. చదవండి: Kieron Pollard: స్పిన్నర్‌గా మారిన పొలార్డ్.. ముంబై ఇండియన్స్‌కు ఇక.. వీడియో వైరల్ -
మెగావేలానికి మరో నాలుగు రోజులే.. జేసన్ రాయ్ విధ్వంసం
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జేసన్ రాయ్ పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్( పీఎస్ఎల్ 2022లో) విధ్వంసం సృష్టించాడు. క్వెటా గ్లాడియేటర్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్.. 57 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 116 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ మెగావేలం మరో నాలుగురోజుల్లో జరగనున్న నేపథ్యంలో రాయ్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఫ్రాంచైజీల కళ్లలో పడ్డాడు. ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న మెగావేలంలో జేసన్ రాయ్ రూ. 2కోట్లకు తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. మరి వేలంలో ఏ ఫ్రాంచైజీ అతన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్ మీడియాను వదల్లేదు ఇక రాయ్ తుఫాను ఇన్నింగ్స్‌తో క్వెటా గ్లాడియేటర్స్ లాహోర్ ఖలండర్స్పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్( 45 బంతుల్లో 70,3 ఫోర్లు, 3 సిక్సర్లు), హారీ బ్రూక్(17 బంతుల్లో 41, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వీస్(9 బంతుల్లో 22, 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన క్వెటా గ్లాడియేటర్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రాయ్‌కు తోడు.. చివర్లో జేమ్స్ విన్స్(38 బంతుల్లో 49 నాటౌట్, 5 ఫోర్లు), మహ్మద్ నవాజ్(12 బంతుల్లో 25, 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో విజయం అందుకుంది. చదవండి: IPL 2022 Auction:షేక్ రషీద్ సహా ఏడుగురు అండర్-19 ఆటగాళ్లకు బిగ్‌షాక్! Quetta are comfortably cruising in business class, thanks to @JasonRoy20 👨🏻✈️ #HBLPSL7 l #LevelHai l #QGvLQ pic.twitter.com/3p9WpwG8MJ — PakistanSuperLeague (@thePSLt20) February 7, 2022 -
జేసన్ రాయ్ విధ్వంసం.. 36 బంతుల్లోనే శతకం
వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జేసన్ రాయ్ విధ్వంసం సృష్టించాడు. 36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో శతక్కొట్టాడు. బార్బడోస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో జేసన్ ఈ ఫీట్‌ను సాధించాడు. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తం 47 బంతులను ఎదుర్కొన్న జేసన్.. 115 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను పొట్టి ఫార్మాట్లో పదో వేగవంతమైన శతకాన్ని సాధించాడు. ఫలితంగా ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ప్రత్యర్ధి కేవలం 137 పరుగులకే చేతులెత్తేయడంతో పర్యాటక జట్టు విజయం సాధించింది. ఈ సునామీ ఇన్నింగ్స్‌తో జేసన్ రాయ్ ఐపీఎల్ జట్లకు ఛాలెంజ్ విసిరాడు. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఇన్నింగ్స్ అతనికి భారీ ధర సమకూర్చి పెట్టే అవకాశం ఉంది. కాగా, రాయ్.. గత ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా క్రికెటర్లకు మరో అవమానం.. పాక్ ఆటగాళ్లకే అందలం -
చిన్ని తండ్రికి స్వాగతం... క్రికెటర్ భావోద్వేగం
ఇంగ్లండ్ బ్యాటర్ జేసన్ రాయ్ తండ్రయ్యాడు. అతడి భార్య ఎల్లీ మూరే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన జేసన్ రాయ్... భార్యా బిడ్డలకు కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. కొడుకుకు ఎలోసీ అని నామకరణం చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు... ‘‘జనవరి 5, 2022న జననం. కుటుంబంలోకి స్వాగతం చిన్ని తండ్రీ... నాకు చాలా గర్వంగా ఉంది. కృతజ్ఞతాభావంతో నా మనసు నిండిపోయింది’’ అని భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. ఈ క్రమంలో సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి రాయ్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2017 అక్టోబరులో రాయ్ తన గర్ల్‌ఫ్రెండ్ ఎల్లీని వివాహమాడి జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. 2019లో ఈ జంటకు కూతురు ఎవర్లీ జన్మించగా.. ఇప్పుడు కుమారుడు పుట్టాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా జేసన్ రాయ్ చివరిసారిగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఇక ఐపీఎల్-2021 సీజన్లో జేసన్ రాయ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. డేవిడ్ వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చదవండి: SA vs IND: రిషభ్ పంత్కి భారీ షాక్! View this post on Instagram A post shared by Jason Roy (@jasonroy20) -
న్యూజిలాండ్ తో సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్...
Jason Roy ruled out of the T20 World Cup: టీ20 ప్రపంచకప్-2021లో న్యూజిలాండ్‌తో సెమిఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్దానంలో జేమ్స్ విన్స్ జట్టులోకి వచ్చి చేరాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ రాయ్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ టోర్నీలో రాయ్ ఇప్పటివరకు 5 మ్యాచులాడి 123 పరుగులు చేశాడు. "ఇది నిజంగా చాలా భాదాకరమైన వార్త. కానీ నేను మా జట్టును సపోర్ట్ చేయడానికి ఇక్కడే ఉంటాను. మేము కచ్చితంగా ట్రోఫీని సాధిస్తాము. ఈ టోర్నమెంట్లో నా ప్రయాణం ఎంతో ఆద్బుతమైనది. గాయం నుంచి తొందరగా కోలుకోని కరీబియన్ టూర్‌కు సిద్దంగా ఉంటాను" అని రాయ్ పేర్కొన్నాడు. ఈ టోర్నీలో రాయ్ ఇప్పటివరకు 5 మ్యాచులాడి 123 పరుగులు చేశాడు. ప్రపంచకప్ లో నవంబర్ 10 న న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య జరుగనున్న తొలి సెమీస్ జరగనుంది. చదవండి: Gautam Gambhir: దయచేసి అర్థం చేసుకోండి.. టీమిండియాను తిట్టొద్దు -
Eng Vs Ban: పాపం బంగ్లాదేశ్.. 29 పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోరు!
England Beat Bangladesh By 8 Wickets Closer To Semis: టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చెలరేగుతోంది. గ్రూప్–1లో అదరగొట్టే విజయాలతో ప్రత్యర్థులను బెదరకొట్టేస్తోంది. వరుసగా రెండో విజయంతో సెమీఫైనల్ దిశగా మరో అడుగు వేసింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను చిత్తు చేసిన మోర్గాన్ బృందం రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దెబ్బకొట్టింది. అబుదాబి: టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ అసాధారణ ప్రదర్శనతో దూసుకెళుతోంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించింది. స్పిన్, పేస్, మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టుపై అల్రౌండ్ పిడుగులు కురిపించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ చేసిన 29 పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోరు! ఇంకెవరినీ ఇంగ్లండ్ బౌలర్లు 20 పరుగులైనా చేయనివ్వలేదు. టైమల్ మిల్స్ మూడు, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఇంగ్లండ్ 14.1 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జేసన్ రాయ్ (38 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించాడు. ఇంగ్లండ్ ‘పవర్’ప్లే... బంగ్లా డీలా! బంగ్లాకు టాస్ గెలిచిన ఆనందం బ్యాటింగ్‌కు దిగగానే ఆవిరైంది. కలిసొచ్చే పిచ్‌పై ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ తిప్పేశాడు. పేసర్ మిల్స్ కట్టడి చేశాడు. ఓపెనర్లు లిటన్ దాస్ (9), నైమ్ (5)లను అలీ వరుస బంతుల్లోనే పెవిలియన్ చేర్చగా, షకీబ్ (4)ను వోక్స్ ఔట్ చేశాడు. దీంతో ‘పవర్ ప్లే’లో బంగ్లా మూడు టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కూడా వికెట్లను కోల్పోతూనే ఇన్నింగ్స్ కుదేలైంది. ముష్ఫికర్ ఉన్నంతసేపు 10 ఓవర్లలో 6 పరుగుల రన్‌రేట్ కనిపించింది. 11వ ఓవర్లో 63 పరుగుల స్కోరు వద్ద అతన్ని లివింగ్‌స్టోన్ ఎల్బీగా పంపడంతో వికెట్ల పతనం మళ్లీ జోరందుకుంది. బ్యాటింగ్‌లో తల్లడిల్లిన బంగ్లా బౌలింగ్‌లో అయితే డీలా పడింది. ఓపెనర్ రాయ్ అటాకింగ్‌కు చెల్లాచెదురైంది. మరో ఓపెనర్ బట్లర్ (18; ఫోర్, సిక్స్)ను తక్కువ స్కోరుకే ఔట్ చేసిన బంగ్లాకు అదే తృప్తి మిగిలింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ దాస్ (సి) లివింగ్‌స్టోన్ (బి) మొయిన్ అలీ 9; నైమ్ (సి) వోక్స్ (బి) మొయిన్ అలీ 5; షకీబ్ (సి) రషీద్ (బి) వోక్స్ 4; ముష్ఫికర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లివింగ్‌స్టోన్ 29; మహ్ముదుల్లా (సి) వోక్స్ (బి) లివింగ్‌స్టోన్ 19; ఆఫిఫ్ (రనౌట్) 5; నూరుల్ (సి) బట్లర్ (బి) మిల్స్ 16; మెహదీ హసన్ (సి) వోక్స్ (బి) మిల్స్ 11; నజుమ్ అహ్మద్ (నాటౌట్) 19; ముస్తఫిజుర్ (బి) మిల్స్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1–14, 2–14, 3–26, 4–63, 5–73, 6–83, 7–98, 8–124, 9–124. బౌలింగ్: మొయిన్ అలీ 3–0–18–2, వోక్స్ 4–0–12–1, రషీద్ 4–0–35–0, జోర్డాన్ 2–0–15–0, టైమల్ మిల్స్ 4–0–27–3, లివింగ్‌స్టోన్ 3–0–15–2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) నజుమ్ అహ్మద్ (బి) షోరిఫుల్ ఇస్లామ్ 61; బట్లర్ (సి) నైమ్ (బి) నజుమ్ అహ్మద్ 18; మలాన్ (నాటౌట్) 28; బెయిర్‌స్టో (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (14.1 ఓవర్లలో 2 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–39, 2–112. బౌలింగ్: షకీబ్ 3–0–24–0, ముస్తఫిజుర్ 3–0–23–0, షోరిఫుల్ ఇస్లామ్ 3.1–0–26–1, నజుమ్ అహ్మద్ 3–0–26–1, మెహదీ హసన్ 2–0–21–0. చదవండి: T20 World Cup 2021: మోకాలిపై కూర్చుంటాం... ఆ విషయం గురించి స్పందించలేను: వార్నర్ -
RCB Vs SRH: ‘సన్’తోషించాల్సిన విజయం!
అబుదాబి: టోర్నీలో ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానుల కోసం ఒక చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 4 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. తక్కువ స్కోరు చేసి కూడా... ఫామ్‌లో ఉన్న ఆర్సీబీని హైదరాబాద్ నిలువరించడం విశేషం. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (38 బంతుల్లో 44; 5 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ విలియమ్సన్ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు సాధించింది. దేవదత్ పడిక్కల్ (52 బంతుల్లో 41; 4 ఫోర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (25 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. చివరి 2 ఓవర్లలో బెంగళూరు గెలుపు కోసం 18 పరుగులు చేయాల్సి ఉండగా, 19వ ఓవర్లో హోల్డర్ 5 పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు. ఆఖరి ఓవర్ వేసిన భువనేశ్వర్... డివిలియర్స్ క్రీజ్‌లో ఉన్నా సరే, ఒత్తిడిని అధిగమించి 8 పరుగులే ఇవ్వడంతో గెలుపు హైదరాబాద్ సొంతమైంది. ఆఖరి బంతికి సిక్స్ కొట్టాల్సి ఉండగా ఒక పరుగే వచి్చంది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి అండ్ బి) క్రిస్టియాన్ 44; అభిõÙక్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) గార్టన్ 13; విలియమ్సన్ (బి) హర్షల్ పటేల్ 31; ప్రియమ్ గార్గ్ (సి) డివిలియర్స్ (బి) క్రిస్టియాన్ 15; అబ్దుల్ సమద్ (ఎల్బీ) (బి) చహల్ 1; వృద్ధిమాన్ సాహా (సి) డివిలియర్స్ (బి) హర్షల్ పటేల్ 10; హోల్డర్ (సి) క్రిస్టియాన్ (బి) హర్షల్ పటేల్ 16; రషీద్ ఖాన్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–14, 2–84, 3–105, 4–107, 5–107, 6–124, 7–141. బౌలింగ్: మొహమ్మద్ సిరాజ్ 3–0–17–0, గార్టన్ 2–0–29–1, షహబాజ్ 4–0–21–0, హర్షల్ పటేల్ 4–0–33–3, యజువేంద్ర చహల్ 4–0–27–1, క్రిస్టియాన్ 3–0–14–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 5; పడిక్కల్ (సి) సమద్ (బి) రషీద్ 41; క్రిస్టియాన్ (సి) విలియమ్సన్ (బి) కౌల్ 1; భరత్ (సి) సాహా (బి) ఉమ్రాన్ 12; మ్యాక్స్‌వెల్ (రనౌట్) 40; డివిలియర్స్ (నాటౌట్) 19; షహబాజ్ (సి) విలియమ్సన్ (బి) హోల్డర్ 14; గార్టన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–6, 2–18, 3–38, 4–92, 5–109, 6–128. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–25–1, హోల్డర్ 4–0–27–1, సిద్ధార్థ్ కౌల్ 4–1–24–1, ఉమ్రాన్ మాలిక్ 4–0–21–1, రషీద్ ఖాన్ 4–0–39–1. -
IPL 2021: రాయ్ వచ్చాడు... రైజర్స్‌ను గెలిపించాడు
‘ఇన్ని రోజులు జేసన్ రాయ్‌ని తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదు’ రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడి బ్యాటింగ్ విన్యాసాలను చూశాక ప్రతి సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానిలో మెదిలిన ప్రశ్న ఇది. సీజన్లో హైదరాబాద్ మరో విజయాన్ని సాధిస్తే చూడాలన్న అభిమానుల నిరీక్షణకు రాయ్ తెరదించాడు. ఆరంభం నుంచే రాజస్తాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతడు... ఒంటి చేత్తో జట్టును గెలుపు బాటలో నిలబెట్టాడు. దుబాయ్: ఐపీఎల్లో ఎదురవుతున్న వరుస పరాజయాలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫుల్స్టాప్ పెట్టింది. రాజస్తాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన హైదరాబాద్ తమ ఖాతాలో రెండో విజయాన్ని జమ చేసుకుంది. తొలుత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ సామ్సన్ (57 బంతుల్లో 82; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి చెలరేగాడు. యశస్వి జైస్వాల్ (23 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్), మహిపాల్ లొమ్రోర్ (28 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. సిద్ధార్థ్ కౌల్ రెండు వికెట్లు తీశాడు. ఛేజింగ్‌లో హైదరాబాద్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి గెలిచింది. వార్నర్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జేసన్ రాయ్ (42 బంతుల్లో 60; 8 ఫోర్లు, 1 సిక్స్) గెలుపు బాటకు పునాది వేయగా... కెప్టెన్ కేన్ విలియమ్సన్ (41 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. రాయ్ విధ్వంసం... హైదరాబాద్ తరఫున తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన జేసన్ రాయ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్‌లోకి పంపి స్కోరు బోర్డును రాకెట్ వేగంతో నడిపించాడు. ముస్తఫిజుర్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన అతడు... మోరిస్ బౌలింగ్‌లో మూడు బౌండరీలు బాదాడు. మరో ఎండ్‌లో వృద్ధిమాన్ సాహా (18; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడుగా ఆడాడు. దాంతో వీరు తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించారు. 11వ ఓవర్ వేయడానికి వచ్చిన తెవాటియా బౌలింగ్‌లో విశ్వరూపం ప్రదర్శించిన రాయ్... 6, 4, 4, 4 కొట్టి 36 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విలియమ్సన్ కూడా అడపాదడపా బౌండరీలు సాధించడంతో హైదరాబాద్ 11వ ఓవర్లో 100 పరుగుల మార్కును అందుకుంది. అయితే రాయ్‌ని సకారియా పెవిలియన్‌కు చేర్చగా... ప్రియమ్ గార్గ్ (0) ‘గోల్డెన్ డక్’గా వెనుదిరిగాడు. అనంతరం రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ పరుగులను రాబట్టలేకపోయింది. విజయ సమీకరణం 18 బంతుల్లో 22 పరుగు లుగా ఉన్న సమయం లో... అభిషేక్ శర్మ సిక్సర్ బాది ఒత్తిడి తగ్గించాడు. 19వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన విలియమ్సన్... ఫిఫ్టీని పూర్తి చేసుకోవడంతోపాటు జట్టుకు విజ యాన్ని కూడా అందిం చాడు. గురువారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో చెన్నై తో హైదరాబాద్ ఆడుతుంది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: లూయిస్ (సి) సమద్ (బి) భువనేశ్వర్ 6; యశస్వి జైస్వాల్ (బి) సందీప్ శర్మ 36; సామ్సన్ (సి) హోల్డర్ (బి) కౌల్ 82; లివింగ్‌స్టోన్ (సి) సమద్ (బి) రషీద్ 4; లొమ్రోర్ (నాటౌట్) 29; పరాగ్ (సి) రాయ్ (బి) కౌల్ 0; తెవాటియా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–11, 2–67, 3–77, 4–161, 5–162. బౌలింగ్: సందీప్ శర్మ 3–0–30–1, భువనేశ్వర్ 4–1– 28–1, హోల్డర్ 4–0–27–0, కౌల్ 4–0–36–2, రషీద్ ఖాన్ 4–0–31–1, అభిషేక్ 1–0–8–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) సామ్సన్ (బి) సకారియా 60; సాహా (స్టంప్డ్) సామ్సన్ (బి) లొమ్రోర్ 18; విలియమ్సన్ (నాటౌట్) 51; గార్గ్ (సి అండ్ బి) ముస్తఫిజుర్ 0; అభిషేక్ శర్మ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (18.3 ఓవర్లలో 3 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–57, 2–114, 3–119. బౌలింగ్: ఉనాద్కట్ 2–0–20–0, మోరిస్ 3–0–27–0, ముస్తఫిజుర్ 3.3–0–26–1, లొమ్రోర్ 3–0–22–1, తెవాటియా 3–0–32–0, సకారియా 4–0–32–1. -
వార్నర్ స్థానంలో వచ్చాడు.. డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు
Jason Roy Maiden Fifty In SRH Debute Match.. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ జేసన్ రాయ్ అద్భుత అర్థ సెంచరీతో మెరిశాడు. కాగా జేసన్ రాయ్‌కు ఎస్ఆర్హెచ్ తరపున ఇదే తొలి మ్యాచ్. కాగా తొలి మ్యాచ్‌లోనే డెబ్యూ అర్థశతకం సాధించిన రాయ్ చరిత్ర సృష్టించాడు. ఫామ్‌లో లేని వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన రాయ్ ఫోర్లు, సిక్సర్‌తో మెరుపులు మెరిపించాడు. మొత్తం 42 బంతులెదుర్కొన్న జేసన్ రాయ్ 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 60 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 82 పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వి జైశ్వాల్ 36, లామ్రోర్ 29 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ విజయం దిశగా పయనిస్తుంది. 18 ఓవర్ల ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. -
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో జేసన్ రాయ్
హైదరాబాద్: ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ స్థానంలో సన్‌రైజర్స్ జట్టు రాయ్‌ను ఎంచుకుంది. 2020 ఐపీఎల్ ఆడని రాయ్‌కు రైజర్స్ వేలంలో అతని కనీస ధర రూ. 2 కోట్లను చెల్లిస్తుంది. ఇటీవల భారత్‌తో జరిగిన టి20 సిరీస్‌లో రాయ్ 5 మ్యాచ్‌లలో 132.11 స్ట్రయిక్‌రేట్‌తో 144 పరుగులు...3 వన్డేల్లో 123.65 స్ట్రయిక్‌రేట్‌తో 115 పరుగులు చేశాడు. ప్రస్తుత ఐపీఎల్ బయో సెక్యూర్ నిబంధనల ప్రకారం.. మార్ష్ ఏడు రోజుల క్వారంటైన్‌తో పాటు 50 రోజుల కఠిన బయో బబుల్‌లో ఉండాల్సి ఉంది. దీన్ని కష్టంగా భావించిన ఆయన లీగ్ నుంచి తప్పుకున్నాడు. మార్ష్.. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్లో తొలి మ్యాచ్‌లోనే గాయం కారణంగా లీగ్ నుంచి తప్పుకున్నాడు.ఏప్రిల్ 11న చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. -
సన్‌రైజర్స్‌కు ఊహించని షాక్..లీగ్ నుంచి స్టార్ ఆటగాడు ఔట్
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఊహించని ఈ పరిణామంతో జట్టు యాజమాన్యంతో సహా సన్‌రైజర్స్ అభిమానులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. కరోనా నేపథ్యంలో బయో బబుల్‌లో ఉండటం కష్టంగా భావించిన మిచెల్ మార్ష్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి తెలియజేశాడని సమాచారం. ప్రస్తుత ఐపీఎల్ బయో సెక్యూర్ నిబంధనల ప్రకారం.. మార్ష్ ఏడు రోజుల క్వారంటైన్‌తో పాటు 50 రోజుల కఠిన బయో బబుల్‌లో ఉండాల్సి ఉంది. దీన్ని కష్టంగా భావించిన ఆయన లీగ్ నుంచి తప్పుకున్నాడు. మార్ష్.. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్లో తొలి మ్యాచ్‌లోనే గాయం కారణంగా లీగ్ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ 2020 వేలంలో సన్‌రైజర్స్ అతన్ని కనీస ధర రూ.2 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకుంది. కాగా, మిచెల్ మార్ష్ స్థానంలో ఇటీవల భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్‌ని తీసుకునేందుకు సన్‌రైజర్స్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాయ్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో వేళంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఇదిలా ఉండగా కెప్టెన్ వార్నర్ త్వరలో జట్టుతో కలువనుండగా, స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ రాకపై ఇంకా స్పష్టత లేదు. ఏప్రిల్ 11న చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోలకతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. చదవండి: పుజారా ఆన్ ఫైర్.. సిక్సర్లు బాదుతున్న నయా వాల్ -
వావ్.. ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్
అహ్మదాబాద్: భారత్ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ అవుటైన తీరు హైలైట్‌గా నిలిచింది. బౌండరీ వద్ద జోర్డాన్ అద్భుత ప్రదర్శన అందుకు కారణం. రషీద్ బౌలింగ్‌లో సూర్య డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అయితే లాంగాన్ నుంచి దూసుకొచ్చిన జోర్డాన్ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. అయితే వేగంలో తాను బౌండరీని దాటే ప్రమాదం ఉండటంతో బంతిని రాయ్వైపు విసిరాడు. రాయ్ బంతిని అందుకోవడంతో సూర్య వెనుదిరిగాడు. స్కోరు బోర్డులో జోర్డాన్ పేరు లేకపోయినా ఈ క్యాచ్ అతనిదే. బంతిని అందుకున్న సమయంలో రాయ్ నవ్విన తీరు ఈ క్యాచ్ ఎంత అసాధారణమో చూపించింది. Chris Jordan Pulling Off A Michael Jordan Lay-Up!#IndiavsEngland #INDvsENG pic.twitter.com/FrAtVCPhBf — @TimeTravellerJofraArcher (@JofraArcher8) March 20, 2021 కాగా, ఇంగ్లండ్‌తో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3–2తో గెలుచుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (52 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (34 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించగా... హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్‌గా దిగిన కోహ్లి ముగ్గురు సహచరులతో వరుసగా 94, 49, 81 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. చదవండి: (ఆఖరి పోరులో అదరగొట్టారు) -
వేలంలో అమ్ముడుపోలేదు.. దానికే బాధపడాలా!
చెన్నై: ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబరచలేదు. దీంతో రాయ్ ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్ లిస్ట్‌లో చేరిపోయాడు. ఈ విషయంపై జేసన్ రాయ్ ట్విటర్ ద్వారా స్పందించాడు. 'ఐపీఎల్ మినీ వేలంలో అమ్ముడుపోనందుకు నేనేం బాధపడట్లదు.. అలా అని అవమానభారంగాను ఫీలవ్వను. నా ప్రదర్శన వారిని మెప్పించలేదు.. అందుకే సెలెక్ట్ కాలేకపోయాను. ఈ విషయం గురించి ఆలోచించనవసరం లేదు. అయితే వేలంలో మంచి ధర దక్కించుకున్న ఆటగాళ్లకు నా అభినందనలు. ముఖ్యంగా జేమిసన్, క్రిస్ మోరిస్, మ్యాక్స్‌వెల్ లాంటి వారు అధిక ధరకు అమ్ముడుపోవడం మంచి పరిణామం. నేను ఈ ఐపీఎల్ ఆడకపోవచ్చు.. కానీ మ్యాచ్‌లన్నీ కచ్చితంగా చూస్తా' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గత ఐపీఎల్ 2020 సీజన్లో జేసన్ రాయ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ గాయం కారణంగా రాయ్ ఒక్క మ్యాచ్‌లో కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో ఢిల్లీ అతని స్థానంలో డేనియల్ సామ్స్‌కు అవకాశం ఇచ్చింది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ రాయ్‌ను రిలీజ్ చేయగా.. వేలంలో అతన్ని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. మరోవైపు అతని సహచర ఆటగాడు మొయిన్ అలీకి మాత్రం వేలంలో మంచి ధర దక్కింది. ఆర్సీబీ రిలీజ్ చేసిన అలీని సీఎస్కే అనూహ్యంగా రూ.7కోట్లకు కొనుగోలు చేసింది. ఇక మిగిలిన విదేశీ ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ చరిత్రలోనే 16.25 కోట్లకు రాజస్తాన్‌కు అమ్ముడుపోగా.. న్యూజిలాండ్ బౌలర్ కైల్ జేమిసన్ 15 కోట్లు(ఆర్సీబీ), ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రూ. 14.25 కోట్లు(ఆర్సీబీ), జై రిచర్డ్సన్ రూ.14 కోట్లు(పంజాబ్ కింగ్స్) దక్కించుకున్నాయి. చదవండి: 'రోహిత్, పాండ్యా గట్టిగా హగ్ చేసుకున్నారు' -
ఐపీఎల్: స్టార్ ఆటగాళ్లకు ఫ్రాంచైజీల షాక్
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించి వేలానికి సిద్ధమవుతున్న ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ఆటగాళ్లకు షాక్ ఇస్తున్నాయి. ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను వదులుకునేందుకు రాజస్తాన్ రాయల్స్ సిద్ధమైంది. ఐపీఎల్ 13వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరపున 14 మ్యాచ్‌లాడి 311 పరుగులు చేసిన స్మిత్.. టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రిషబ్ పంత్ గార్డ్ మార్క్‌ను చెరిపేసి అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఇలాంటి చీటింగ్ చేసే వ్యక్తి ఐపీఎల్లో ఆడకుండా బ్యాన్ చేయాలంటూ స్మిత్‌పై సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: థ్యాంక్యూ బీసీసీఐ.. మంచి సిరీస్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు దీంతో పాటు టీమిండియా వెటరన్ ఆటగాళ్లు హర్బజన్ సింగ్, మురళీ విజయ్, పియూష్ చావ్లాలతో పాటు కేదార్ జాదవ్‌ను సీఎస్కే వదులుకున్నట్లు ప్రకటించింది. అయితే ఐపీఎల్ 13వ సీజన్‌కు దూరంగా ఉన్న సురేశ్ రైనా మాత్రం సీఎస్కేతో కొనసాగనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పలువురు ఆటగాళ్లను వదులుకుంటున్నట్లు ప్రకటించింది. ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్‌తో పాటు అలెక్స్ హేల్స్, భారత ఆటగాళ్లు సందీప్, మోహిత్ శర్మలకు గుడ్‌బై చెప్పనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. కాగా ఐపీఎల్ 2021కి సంబంధించి వేలంపాట ఫిబ్రవరి చివరివారంలో నిర్వహించనున్నట్లు సమాచారం.చదవండి: ఆసీస్‌తో సిరీస్ : అసలైన హీరో అతనే -
కిందా మీదా పడ్డాడు.. చివరకు రనౌట్ చేశాడు
పెర్త్: ఆసీస్ వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 10) విజయవంతగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో ఇప్పటికే ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్‌గా మారి అభిమానుల మనుసులు గెలుచుకుంటున్నాయి. తాజాగా శనివారం పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ కీపర్ జోష్ ఇంగ్లిస్ సిడ్నీ బ్యాట్సమన్‌ను రనౌట్ చేసిన తీరు నవ్వు తెప్పిస్తుంది. విషయంలోకి వెళితే.. జాసన్ బెండార్ఫ్ వేసిన బంతిని సామ్ బిల్లింగ్స్ ఆఫ్‌సైడ్ పుష్ చేసి నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న అలెక్స్ రాస్‌ను పరుగుకు పిలిచాడు. అయితే బెండార్ప్ వేగంగా వెళ్లి బంతిని అందుకని ఇంగ్లిస్‌కు త్రో విసిరాడు. అయితే ఇంగ్లిస్ మాత్రం బంతిని అందుకునే క్రమంలో తడబడ్డాడు. దీంతో బంతి చేతిలో నుంచి జారి గాల్లోకి లేవడంతో తన చేతిని ఉపయోగించి బంతిని వికెట్ల వైపు విసిరాడు. అదృష్టం బాగుండి వికెట్లను గిరాటేయడంతో అలెక్స్ రాస్ రనౌట్ అయ్యాడు. అయితే ఇంగ్లిస్ చర్య ఇంగ్లండ్ ఆటగాడు జేసన్ రాయ్‌కు నవ్వు తెప్పించింది. ఇంగ్లిస్.. ఎలాగైతేనేమి కిందా మీద పడి రనౌట్ అయితే చేశావంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.(చదవండి: 'నన్ను తిడతావేంటి... ఆ నిర్ణయం థర్డ్ అంపైర్‌ది') ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 50, ఆస్టన్ టర్నర్ 31, జై రిచర్డసన్ 20* రాణించారు. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్ 20 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌట్ అయి 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సిడ్నీ థండర్స్ ఇన్నింగ్స్‌లో సామ్ బిల్లింగ్స్ 83 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.(చదవండి: సిడ్నీ టెస్ట్: బుమ్రా, సిరాజ్‌లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు) You are KIDDING me!!! Jason Roy's reaction to this run out is golden! 😂😂@BKTtires | #BBL10 pic.twitter.com/JDhIJ8CjLW — cricket.com.au (@cricketcomau) January 9, 2021 -
ఆడొచ్చు కానీ... మజా ఉండదు
న్యూఢిల్లీ: ప్రేక్షకుల్లేకుండా ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించవచ్చని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పాడు. అయితే ఈల, గోలలేని మ్యాచ్‌లో మజా, మ్యాజిక్ ఉండవని అన్నాడు. కరోనా మహమ్మారి వల్ల ఆటలన్నీ ఆగిపోయాయి. అయితే వైరస్ అదుపులోకి వచ్చాక గప్‌చుప్‌గా టోర్నీలు నిర్వహించే ప్రత్యామ్నాయంపైనే ఇప్పుడు అన్ని దేశాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై కోహ్లి మాట్లాడుతూ ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో గేట్లు మూసి మ్యాచ్‌లు ఆడించవచ్చు. అయితే దీన్ని క్రికెటర్లు ఎలా స్వీకరిస్తారో నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు మేమంతా ప్రేక్షకుల ముందే ఆడాం. వాళ్లంతా ఆటను ఆరాధించేవారు. క్రేజీగా ఎగబడేవారు. దీంతో మ్యాచ్ జరుగుతుంటే ఎన్నో అనుభూతులు కలిగేవి. ఎక్కడలేని భావోద్వేగాలన్నీ బయటపడేవి. ఇప్పుడు ఇవన్నీ ఉండవు. కాబట్టి మ్యాచ్‌లో ఆ తీవ్రత లోపిస్తుంది’ అని అన్నాడు. గప్‌చుప్‌గా నిర్వహించే ప్రత్యామ్నాయంపై క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టోక్స్, జేసన్ రాయ్, బట్లర్, కమిన్స్ ఖాళీ స్టేడియాల్లో ఆటలు జరగాలని కోరుతుండగా... ఆస్ట్రేలియా విఖ్యాత ఆటగాడు అలెన్ బోర్డర్ ప్రేక్షకుల్లేని టి20 ప్రపంచకప్‌ను వ్యతిరేకించారు. మ్యాక్స్‌వెల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. -
టి20 ప్రపంచకప్ వాయిదా వేస్తే మంచిది
లండన్: క్రికెట్ మైదానంలోకి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని చిన్న పిల్లాడిలా వేచి చూస్తున్నానని ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్ అన్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే ఇప్పుడప్పుడే ఆట మొదలయ్యేలా లేదని పేర్కొన్నాడు. ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్ కూడా లభించని ఈ పరిస్థితుల్లో ఆసీస్ వేదికగా అక్టోబర్–నవంబర్‌లో జరుగనున్న టి20 ప్రపంచకప్‌ను వాయిదా వేస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘క్రికెటర్లకు తగినంత ప్రాక్టీస్ లభించకపోయినా, వారు ఆస్ట్రేలియాకు ప్రయాణించే అవకాశాలు క్లిష్టంగా ఉన్నా టి20 ప్రపంచకప్ వాయిదా వేయడమే మంచిది. అలా కాకుండా షెడ్యూల్ ప్రకారమే ఈ మెగా ఈవెంట్ జరగాలని నిర్ణయిస్తే... మేము ప్రాక్టీస్ గురించి ఆలోచించకుండా క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. ఉన్న సమయంలోనే మేం టోర్నీకి సిద్ధం కావాలి. అది మా బాధ్యత. మేం కూడా ఆ పిలుపు కోసమే వేచి చూస్తున్నాం’ అని 29 ఏళ్ల రాయ్ వివరించాడు. -
జేసన్ రాయ్‌ను పక్కన పెట్టేశారు..
లండన్: ‘జేసన్ రాయ్.. టెస్టుల్లో నీ గేమ్ ఏమిటో మేమూ చూస్తాం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫామ్‌ను టెస్టుల్లో కొనసాగించాలంటే అంత ఈజీ కాదు. అందులోనూ మీ దేశంలో టెస్టు ఓపెనర్‌గా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని’ అని యాషెస్ సిరీస్‌కు ముందు ఆసీస్ చేసిన సవాల్ ఇది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల స్పెషలిస్టు ఆటగాడిగా ముద్ర వేసుకున్న జేసన్ రాయ్.. ఆసీస్ చేసిన చాలెంజ్‌గా తగ్గట్టుగానే ఘోరంగా విఫలమయ్యాడు. యాషెస్ సిరీస్‌కు ముందు కేవలం ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడిన అనుభవం ఉన్న రాయ్ పూర్తిగా విఫలయ్యాడు. ఓపెనర్ నుంచి కింది స్థానంలో బ్యాటింగ్‌కు దింపినా రాయ్ ఆకట్టుకోలేకపోయాడు. మొత్తంగా ఈ యాషెస్ సిరీస్‌లో ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడిన రాయ్ 110 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 31 పరుగులే అతని అత్యధిక స్కోరు. ఈ నేపథ్యంలో కీలకమైన ఐదో టెస్టుకు రాయ్‌ను పక్కనపెట్టేశారు. చివరి టెస్టు మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే ఉద్దేశంతో ఉన్న ఇంగ్లండ్.. రాయ్‌కు ఉద్వాసన పలికింది. ఆల్ రౌండర్లకే పెద్ద పీట వేయాలని భావించిన ఇంగ్లండ్ యాజమాన్యం, రాయ్‌ను తప్పించింది. రెండు మార్పులతో బరిలోకి దిగేందుకు సిద్ధమైన ఇంగ్లిష్ టీమ్ ఆల్ రౌండర్లు క్రిస్ వోక్స్, సామ్ కరాన్‌లను ఎంపిక చేసింది. బెన్ స్టోక్స్ ఇప్పటికే ఆల్ రౌండర్ పాత్రను సమర్దవంతంగా నిర్వర్తించినప్పటకీ అతను భుజం గాయం కారణంగా చివరి టెస్టులో బౌలింగ్ చేసే అవకాశాలు లేవు. కేవలం అతన్ని బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం చేయాలనుకుంటున్న జో రూట్ సేన.. వోక్స్, కరాన్‌లు తీసుకుంది. క్రెయిగ్ ఓవర్టన్ను కూడా ఆఖరి టెస్టు నుంచి తప్పించారు. పేలవమైన ఫామ్‌లో ఉన్న జేసన్ రాయ్‌ను తప్పించడం ఆశ్చర్య కల్గించకపోయినప్పటికీ క్రిస్ వోక్స్, సామ్ కరాన్‌లు ఆఖరి టెస్టులో ఎంతవరకూ ఆకట్టుకున్నారనే దానిపైనే ఇంగ్లండ్ విజయావకావాలు ఆధారపడి ఉన్నాయి. 2001లో చివరిసారి స్వదేశంలో యాషెస్ కోల్పోయిన ఇంగ్లండ్.. మళ్లీ తమ గడ్డపై ఆ సిరీస్‌ను కోల్పోలేదు. ఒకవేళ చివరి టెస్టులో ఆసీస్ గెలిస్తే మాత్రం సారథిగా టిమ్ పైనీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంటాడు. -
‘రాయ్.. నీ ఆట ఏమిటో చూస్తాం’
బర్మింగ్‌హామ్: ప్రత్యర్థి జట్లపై స్లెడ్జింగ్‌కు దిగడంలో ఆసీస్ క్రికెట్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఏ జట్టులో అయతే స్టార్ ఆటగాళ్లు ఉంటారో వారే లక్ష్యంగా ఆసీస్ మాటల యుద్ధానికి దిగుతోంది. ఒక సిరీస్ ఆరంభానికి ముందు నుంచే ఆసీస్ స్లెడ్జింగ్‌కు పదును పెడుతుంది. మరో మూడు రోజుల్లో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ప్రారంభం కానున్న తరుణంలో ఆసీస్ తమ నోటికి పని చెప్పింది. టెస్టుల్లో ఇటీవలే అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జేసన్ రాయ్‌ను టార్గెట్ చేసింది. ఇందుకు తమ అస్త్రంగా తమ పేసర్ హజల్‌వుడ్‌ను ఉపయోగించింది. ‘ జేసన్ రాయ్.. టెస్టుల్లో నీ గేమ్ ఏమిటో మేమూ చూస్తాం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫామ్‌ను టెస్టుల్లో కొనసాగించాలంటే అంత ఈజీ కాదు. ఇప్పటివరకూ రాయ్ ఆడింది ఒకే ఒక్క టెస్టు మ్యాచ్. వన్డే గేమ్ తరహాలో టెస్టుల్లో ఓపెనింగ్ చేయడమంటే సవాల్. అందులోనూ మీ దేశంలో ఓపెనింగ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. టెస్టుల్లో నీ గేమ్ ఏమిటో చూపించడానికి సిద్ధంగా ఉండు. మా బౌలింగ్ వేడి ఏమిటో మేము చూపిస్తాం’ అని హజల్‌వుడ్ వార్నింగ్ ఇచ్చాడు. కొన్ని రోజుల క్రితం ఐర్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా జేసన్ రాయ్ ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు పరుగులు చేసి నిరాశపరిచిన రాయ్.. రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులు చేసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆగస్టు 1 వ తేదీ నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా యాషెస్ సిరీస్ ఆరంభం కానుంది. తొలి టెస్టుకు మాత్రమే జట్టును ఎంపిక చేసిన ఇంగ్లండ్..అందులో జేసన్ రాయ్‌కు అవకాశం కల్పించింది. -
రాణించిన లీచ్, రాయ్
లండన్: తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను కుప్పకూల్చిన ఐర్లాండ్ బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో పట్టువిడిచారు. ఫలితంగా ఇక్కడి లార్డ్స్‌లో జరుగుతున్న నాలుగు రోజుల టెస్టులో ఆతిథ్య జట్టు ప్రత్యర్థికి కాస్త క్లిష్టమైన లక్ష్యాన్ని విధించే దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 0/0తో గురువారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ వెలుతురు లేని కారణంగా ఆట నిలిపివేసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. మరో వికెట్ చేతిలో ఉండగా ఆ జట్టు 181 పరుగుల ఆధిక్యంలో ఉంది. నైట్ వాచ్‌మన్–ఓపెనర్‌గా వచ్చిన స్పిన్నర్ జాక్ లీచ్ (162 బంతుల్లో 92; 16 ఫోర్లు), వన్‌డౌన్‌లో దిగిన జేసన్ రాయ్ (72 బంతుల్లో 78; 10 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు. రెండో వికెట్‌కు వీరు 145 పరుగులు జోడించారు. ఈ ఇద్దరితో పాటు డెన్లీ (10), కెప్టెన్ రూట్ (31), బెయిర్ స్టో (0)లను త్వరతరగా ఔట్ చేసి ఐర్లాండ్ పైచేయి సాధించింది. లోయరార్డర్లో సామ్ కరన్ (37), స్టువర్ట్ బ్రాడ్ (21 బ్యాటింగ్) దూకుడుగా ఆడి ఆధిక్యాన్ని పెంచారు. అడైర్ (3/66), రాన్‌కిన్ (2/86), థాంప్సన్ (2/44) రాణించారు. మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన ఐర్లాండ్‌కు నాలుగో ఇన్నింగ్స్‌లో దాదాపు 200 పరుగుల లక్ష్య ఛేదన మాత్రం కష్టమే. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 85 పరుగులకు, ఐర్లాండ్ 207 ఆలౌటయ్యాయి. -
ప్రపంచకప్ ఎఫెక్ట్: రాయ్ తొలిసారి
లండన్ : ప్రపంచకప్-2019లో తన విధ్వంసకర ఆటతీరుతో విమర్శకులచే ప్రశంసలు అందుకున్నాడు ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్. అంతేకాకుండా ఇంగ్లండ్ జగజ్జేతగా నిలవడంలో రాయ్ కీలక పాత్ర పోషించాడు. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో రాయ్ తొలిసారి ఇంగ్లండ్ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. బుధవారం ఐర్లాండ్‌తో జరగబోయే ఏకైక టెస్టు కోసం ప్రకటించిన జాబితాలో 28 ఏళ్ల రాయ్‌ను సెలక్టర్లు ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అన్నీ కుదిరితే ఐర్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. తొలి సారి ప్రపంచకప్ అందుకోవడంతో సంబరాల్లో మునిగితేలుతున్న ఇంగ్లండ్.. ఈ అపూర్వ విజయానికి యాషెస్ కూడా తోడుకావాలని భావిస్తోంది. దీంతో యాషెస్‌కు ముందు ఈ టెస్టును వార్మప్‌గా ఉపయోగించుకోవాలని ఇంగ్లండ్ ఆరాటపడుతోంది. దానిలో భాగంగా రాయ్ టెస్టు ప్రదర్శనను పరిశీలించాలని అనుకుంటున్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టు మ్యాచ్‌కు బెన్ స్టోక్స్, జోస్ బట్లర్లకు సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. బౌలర్లు జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్‌లను పరిగణలోకి తీసుకోలేదు. ఇంగ్లండ్ టెస్టు జట్టు: జోయ్ రూట్(కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, బెయిర్ స్టో, స్టువార్ట్ బ్రాడ్, బర్న్స్, స్యామ్ కరన్, జోయ్ డెన్లీ, లూయిస్ గ్రెగొరీ, లీచ్, జేసన్ రాయ్, స్టోన్, క్రిస్ వోక్స్. -
ఆసీస్‌ను చిత్తుచేసి.. ఫైనల్‌కు
బర్మింగ్‌హామ్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తుచేసి ఆతిథ్య ఇంగ్లండ్ సగర్వంగా ప్రపంచకప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. రెండో సెమీఫైనల్లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జయభేరి మోగించింది. దీంతో ఆదివారం ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ తలపడనుంది. ఇక ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్ పోరు ఏకపక్షంగా సాగింది. ఆసీస్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. ఛేదనలో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్(85; 65 బంతుల్లో 9ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. రాయ్‌కు తోడు రూట్(40 నాటౌట్) మోర్గాన్(40 నాటౌట్), బెయిర్ స్టో(34)లు రాణించడంతో ఇంగ్లండ్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్‌ను పతనాన్ని శాసించిన క్రిస్ వోక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ ఏమాత్రం తడబాటుకు గురికాలేదు. ఓపెనర్లు రాయ్, బెయిర్ స్టోలు చక్కటి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం బెయిర్ స్టోను స్టార్క్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఓ వైపు అర్ద సెంచరీ సాధించి శతకం వైపు దూసుకెళ్తున్న జేసన్ రాయ్ అంపైర్ తప్పిదానికి బలయ్యాడు. దీంతో తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం వచ్చిన రూట్, మోర్గాన్‌లు మరో వికెట్ పడకుండా విజయాన్ని పూర్తి చేశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 49 ఓవర్లలో 223 పరుగులకే కుప్పకూలింది. క్రిస్ వోక్స్(3/20), అదిల్ రషీద్(3/54), ఆర్చర్(2/32)లు చెలరేగడంతో ఆసీస్ విలవిల్లాడింది. అయితే స్టీవ్ స్మిత్(85; 119 బంతుల్లో 6ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడాడు. స్మిత్‌తో పాటు అలెక్స్ కారీ(46) గాయాన్ని లెక్క చేయకుండా జట్టు కోసం బ్యాటింగ్ చేశాడు. చివర్లో మ్యాక్స్‌వెల్(23), స్టార్క్(29)లు ఓ మోస్తారుగా రాణించడంతో ఇంగ్లండ్ ముందు ఆసీస్ గౌరవప్రదమైన లక్ష్యాన్ని ముందుంచగలిగింది. -
ఇంగ్లండ్‌తో మ్యాచ్: కివీస్ లక్ష్యం 306
చెస్టర్ లీ స్ట్రీట్ : ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా సెమీస్‌కు నేరుగా వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్‌తో మరోసారి మెరిసింది. ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌కు ఆతిథ్య ఇంగ్లండ్ మంచి లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ బెయిర్ స్టో (106; 99 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్) విధ్వంసానికి తోడు జేసన్ రాయ్(60; 61 బంతుల్లో 8ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. సారథి ఇయాన్ మోర్గాన్(42) కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బౌల్ట్, నీషమ్, హెన్రీలు తలో రెండు వికెట్ల పడగొట్టగా.. సౌథీ, సాంట్నర్లు చెరో వికెట్ దక్కించుకున్నారు. బెయిర్ స్టో- రాయ్‌ల సూపర్ ఇన్నింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు మరోసారి అదిరే ఆరంభాన్ని అందించారు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డు పరిగెత్తించారు. వీరిద్దరి జోరుకు ఇంగ్లండ్ 15 ఓవర్లకే వంద పరుగులు సాధించింది. ఈ క్రమంలో వీర్దిదరూ అర్దసెంచరీలు పూర్తి చేసుకున్నారు. హాఫ్ సెంచరీ అనంతరం రాయ్‌ను నీషమ్ ఔట్ చేసి కివీస్‌కు బ్రేక్ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బెయిర్ స్టో మరింత రెచ్చిపోయి ఆడాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి బెయిర్ స్టో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ టోర్నీలో అతడికి రెండో సెంచరీ కావడం విశేషం. అనంతరం మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అవుతాడు. అనంతరం కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కివీస్ ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచింది. దీంతో బ్యాట్స్‌మెన్ స్వేచ్చగా పరుగులు తీయడానికి ఇబ్బందులు పడ్డారు. రూట్(24), బట్లర్(11), స్టోక్స్(11), వోక్స్(4)లు వెంటవెంటనే ఔటయ్యారు. చివర్లో రషీద్(16), ఫ్లంకెట్(15 నాటౌట్) ధాటిగా ఆడే ప్రయత్నం చేయడంతో ఇంగ్లండ్ 300 పరుగులు దాటింది. -
ఇంగ్లండ్‌కు అదిరే ఆరంభం..
చెస్టర్ లీ స్ట్రీట్ : ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు అదిరే ఆరంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. జాసన్ రాయ్, బెయిర్ స్టోలు ఇద్దరూ అర్దసెంచరీలతో ఆకట్టుకున్నారు. తొలి వికెట్‌కు 123 పరుగులు జోడించిన అనంతరం జాసన్ రాయ్(60)ను నీషమ్ ఔట్ చేసి ఈ భాగస్వామ్యానికి తెరదించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 23 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 145 పరుగులు చేసింది. బెయిర్ స్టో(69 నాటౌట్)కు తోడుగా జోయ్ రూట్(7 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి నేరుగా సెమీస్‌కు వెళ్లాలని ఆతిథ్య ఇంగ్లండ్ భావిస్తోంది. ఒకవేళ కివీస్‌పై ఓడిపోతే రన్‌రేట్ కీలకమవుతుంది. పాకిస్తాన్ జట్టు సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో కివీస్ గెలవాలి. దీంతో మైదానంలో కివీస్‌తో పాటు పాక్ ఫ్యాన్స్ ఇంగ్లండ్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఇక లీగ్ చివరి మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌కు రెట్టింపు ఉత్సాహంతో వెళ్లాలని కివీస్ ఆరాటపడుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతుండగా కివీస్ రెండు మార్పులు చేసింది. ఫెర్గుసన్, ఇష్ సోధిలను పక్కకు పెట్టి టిమ్ సౌథీ, మార్క్ హెన్రీలను తుదిజట్టులోకి తీసుకుంది. -
అయ్యో.. ఇంగ్లండ్
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను ఇప్పటికీ గాయాల బెడద వేధిస్తూనే ఉంది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. అతను కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని టీమ్ ఫిజియోథెరపిస్ట్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆస్ట్రేలియాతో జరగబోయే కీలక మ్యాచ్‌కు సైతం జేసన్ రాయ్ దూరం కానున్నాడు. ఇది ఇంగ్లండ్‌ను కలవరపరుస్తోంది. అన్ని విభాగాల్లోనూ అదరగొడుతూ వరుస విజయాలు సాధిస్తున్న ఆసీస్‌ను ఎదుర్కోవడానికి ఇంగ్లండ్ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని భావించింది. ఆ క్రమంలోనే ఆసీస్‌తో మ్యాచ్ నాటికి అందుబాటులోకి జేసన్ రాయ్ తిరిగి జట్టులో చేరతాడని ఆశించింది. కాగా, రాయ్ ఇంకా తొడ కండరాల గాయం నుంచి కోలుకోలేకపోవడంతో రేపటి మ్యాచ్‌పై ఇంగ్లండ్ ఆందోళన చెందుతుంది. వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా జేసన్ రాయ్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఫీల్డింగ్ సమయంలో బంతి కోసం పరుగెత్తిన జేసన్ రాయ్‌కు కాలి కండరాలు పట్టేశాయి. దీనితో అప్పటికప్పుడు గ్రౌండ్‌ను వదిలి వెళ్లాడు. అనంతరం వరుసగా నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో విఫలం అవుతూ వచ్చాడు. ఇందులో భాగంగా పరుగెత్తుతున్న సమయంలో కాలి కండరాల్లో నొప్పి కలుగుతోందని ఫిజియో వెల్లడించారు.నెట్ ప్రాక్టీస్ సమయంలోనూ ఇదే సమస్య ఉత్పన్నమౌతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే మొన్నటి అఫ్గానిస్తాన్, శ్రీలంకతో మ్యాచ్‌కు కూడా జేసన్ రాయ్ దూరం అయ్యాడు. అయితే అఫ్గాన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించినా.. లంకేయులు చేతిలో ఓటమి పాలైంది. ప్రస్తుతం జేసన్ రాయ్ స్థానంలో జేమ్స్ విన్సీ ఓపెనర్‌గా ఆడుతున్నాడు. బెయిర్‌స్టోతో కలిసి ఇన్నింగ్‌ను ఆరంభిస్తున్నాడు. ఆసీస్‌తో మ్యాచ్‌కు సైతం విన్సేనే ఓపెనర్‌గా దిగుతాడని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పష్టం చేశాడు. ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఎనిమిది పాయింట్లతో నాల్గో స్థానంలో కొనసాగుతోంది. -
ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ
మాంచెస్టర్: వన్డే వరల్డ్‌కప్‌లో ఫేవరెట్ జట్లలో ఒకటైన ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో జేసన్ రాయ్ అర్థాంతరంగా మైదానాన్ని వీడాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో భాగంగా ఎనిమిది ఓవర్లు మాత్రమే ఫీల్డ్‌లో ఉన్న రాయ్‌ను గాయం వేధించడంతో గ్యాలరీకి పరిమితమయ్యాడు. ఆపై వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అఫ్గానిస్తాన్, శ్రీలంక మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. జూన్ 25వ తేదీన ఆస్ట్రేలియాతో జరుగనున్న మ్యాచ్‌కు రాయ్ జట్టుతో కలుస్తాడని ఇంగ్లండ్ యాజమాన్యం స్పష్టం చేసింది. మరొకవైపు విండీస్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా వెన్నునొప్పి కారణంగా మధ్యలోనే మైదానాన్ని వీడాడు. రేపు అప్గానిస్తాన్‌తో జరుగనున్న మ్యాచ్‌కు సైతం మోర్గాన్ అందుబాటులో ఉండటం అనేది అనుమానమే. ఈ మెగాటోర్నీలో ఇప్పటివరకూ ఇంగ్లండ్ నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడింట విజయం సాధించింది. -
బంగ్లాదేశ్‌పై 106 పరుగులతో ఇంగ్లండ్ విజయం
-
ఇంగ్లండ్ అదరహో
కార్డిఫ్: పాకిస్తాన్‌తో ఎదురైన షాక్ నుంచి ఇంగ్లండ్ వెంటనే తేరుకుంది. శనివారం జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భరతం పట్టింది. 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విధ్వంసక ఓపెనర్ జేసన్ రాయ్ (121 బంతుల్లో 153; 14 ఫోర్లు, 5 సిక్స్‌లు) బంగ్లా బౌలింగ్‌ను చీల్చి చెండాడటంతో మొదట ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 386 పరుగులు చేసింది. బట్లర్ (44 బంతుల్లో 64; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), బెయిర్‌స్టో (50 బంతుల్లో 51; 6 ఫోర్లు) రాణించారు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ (119 బంతుల్లో 121; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, స్టోక్స్ చెరో 3 వికెట్లు తీశారు. జేసన్ రాయ్‌కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. రాయ్ వీర విహారం... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఓవర్లో ఒక పరుగు మాత్రమే చేసింది. తర్వాత నుంచి జేసన్ రాయ్, బెయిర్‌స్టో దూకుడుతో స్కోరుబోర్డు పరుగుపెట్టింది. ముఖ్యంగా రాయ్ నిలదొక్కుకున్నాక షాట్లపై కన్నేశాడు. లాంగాన్, డీప్ మిడ్ వికెట్, లాంగాఫ్, కవర్స్, ఎక్స్ట్రా కవర్స్ ఇలా మైదానంలో ఏ ప్రాంతాన్ని వదలకుండా కళ్లు చెదిరే షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన జేసన్, బెయిర్‌స్టోతో కలిసి తొలి వికెట్‌కు 128 పరుగులు జోడించి ఘనమైన ఆరంభాన్నిచ్చాడు. బెయిర్‌స్టో ఫిఫ్టీ కాగానే ఔటయ్యాడు. రూట్ (21) పెద్దగా పరుగులు చేయలేదు. బట్లర్ రాకతో మళ్లీ పరుగుల ప్రవాహం జోరందుకుంది. రాయ్ 92 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకోగా, జట్టు 30.4ఓవర్లలోనే 200 స్కోరు చేసింది. సెంచరీ తర్వాత జేసన్ సిక్సర్లతో విరుచుకుపడటంతో అతడి డబుల్ సెంచరీ ఖాయమనిపించింది. అయితే మెహదీహసన్ మిరాజ్ బౌలింగ్ వరుసగా 6, 6, 6 కొట్టిన రాయ్ మరో భారీషాట్ కొట్టే ప్రయత్నంలో నిష్క్ర మించాడు. కెప్టెన్ మోర్గాన్ 35 పరుగులు చేయగా, స్టోక్స్ (6) విఫలమయ్యాడు. చివర్లో ప్లంకెట్ (9 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), వోక్స్ (18 నాటౌట్) 17 బంతుల్లో 45 పరుగులు జోడించారు. షకీబ్ పోరాటం... అసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఆరంభంలోనే ఓపెనర్ సౌమ్య సర్కార్ (2) వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన షకీబ్ అల్ హసన్ చక్కని పోరాటం చేశాడు. ముందుగా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (19)తో కలిసి రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. తర్వాత ముష్ఫీకర్ రహీమ్ (50 బంతుల్లో 44; 2 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన షకీబ్ 53 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. షకీబ్, రహీమ్ జోడీ మూడో వికెట్‌కు 106 పరుగులను జతచేసింది. మొహమ్మద్ మిథున్ (0) డకౌట్ కాగా... మహ్మూదుల్లా (28) అండతో షకీబ్ 95 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇతని పోరాటానికి స్టోక్స్ బౌలింగ్‌లో చుక్కెదురైంది. తర్వాత వచ్చిన వారిలో మొసద్దిక్ 26, మెహదీహసన్ మిరాజ్ 12 పరుగులు చేశారు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) మొర్తజా (బి) మిరాజ్ 153; బెయిర్‌స్టో (సి) మిరాజ్ (బి) మొర్తజా 51; రూట్ (బి) సైఫుద్దీన్ 21; బట్లర్ (సి) సర్కార్ (బి) సైఫుద్దీన్ 64; మోర్గాన్ (సి) సర్కార్ (బి) మిరాజ్ 35; స్టోక్స్ (సి) మొర్తజా (బి) ముస్తఫిజుర్ 6; వోక్స్ (నాటౌట్) 18; ప్లంకెట్ (నాటౌట్) 27; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 386. వికెట్ల పతనం: 1–128, 2–205, 3–235, 4–330, 5–340, 6–341. బౌలింగ్: షకీబ్ 10–0–71–0, మొర్తజా 10–0–68–1, సైఫుద్దీన్ 9–0–78–2, ముస్తఫిజుర్ 9–0–75–1, మిరాజ్ 10–0–67–2, మొసద్దిక్ 2–0–24–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (సి) మోర్గాన్ (బి) వుడ్ 19, సౌమ్య సర్కార్ (బి) ఆర్చర్ 2; షకీబ్ (బి) స్టోక్స్ 121; రహీమ్ (సి) రాయ్ (బి) ప్లంకెట్ 44; మిథున్ (సి) బెయిర్‌స్టో (బి) రషీద్ 0; మహ్మూదుల్లా (సి) బెయిర్‌స్టో (బి) వుడ్ 28, మొసద్దిక్ (సి) ఆర్చర్ (బి) స్టోక్స్ 26; సైఫుద్దీన్ (బి) స్టోక్స్ 5; మిరాజ్ (సి) బెయిర్‌స్టో (బి) ఆర్చర్ 12; మొర్తజా (నాటౌట్) 4; ముస్తఫిజుర్ (సి) బెయిర్‌స్టో (బి) ఆర్చర్ 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 280. వికెట్ల పతనం: 1–8, 2–63, 3–169, 4–170, 5–219, 6–254, 7–261, 8–264, 9–280, 10–280. బౌలింగ్: వోక్స్ 8–0–67–0, ఆర్చర్ 8.5–2– 29–3, ప్లంకెట్ 8–0–36–1, వుడ్ 8–0–52–2, రషీద్ 10–0–64–1, స్టోక్స్ 6–1–23–3. 1 వన్డేల్లో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో 300పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా (వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో) పేరిట ఉన్న రికార్డును ఇంగ్లండ్ సవరించింది. 386 ప్రపంచకప్ చరిత్రలో ఇంగ్లండ్ జట్టుకిదే అత్యధిక స్కోరు. 2011 కప్‌లో బెంగళూరులో భారత్‌పై ఇంగ్లండ్ నమోదు చేసిన 338/8 స్కోరు తెరమరుగైంది. -
బంగ్లాపై పంజా విసిరిన ఇంగ్లండ్
కార్డిఫ్ : పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన ఇంగ్లండ్.. సంచలనాల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెబ్బులిలా విరుచుకుపడింది. దీంతో బంగ్లా 106 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. ప్రపంచకప్‌లో భాగంగా కార్డిఫ్ వేదికగా జరిగిన బంగ్లా-ఇంగ్లండ్ మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించింది. తొలుత జేసన్ రాయ్ (153;121 బంతుల్లో 14ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 386 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం షకీబుల్ హసన్(121; 119 బంతుల్లో 12ఫోర్లు, 1 సిక్సర్)వీరోచితంగా పోరాడినప్పటికీ బంగ్లాకు విజయాన్ని అందించలేకపోయాడు. షకీబ్ మినహా ఏవరూ రాణించకపోవడంతో బంగ్లా 48.5 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. భారీ శతకంతో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జేసన్ రాయ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 387 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు ఓపెనర్లు శుభారంభం అందించడంలో మరోసారి విఫలమయ్యారు. ఆర్చర బౌలింగ్‌లో సౌమ్య సర్కార్(2) పూర్తిగా నిరాశపరిచాడు. అనంతరం తమీమ్(19) తన చెత్త ఫామ్‌ను కొనసాగించాడు. ఈ తరుణంలో సీనియర్ ఆటగాళ్లు షకీబ్, రహీమ్‌లు మరోసారి బంగ్లాను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆది నుంచి షకీబ్ ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా.. రహీమ్ ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 103 పరుగులు జోడించిన అనంతరం ప్లంకెట్ బౌలింగ్‌లో రహీమ్(44) వెనుదిరుగుతాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా షకీబ్ తన ఒంటరి పోరాటం కొనసాగించాడు. టెయిలెండర్లతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే కెరీర్లో ఎనిమిదో శతకం సాధించాడు. అనంతరం స్కోర్ పెంచే క్రమంలో షకీబ్ కూడా వెనుదిరగడంతో బంగ్లా ఓటమి లాంఛనమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, స్టోక్స్ తలో మూడు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జేసన్ రాయ్(153; 121 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకానికి తోడు బెయిర్ స్టో(51; 50 బంతుల్లో 6 ఫోర్లు), జోస్ బట్లర్(64; 44 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారీ స్కోర్ సాధించింది. తాజా మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, మెహిదీ హసన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, మోర్తజా, ముస్తాఫిజుర్‌లకు చెరో వికెట్ లభించింది. -
రూట్‌ను దాటేసిన రాయ్
కార్డిఫ్: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతన్న మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. తాజా ప్రపంచకప్‌లో జేసన్ రాయ్(153;121 బంతుల్లో 14ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం నమోదు చేయడంతో పాటు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్లో తొమ్మిదో శతకం బాదిన రాయ్ తన సహచర ఆటగాడు జోయ్ రూట్ రికార్డును అధిగమించాడు. అతితక్కువ ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది సెంచరీలు సాధించిన ఆటగాడిగా జోయ్ రూట్(78 ఇన్నింగ్స్‌లు) రికార్డును తాజాగా రాయ్(77 ఇన్నింగ్స్‌ల్లో) సవరించాడు. ఇక ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా(52) తొలి స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తరుపున అత్యధిక స్కోర్ నమోదు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రాయ్ నిలిచాడు. ఈ జాబితాలో మాజీ లెఫ్టాండ్ బ్యాట్స్‌మన్ ఆండ్రూ స్ట్రాస్(158; 2011 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై) తొలి స్థానంలో ఉన్నాడు. ఇప్పటికే తాజా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ మూడు శతకాలను(బట్లర్, రూట్, రాయ్) నమోదు చేసింది. అయితే ఇప్పటివరకు ప్రపంచకప్‌లో మూడు శతకాలు బాదడం ఇంగ్లండ్‌కు ఇదే తొలి సారి కావడం విశేషం -
అంపైర్‌ను కిందపడేసిన జేసన్ రాయ్
-
ఇంగ్లండ్ క్రికెటర్లకు జరిమానా.. పాక్‌కు కూడా
నాటింగ్‌హామ్: ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దురుసుగా ప్రవర్తించిన ఇంగ్లండ్ క్రికెటర్లు జేసన్ రాయ్, జోఫ్రా ఆర్చర్లకు ఐసీసీ జరిమానా విధించింది. అంతేకాకుండా స్లో ఓవర్ రేట్ కారణంగా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆతిథ్య ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాక్ సారథి సర్ఫరాజ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు, జట్టులోని మిగతా సభ్యుల ఫీజులో 10 శాతం జరిమానా విధించారు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సందర్భంగా 14వ ఓవర్లో జేసన్ రాయ్ మిస్ ఫీల్డింగ్ అనంతరం అంపైర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో రాయ్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. ఇదే మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు 15 శాతం కోత విధించారు. అంతేకాకుండా వీరిద్దరికీ జరిమానాతో పాటు చెరో డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ జత చేసింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు మ్యాచ్ రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. -
దక్షిణాఫ్రికా ఛేదించేనా?
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 312 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టులో జేసన్ రాయ్(54: 53 బంతుల్లో 8 ఫోర్లు), జో రూట్(51: 59 బంతుల్లో 5 ఫోర్లు), ఇయాన్ మోర్గాన్(57: 60 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), బెన్ స్టోక్స్( 89: 79 బంతుల్లో 9 ఫోర్లు)లు రాణించి జట్టు మూడొందలకు పైగా స్కోరు సాధించడంలో తోడ్పడ్డారు. ఇంగ్లండ్ ఓపెనర్ బెయిర్ స్టో తొలి ఓవర్లోనే డకౌట్‌గా పెవిలియన్ చేరినప్పటికీ జేసన్ రాయ్, జో రూట్లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ జోడి రెండో వికెట్‌కు 106 పరుగులు సాధించిన తర్వాత జేసన్ రాయ్ పెవిలియన్ చేరగా, ఆపై స్వల్ప వ్యవధిలో రూట్ కూడా ఔటయ్యాడు. ఆ తరుణంలో మోర్గాన్-బెన్ స్టోక్స్‌ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టే బాధ్యతను తీసుకుంది. (ఇక్కడ చదవండి: పన్నెండో ప్రపంచ యుద్ధం) వీరిద్దరూ మరో 106 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసి గాడిలో పెట్టారు. కాగా, మోర్గాన్ నాల్గో వికెట్‌గా ఔటైన తర్వాత జోస్ బట్లర్(18), మొయిన్ అలీ(3)లు నిరాశపరచడంతో ఇంగ్లండ్ తడబడినట్లు కనిపించింది. అయితే బెన్ స్టోక్స్ సమయోచితంగా బ్యాటింగ్ చేసి జట్టును మూడొందలకు చేర్చిన తర్వాత పెవిలియన్ చేరాడు. స్కోరును పెంచే క్రమంలో స్టోక్స్ 49 ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. చివరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్(7 నాటౌట్), ప్లంకెట్(9 నాటౌట్)లు 11 పరుగులు సాధించడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఆదిలోనే ఇంగ్లండ్‌కు షాక్ ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ ఇచ్చాడు దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్. తొలి ఓవర్ వేసిన తాహీర్ బౌలింగ్‌లో ఇంగ్లిష్ ఓపెనర్ బెయర్ స్టో పరుగులేమీ చేయకుండా గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. తాహీర్ వేసిన గుడ్ లెంగ్త్ బంతికి తడబడిన బెయిర్ స్టో.. సఫారీ కీపర్ డీకాక్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రెండు ‘సెంచరీ’ భాగస్వామ్యాలు ఇంగ్లండ్ రెండు సెంచరీకి పైగా భాగస్వామ్యాలు సాధించింది. ముందుగా జేసన్ రాయ్-జోరూట్‌ల జోడి సెంచరీ భాగస్వామ్యాన్ని సాధిస్తే, ఆపై ఇయాన్ మోర్గాన్-బెన్ స్టోక్స్‌ల జంట సెంచరీ భాగస్వామ్యాన్ని జత చేసింది. ఈ రెండు జోడీలు 106 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడం ఇక్కడ విశేషం. అదే సమయంలో ఇంగ్లండ్ జట్టులో నాలుగు హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. ఇలా ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్ జట్టును సఫారీలు కట్టడి చేశారనే చెప్పాలి. ఓ దశలో ఇంగ్లండ్ 350కి పైగా పరుగులు సాధించే అవకాశం ఉందని అంతా భావించినా సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. బట్లర్, మొయిన్ అలీ వికెట్లను స్వల్ప విరామాల్లో సాధించి ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచింది. దాంతో ఇంగ్లండ్ ఆఖరి ఓవర్లలో నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది. చివరి పది ఓవర్లలో 76 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ నాలుగు వికెట్లు సమర్పించుకుంది. సఫారీ బౌలర్లలో ఎన్గిడి మూడు వికెట్లు సాధించగా,రబడా, తాహీర్‌లకు తలో రెండు వికెట్లు లభించాయి. ఫెహ్లుకోవియా వికెట్ తీశాడు. (ఇక్కడ చదవండి: వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తొలిసారి..) -
వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తొలిసారి..
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్(54: 53 బంతుల్లో 8ఫోర్లు) హాఫ్ సెంచరీతో మెరవగా, అతనికి తోడుగా జోరూట్(51: 59 బంతుల్లో 5 ఫోర్లు) అర్థ శతకం నమోదు చేశాడు. అటు తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సైతం హాఫ్ సెంచరీ సాధించాడు. 50 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఇంగ్లండ్ 35 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. (ఇక్కడ చదవండి:పన్నెండో ప్రపంచ యుద్ధం) ఇంగ్లండ్ ఒక్క పరుగుకే వికెట్ కోల్పోయినప్పటికీ జేసన్ రాయ్, రూట్లు సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలోనే వీరు హాఫ్ సెంచరీలతో మెరిశారు. 51 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో రాయ్ హాఫ్ సెంచరీ చేయగా, జో రూట్ 56 బంతుల్లో అర్థ శతకం నమోదు చేశాడు. కాగా, ఓపెనర్ రాయ్ 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ 106 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. హాఫ్ సెంచరీ తర్వాత భారీ షాట్‌కు యత్నించిన రాయ్ ఔటయ్యాడు. సఫారీ బౌలర్ ఫెహ్లుకోవాయా బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి రాయ్ పెవిలియన్ బాట పట్టాడు. కాసేపటికి రూట్(51) కూడా నిష్క్రమించాడు. రబడా బౌలింగ్‌లో జేపీ డుమినీకి క్యాచ్ ఇచ్చిన రూట్ పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ నాలుగు పరుగుల వ్యవధిలో పెవిలియన్ బాట పట్టగా, బట్లర్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి జట్టు స్కోరును గాడిలో పెట్టాడు. అతనికి జతగా బెన్ స్టోక్స్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 44 బంతుల్లో 6 ఫోర్లతో అర్థ శతకం నమోదు చేశాడు.ఈ జోడి మరో వంద పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం. ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. (ఇక్కడ చదవండి: హాఫ్ సెంచరీలతో మెరిశారు.. కానీ) తొలి ఓవర్లోనే ఇంగ్లండ్‌కు షాక్ -
హాఫ్ సెంచరీలతో మెరిశారు.. కానీ
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుకు మంచి భాగస్వామ్యాన్ని అందించారు జేసన్ రాయ్, జోరూట్‌లు. వీరిద్దరూ 106 పరుగులు సాధించి ఇంగ్లండ్‌ను గాడిలో పెట్టారు. ఇంగ్లండ్ ఒక్క పరుగుకే వికెట్ కోల్పోయిన తరణుంలో జేసన్ రాయ్, రూట్లు సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలోనే వీరు హాఫ్ సెంచరీలతో మెరిశారు. 51 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో రాయ్ హాఫ్ సెంచరీ చేయగా, జో రూట్ 56 బంతుల్లో అర్థ శతకం నమోదు చేశాడు. కాగా, ఓపెనర్ రాయ్ 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. దాంతో ఇంగ్లండ్ 107 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. హాఫ్ సెంచరీ తర్వాత భారీ షాట్‌కు యత్నించిన రాయ్ ఔటయ్యాడు. సఫారీ బౌలర్ ఫెహ్లుకోవాయా బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి రాయ్ పెవిలియన్ బాట పట్టాడు. కాసేపటికి రూట్(51) కూడా నిష్క్రమించాడు. రబడా బౌలింగ్‌లో జేపీ డుమినీకి క్యాచ్ ఇచ్చిన రూట్ పెవిలియన్ చేరారు. వీరిద్దరూ నాలుగు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరారు. అంతకుముందు ఒక బంతిని మాత్రమే ఎదుర్కొన్న బెయిర్ స్టో పరుగులేమీ చేయకుండా గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్‌ను అందుకున్న దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్.. బెయిర్ స్టోను పెవిలియన్‌కు చేర్చాడు. తాహీర్ వేసిన గుడ్ లెంగ్త్ బంతికి తడబడిన బెయిర్ స్టో.. సఫారీ కీపర్ డీకాక్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. -
రాత్రంతా ఆస్పత్రిలోనే: ఐనా పాక్ బౌలర్లకు చుక్కలు
మ్యాచ్‌కు ముందు రోజు ఆస్పత్రిలో కన్నబిడ్డ చికిత్స పొందుతోంది. బిడ్డ బాగోగులు చూసుకుంటూ రాత్రంతా ఆస్పత్రిలోనే ఉన్నాడు. పాప ఆరోగ్యం కాస్త కుదుటపడిందని వైద్యులు చెప్పడంతో.. మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభమవుతుందన్న సమయంలో మైదానానికి చేరుకున్నాడు. బేసిక్ వార్మప్ చేసి.. బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగాడు. నిద్రను, బాధను దిగమింగుకొని జట్టుకు ఒంటి చేత్తో విజయాన్నందించి.. అభిమానుల మనసు గెలుచుకున్నాడు ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జాసన్ రాయ్. నాటింగ్‌హామ్: పాకిస్తాన్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 3-0తో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. భారీ ఛేజింగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టే మరోసారి పైచేయి సాధించింది. పాక్ నిర్దేశించిన 341 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆతిథ్య ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఇంగ్లండ్ విజయంలో స్టార్ బ్యాట్స్‌మన్ జాసన్ రాయ్(114; 89 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. రాయ్‌తో పాటు స్టోక్స్(71 నాటౌట్)రాణించడంతో ఇంగ్లండ్ జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించిన జాసన్ రాయ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్టు లభించింది. బహుమతి ప్రధానత్సోవం సందర్భంగా రాయ్ మాట్లాడుతూ..‘ మ్యాచ్‌కు ముందు రోజు కేవలం రెండు గంటలే నిద్ర పోయాను. మా పాప ఆరోగ్యం బాగోలేదు. తన బాగోగులు చూసుకుంటూ ఆస్పత్రిలోనే ఉన్నాను. అయితే మ్యాచ్ సమయానికి మైదానానికి వచ్చి బేసిక్ వార్మప్ చేసి బరిలోకి దిగాను. దేవుని దయతో నా పాప ఆరోగ్యంగానే ఉంది. పాక్‌పై ఆడిన ఈ ఇన్నింగ్స్ నాకు, నా కుటుంబానికి ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది’అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 340 పరుగులు చేసింది. బాబర్ అజామ్(115)క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. బాబర్‌కు తోడుగా ఓపెనర్ ఫకర్ జమాన్(57), హఫీజ్(59), మాలిక్(41)లు రాణించడంతో పాక్ భారీ స్కోర్ చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ కరన్ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య నామమాత్రమైన ఐదో వన్డే రేపు(ఆదివారం) జరగనుంది. -
ఇంగ్లండ్ రికార్డు ఛేదన
బ్రిడ్జ్‌టౌన్: ఇంగ్లండ్ విజయ లక్ష్యం 361 పరుగులు... ఛేదనలో ఇంత భారీ స్కోరు సాధించడం దాదాపుగా అసాధ్యం అనిపించిన చోట మోర్గాన్ సేన సత్తా చాటింది. రాబోయే వరల్డ్ కప్‌లో అసలైన ఫేవరెట్‌గా కనిపిస్తున్న ఆ జట్టు మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి తన పదును చూపించింది. బుధవారం రాత్రి జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ముందుగా విండీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (129 బంతుల్లో 135; 3 ఫోర్లు, 15 సిక్సర్లు), షై హోప్ (65 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. అనంతరం ఇంగ్లండ్ 48.4 ఓవర్లలో 4 వికెట్లకు 364 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జేసన్ రాయ్ (85 బంతుల్లో 123; 15 ఫోర్లు, 3 సిక్సర్లు), జో రూట్ (97 బంతుల్లో 102; 9 ఫోర్లు) సెంచరీలు సాధించి తమ జట్టును గెలిపించారు. రాయ్ జోరు ముందు గేల్ చేసిన శతకం మసకబారిపోయింది. సునాయాస క్యాచ్ వదిలేసి గేల్ సెంచరీకి కారణమైన రాయ్ బ్యాటింగ్‌తో తన తప్పు దిద్దుకున్నాడు. ముందుగా రాయ్, బెయిర్ స్టో (34) తొలి వికెట్‌కు 10.5 ఓవర్లలో 91 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు శుభారంభం అందించారు. ఆ తర్వాత రూట్... రెండో వికెట్‌కు రాయ్‌తో 114 పరుగులు, మూడో వికెట్‌కు మోర్గాన్ (51 బంతుల్లో 65; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)తో 116 పరుగులు జోడించి జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లాడు. ఈ క్రమంలో రూట్ వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచాడు. రాయ్, రూట్ ఇచ్చిన చెరో రెండు క్యాచ్‌లు వదిలేసిన విండీస్ ఫీల్డర్లు ప్రత్యర్థికి తమ వంతు సాయం అందించారు. ఐదు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ 1–0తో ఆధిక్యంలో నిలవగా, నేడు ఇదే మైదానంలో రెండో వన్డే జరుగుతుంది. ► 1తమ వన్డే చరిత్రలో ఇంగ్లండ్ ఛేదించిన అత్యధిక స్కోరు ఇదే. ఓవరాల్‌గా ఇదే మూడో అత్యుత్తమ ఛేదన. దక్షిణాఫ్రికా రెండు సార్లు (438/9 – 372/6) ఆసీస్‌పైనే ఇంతకంటే పెద్ద లక్ష్యాలను అధిగమించింది. ► 23వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో సిక్సర్ల సంఖ్య. గతంలో న్యూజిలాండ్ (22) పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును విండీస్ అధిగమించింది. -
ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్
కొలంబో: మరో మ్యాచ్ మిగిలి ఉండగానే శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ 3–0తో సొంతం చేసుకుంది. శనివారం వరుణుడు ఆటంకం కలిగించిన నాలుగో వన్డేలో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఇంగ్లండ్ 18 పరుగులతో నెగ్గింది. మొదట లంక 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. షనక (66; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) బౌండరీలతో రెచ్చిపోగా... డిక్వెలా (52; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. అనంతరం జాసన్ రాయ్ (45; 5 ఫోర్లు, 1 సిక్స్), జో రూట్ (32 నాటౌట్), కెప్టెన్ మోర్గాన్ (31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఇంగ్లండ్ 27 ఓవర్లలో 2 వికెట్లకు 132 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం పడటంతోపాటు ఆట సాధ్యపడలేదు. -
చివరి టీ20 ; భారత్ లక్ష్యం 199
బ్రిస్టల్ : భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న నిర్ణాయత్మక మూడో టీ20లో ఇంగ్లండ్ భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్, బట్లర్ దాటిగా ఆడటంతో స్కోర్ 7 ఓవర్లలోనే 82 పరుగులకు చేరింది. 8 ఓవర్లో సిదార్థ్ కౌల్ బట్లర్(34)ను అవుట్ చేయడంతో పరుగుల దాటికి అడ్డుకట్ట పడింది. ఆ తర్వాత 103 పరుగుల వద్ద జాసన్(67) వెనుదిరగడంతో పరుగుల వేగం కాస్త తగ్గింది. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ హేల్స్ (30), బెయిర్‌స్టో(25), స్టోక్స్(14) పరుగులతో రాణించడంతో ఇంగ్లండ్ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కొల్పోయి 198 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యా నాలుగు వికెట్లు, కౌల్ రెండు వికెట్లు తీయగా, దీపక్ చాహర్, ఉమేశ్ యాదవ్‌లకు చెరో వికెటు దక్కింది. -
‘మా టార్గెట్ వరల్డ్ కప్ గెలవడమే’
చెస్టర్ లీ స్ట్రీట్: తమ అంతిమ లక్ష్యం వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో విజేతగా నిలవడమే అంటున్నాడు ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 481 పరుగులతో ప్రపంచ రికార్డు సృష్టించిన ఇంగ్లండ్.. ఐదు వన్డేల సిరీస్‌ను ఇంకా మ్యాచ్ ఉండగానే 4-0తో కైవసం చేసుకుంది. దీనిలో భాగంగా మాట్లాడిన జాసన్ రాయ్.. తాము సాధిస్తున్న విజయాలు వరల్డ్ కప్‌కు పునాది రాళ్లుగా అభివర్ణించాడు. ‘రికార్డులు ఎప్పుడూ గొప్పవే. ఇంకా చెప్పాలంటే.. మా శ్రమకి తగిన బహుమతులు. కానీ.. మా అంతిమ లక్ష్యం ఒకటే.. వచ్చే ఏడాది ప్రపంచకప్ గెలవడం. రికార్డుల్ని బద్దలు కొట్టడం చాలా గొప్ప విషయం. ఈ విజయాలన్నీ ప్రపంచకప్‌కి ముందు జట్టులో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయి. వరుస విజయాలు, రికార్డులు మా జట్టు వరల్డ్ కప్ సాధించడానికి పునాది రాళ్లు’ అని రాయ్ వెల్లడించాడు. క్రికెట్ పుట్టినిల్లుగా పిలువబడే ఇంగ్లండ్ ఇప్పటివరకూ ఒక్క వన్డే వరల్డ్ కప్‌ను కూడా సాధించలేదు. దాంతో ఈసారి ఎలాగైనా కప్ గెలవాలనే పట్టుదలతో ఉంది ఇంగ్లండ్. స్వదేశంలో తమకు ఉన్న అనుకూలతను అన్ని రకాలుగా ఉపయోగించుకుని మెగా ట్రోఫీని తొలిసారి అందుకోవాలనే ఆశతో ఉంది. -
ఆసీస్‌పై ఎనిమిదో విజయం
చెస్టర్ లి స్ట్రీట్: ఇంగ్లండ్ ఖాతాలో మరో రికార్డు విజయం పడగా.. ఆస్ట్రేలియా చెత్త ప్రదర్శనతో మరో అపజయాన్ని మూటగట్టుకుంది. ఆతిథ్య జట్టు మరో విజయం సాధిస్తే ఆసీస్‌కు వైట్ వాష్ తప్పదు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన నామమాత్రమైన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. పరుగుల వరద పారిస్తున్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు ఆసీస్ నిర్దేశించిన భారీ లక్ష్యం కూడా చాలా చిన్నదయిపోయింది. 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జాసన్ రాయ్(101; 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, మరో ఓపెనర్ బెయిర్‌స్టో(79; 66 బంతుల్లో 10ఫోర్లు) రాణించాడు. దీంతో తొలి వికెట్‌కు 174 పరుగుల భాగస్వామ్యం నమోదయింది. తొమ్మిది పరుగుల వ్యవధిలో ఓపెనర్ల వికెట్లు కోల్పోయినప్పటికీ మిగతా బ్యాట్స్‌మెన్ రాణించారు. చివర్లో ఐపీఎల్ హీరో బట్లర్ (54; 29 బంతుల్లో 9ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగటంతో మరో 32 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్ లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ బౌలర్లలో అగర్ రెండు వికెట్లు తీయగా.. స్టాన్లేక్, లియాన్లు తలో వికెట్ సాధించారు. అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. ఓపెనర్ ఫించ్ (100; 106బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), షాన్ మార్ష్ (101; 92 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కారు. హెడ్ (63; 9 ఫోర్లు) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లీకి 4, వుడ్, ఆదిల్ రషీద్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. చివరి వన్డే ఆదివారం జరగనుంది. హైలెట్స్: ఛేజింగ్ పరంగా(312పరుగుల) ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియాపై ఇదే అతిపెద్ద విజయం, గతంలో(2008) 308 పరుగల ఛేదనే అత్యుత్తమం ఒక క్యాలెండ్ ఇయర్లో ఆస్ట్రేలియాతో ఆడిన 9 వన్డేల్లో ఇంగ్లండ్ ఎనిమిది విజయాలు సాధించింది. మరో విజయం సాధిస్తే ఇయర్ క్యాలెండర్లో అత్యధిక విజయాల రికార్డును ఇంగ్లండ్ తిరగరాసుకుంటుంది. -
జాసన్ దూకుడు,డేర్ డెవిల్స్ విక్టరీ
-
వీరవిహా‘రాయ్’
ఢిల్లీ విజయానికి ఆఖరి ఓవర్లో కావాల్సింది 11 పరుగులు. స్ట్రయికింగ్‌లో జాసన్ రాయ్ (53 బంతుల్లో 91 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు). బౌలర్ ముస్తఫిజుర్. తొలి బంతి ఫోర్... రెండో బంతి సిక్స్... స్కోర్లు సమం. నాలుగు బంతుల్లో ఒక పరుగు చేస్తే చాలు. ఢిల్లీదే గెలుపు. కానీ, ముస్తఫిజుర్ అద్భుతంగా పుంజుకుని మూడు డాట్ బాల్స్ వేశాడు. ఫలితంపై ఒక్కసారిగా ఉత్కంఠ. రోహిత్ ఫీల్డర్లందరినీ దగ్గరగా మోహరించాడు. అయితే... ఒత్తిడిని ఛేదిస్తూ రాయ్ బంతిని కవర్స్ దిశగా కొట్టి లాంఛనం పూర్తి చేశాడు. తమ జట్టుకు సీజన్లో తొలి విజయాన్ని అందించాడు. ముంబై: ముంబై ఇండియన్స్‌కు మరో ఓటమి. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టు చివరి ఓవర్ పరాజయాన్ని తప్పించుకోలేకపోయింది. ఓపెనర్ జాసన్ రాయ్ వీర విహారంతో ఢిల్లీ డేర్ డెవిల్స్... శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్ (32 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్), లూయీస్ (28 బంతుల్లో 48; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు); వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (23 బం తుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి భారీ స్కోరు అందించారు. లక్ష్య ఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ జాసన్ రాయ్, రిషభ్ పంత్ (25 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (20 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి గెలుపొందింది. ఆరంభం అదిరినా... ముంబై ఇన్నింగ్స్ ఆరంభం చూస్తే ఆ జట్టు 230 పరుగులైనా చేస్తుందనిపించింది. కెప్టెన్ రోహిత్‌శర్మ వెనక్కుతగ్గి ఓపెనర్‌గా సూర్యకుమార్‌ను పంపించగా అతడు చెలరేగి ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. లూయీస్ కూడా జోరు చూపడంతో 9వ ఓవర్లోనే స్కోరు వందకు చేరింది. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగినా ఇషాన్, రోహిత్ (18)లు 15వ ఓవర్లో 150 దాటించారు. అయితే... ఇషాన్, పొలార్డ్‌లను క్రిస్టియన్ వరుస బంతుల్లో పెవిలియన్ పంపి ఢిల్లీకి ఊరటనిచ్చాడు. కెప్టెన్ సహా కృనాల్ (11), హార్దిక్ (2) విఫలమవడంతో జట్టు ఊహించినంత కంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. బౌల్ట్, క్రిస్టియన్, తెవాటియాలకు రెండేసి వికెట్లు దక్కాయి. అతడొక్కడే! 5.1 ఓవర్లలోనే 50 పరుగులు జోడించి ఛేదనలో ఢిల్లీకి రాయ్, కెప్టెన్ గంభీర్ (15) శుభారంభం అందించారు. తర్వాత రిషభ్ మెరుపులతో జట్టు లక్ష్యం దిశగా సాగిపోయింది. మధ్యలో మ్యాక్స్‌వెల్ (13) విఫలమైనా... రాయ్ దూకుడుకు అయ్యర్ అండగా నిలిచాడు. అయితే, 12 బంతుల్లో 16 పరుగులు అవసరమైన స్థితిలో బుమ్రా అయిదు పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. ఆఖరి ఓవర్ తొలి రెండు బంతులకే ముస్తఫిజుర్ సిక్స్, ఫోర్ ఇవ్వడంతోనే పరిస్థితి చేయిదాటింది. తర్వాతి మూడు బంతులు బాగా వేసినా, ఢిల్లీకి అవసరమైంది ఒక్క పరుగే కాబట్టి అనూహ్య ఫలితానికి ఆస్కారం లేకపోయింది. -
రాయ్ వచ్చాడు.. గెలిపించాడు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ పైచేయి సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున తొలి మ్యాచ్ ఆడుతున్న జాసన్ రాయ్ జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా వచ్చిన రాయ్ కడవరకూ క్రీజ్‌లో ఉండి 53 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయంగా 91 పరుగులు సాధించి ఢిల్లీని విజయ తీరాలకు తీర్చాడు. అతనికి జతగా రిషబ్ పంత్(47;25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్(27 నాటౌట్; 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)లు ధాటిగా ఆడారు. ఈ సీజన్లో ఇది ఢిల్లీకి తొలి గెలుపు కాగా, ముంబైకు హ్యాట్రిక్ ఓటమి. ముంబై నిర్దేశించిన 195 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీకి తొలి వికెట్‌కు 50 పరుగులు, రెండో వికెట్‌కు 69 పరుగులు సాధించింది. గౌతం గంభీర్(15), గ్లెన్ మ్యాక్స్‌వెల్(13)లు నిరాశపరిచారు. కాగా, రాయ్, పంత్‌లతో పాటు అయ్యర్లు అంచనాలకు అనుగుణంగా రాణించడంతో ఢిల్లీ గెలుపు సునాయాసమైంది. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ప్రధానంగా జాసన్ రాయ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు చిరస్మరణీయమైన గెలుపును అందించాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 194 పరుగులు సాధించింది. తొలి వికెట్‌కు ముంబై ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్‌లు 102 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి శుభారంభం అందించారు. దాంతో ముంబై తరపున ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన ఓపెనింగ్ జోడిగా గుర్తింపు పొందారు. తొలి వికెట్‌గా లూయిస్ అవుటైన స్వల్ప వ్యవధిలో సూర్యకుమార్ యాదవ్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ ఏడు పరుగుల వ్యవధిలో అవుటయ్యారు. మరొకవైపు ఇషాన్ కిషన్(44; 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించాడు. అయితే మిడిల్ ఆర్డర్లో ముంబై విఫలం కావడంతో రెండొందల మార్కును చేరడంలో విఫలమైంది. ముంబై మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లలో కీరోన్ పొలార్డ్ డకౌట్ కాగా, రోహిత్ శర్మ(18), కృనాల్ పాండ్యా(11), హార్దిక్ పాండ్యా(4)లు తీవ్రంగా నిరాశపరిచారు. పవర్ ప్లేలో భారీగా పరుగులు సమర్పించుకున్న ఢిల్లీ.. ఆపై కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. దాంతో తొలి ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసిన ముంబై.. మిగతా 14 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, డానియల్ క్రిస్టియన్, రాహుల్ తెవాతియాలు తలో రెండు వికెట్లు సాధించగా, మహ్మద్ షమీకి వికెట్ దక్కింది. -
రాయ్, పంత్‌ల దూకుడు!
ముంబై : ఐపీఎల్-11 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డేవిల్స్ ఆటగాళ్లు జాసన్ రాయ్, రిషబ్ పంత్ అర్థ సెంచరీలతో చెలరేగారు. దీంతో ఢిల్లీ 10 ఓవర్లకు వికెట్ నష్టపోయి 104 పరుగులు చేసింది. ఈ దశలో 27 బంతులు ఎదుర్కొన్న రాయ్ 3 ఫోర్లు,4 సిక్సులతో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో వైపు పంత్ సైతం వరుస సిక్సులు, ఫోర్లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ దశలో 23 బంతుల్లో 47 పరుగులు చేసిన పంత్‌ను కృనాల్ పాండ్యా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి తొలి వికెట్ 50 పరుగుల భాగస్వామ్యం లభించింది. వేగంగా ఆడే క్రమంలో పంత్, మ్యాక్స్ వెల్ (13) వికెట్లు కోల్పోయింది. -
జాసన్ రాయ్ సరికొత్త రికార్డు
మెల్బోర్న్: ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ తరపున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన జాసన్ రాయ్(180;151 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్లు) రికార్డు నెలకొల్పాడు. ఫలితంగా 2016లో పాకిస్తాన్‌పై అలెక్స్ హేల్స్(171) నెలకొల్సిన అత్యధిక పరుగుల వన్డే రికార్డును రాయ్ బ్రేక్ చేశాడు. ఆసీస్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ ఆదిలోనే బెయిర్ స్టో(14) వికెట్‌ను కోల్పోయింది. కాగా, జాసన్ రాయ్ మాత్రం తనదైన శైలిలో చెలరేగి ఆడాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా రాయ్ నిలిచాడు. రాయ్ ధాటికి ఇంగ్లండ్ 42 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. ఇటీవల యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ 0-4తో కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే గత వరల్డ్ కప్ నుంచి చూస్తే ఇంగ్లండ్ వన్డేల్లో అద్బుతమైన రికార్డుతో దూసుకుపోతుంది. అప్పట్నుంచి ఏ జట్టు పరంగా చూసినా ఇంగ్లండ్ అత్యధిక వన్డే విజయాల్ని ఖాతాలో వేసుకుంది. 53 మ్యాచ్‌లకు గాను 34విజయాలను ఇంగ్లండ్ సాధించింది. -
ఇంగ్లండ్ ‘రికార్డు’ విజయం
► హేల్స్, రాయ్ శతకాలు ► శ్రీలంకతో రెండో వన్డే బర్మింగ్‌హామ్: ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (110 బంతుల్లో 133 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు), జేసన్ రాయ్ (95 బంతుల్లో 112 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత శతకాలతో రెచ్చిపోయారు. దీంతో శుక్రవారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే ఐదు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి వన్డే టైగా ముగిసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 254 పరుగులు చేసింది. తరంగ (49 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు; 1 సిక్స్), చండిమాల్ (86 బంతుల్లో 52; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా మాథ్యూస్ (54 బంతుల్లో 44; 3 ఫోర్లు), పెరీరా (45 బంతుల్లో 37; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ప్లంకెట్, రషీద్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్ల సూపర్ బ్యాటింగ్‌తో 34.1 ఓవర్లలో 256 పరుగులు చేసి నెగ్గింది. దీంతో ఒక్క వికెట్ కోల్పోకుండా 250కిపైగా పరుగులు చేసి గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. గతేడాది జింబాబ్వేపై న్యూజిలాండ్ 236 పరుగులు చేసి నెగ్గింది. అలాగే ఇంగ్లండ్ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. గతం (2010)లో స్ట్రాస్, ట్రాట్ రెండో వికెట్‌కు 250 పరుగులు జోడించారు. -
ఆ జ్ఞాపకాలు పదిలం
ఒక్కడై నిలిచి కోహ్లి కొల్లగొట్టిన పరుగులు, ఒక్క పరుగుతో ప్రాణం లేచి వచ్చిన క్షణాలు... గేల్ దూకుడు, రాయ్ మెరుపులు... ఇలా ఎన్నో అపురూప ఘట్టాలు కలగలిపి టి20 క్రికెట్ ప్రపంచ కప్ ‘సిక్సర్’ కొట్టింది. పొట్టి క్రికెట్ పుట్టిన 11 ఏళ్లలోపే విశ్వ వేదికపై ఆరు సార్లు జట్లు పోటీ పడ్డాయి. ఇందులో ఐదు జట్లు విజయాన్ని అధిరోహించాయి. తొలిసారి భారత్‌లో జరిగిన ఈ ధనాధన్ ఆట అభిమానులకు ఆనందాన్ని పంచింది. అందరూ ఆశించినట్లుగా మన జట్టు జగజ్జేతగా నిలవకపోయినా... వినోదానికి మాత్రం లోటు లేకుండా పోయింది. మరో ప్రపంచ కప్ వచ్చే వరకు మన మనసుల్లో నిలిచిపోయే కొన్ని క్షణాలు.... పరుగుల వరద.. ధనాధన్ క్రికెట్‌కు అసలైన ఉదాహరణలా సాగిన మ్యాచ్ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగింది. ముగ్గురు అర్ధ సెంచరీలు చేయడంతో తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 229 పరుగులు చేసి నిశ్చింతగా కనిపించింది. కానీ ఇంగ్లండ్ మరో 2 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి క్రికెట్ ప్రపంచానికి షాక్ ఇచ్చింది. చివరి ఓవర్ డ్రామా... వరల్డ్‌కప్ మొత్తానికి హైలైట్‌గా నిలిచిన ఘటన భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో జరిగింది. హార్దిక్ పాండ్యా వేసిన ఆ ఓవర్లో విజయం కోసం 11 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ 3 బంతుల్లోనే 9 పరుగులు రాబట్టింది. మ్యాచ్ పూర్తి కాక ముందే ముష్ఫిఖర్ సంబరాలు కూడా చేసుకున్నాడు. కానీ చివరి 3 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా భారత్ 3 వికెట్లు తీసి ఒక పరుగుతో సంచలన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఆఖరి బంతికి ముస్తఫిజుర్‌ను ధోని రనౌట్ చేసిన తీరు ప్రజల మనసుల్లో చిరకాలం నిలిచిపోయింది. వారెవ్వా రాయ్... యువ ఆటగాళ్లతో కొత్తగా కనిపించిన ఇంగ్లండ్ జట్టులో జేసన్ రాయ్ తన దూకుడుతో దూసుకొచ్చాడు. టోర్నీ రెండు సార్లు మెరుపు ఆరంభాలతో అతను తమ జట్టు విజయం కోసం వేదిక సిద్ధం చేశాడు. దక్షిణాఫ్రికాపై 16 బంతుల్లోనే 43 పరుగులు చేసిన రాయ్, సెమీస్‌లో న్యూజిలాండ్‌తో 154 పరుగుల ఛేదనలో 44 బంతుల్లో 78 పరుగులు చేసి మ్యాచ్‌ను శాసించాడు. 11-0 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై మన అద్భుత రికార్డు అలాగే కొనసాగింది. కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్లతో పాక్‌ను చిత్తు చేసింది. వన్డే వరల్డ్ కప్‌లలో ఆరు సార్లు దాయాదిని ఓడించిన భారత్‌కు టి20 వరల్డ్‌కప్‌లలో ఇది ఐదో విజయం. అప్ఘన్ సంచలనం... ప్రతీ వరల్డ్ కప్‌లో కనీసం ఒక్క అనూహ్య ఫలితమైనా రావడం రివాజుగా మారింది. ఈసారి అఫ్ఘానిస్తాన్ వంతు వచ్చింది. టోర్నీ ఆరంభం నుంచి ప్రతీ జట్టును వణికించిన అఫ్ఘన్ చివరకు తాము అనుకున్నది సాధించింది. వెస్టిండీస్‌ను 6 పరుగులతో ఓడించి సంచలనం సృష్టించింది. తమ దేశంలో ఆ జట్టుకు విశ్వవిజేత స్థాయిలో దేశాధ్యక్షుడి నుంచి స్వాగతం లభించింది. చిరస్మరణీయ ఇన్నింగ్స్ నిస్సందేహంగా టోర్నీలో సూపర్ స్టార్‌గా నిలిచిన కోహ్లి నుంచి ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో వచ్చింది. 161 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి 3 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ నిలిచింది. ఈ సమయంలో అత్యద్భుత షాట్లతో కోహ్లి గెలిపించిన తీరు అపూర్వం. చివర్లో 11 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో అతను చేసిన 32 పరుగులు, ఆ జోరు మన అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు.