లండన్: క్రికెట్ మైదానంలోకి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని చిన్న పిల్లాడిలా వేచి చూస్తున్నానని ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్ అన్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే ఇప్పుడప్పుడే ఆట మొదలయ్యేలా లేదని పేర్కొన్నాడు. ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్ కూడా లభించని ఈ పరిస్థితుల్లో ఆసీస్ వేదికగా అక్టోబర్–నవంబర్‌లో జరుగనున్న టి20 ప్రపంచకప్‌ను వాయిదా వేస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘క్రికెటర్లకు తగినంత ప్రాక్టీస్ లభించకపోయినా, వారు ఆస్ట్రేలియాకు ప్రయాణించే అవకాశాలు క్లిష్టంగా ఉన్నా టి20 ప్రపంచకప్ వాయిదా వేయడమే మంచిది. అలా కాకుండా షెడ్యూల్ ప్రకారమే ఈ మెగా ఈవెంట్ జరగాలని నిర్ణయిస్తే... మేము ప్రాక్టీస్ గురించి ఆలోచించకుండా క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. ఉన్న సమయంలోనే మేం టోర్నీకి సిద్ధం కావాలి. అది మా బాధ్యత. మేం కూడా ఆ పిలుపు కోసమే వేచి చూస్తున్నాం’ అని 29 ఏళ్ల రాయ్ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment