నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌.. సిరీస్‌ కైవసం | England seal ODI series in Netherlands | Sakshi
Sakshi News home page

NED vs ENG: నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌.. సిరీస్‌ కైవసం

Jun 20 2022 11:04 AM | Updated on Jun 20 2022 11:10 AM

England seal ODI series in Netherlands - Sakshi

ఆదివారం ఆమ్‌స్టెల్‌వీన్‌ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తేడాతో ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 36.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జాసన్‌ రాయ్‌(73), ఫిలిప్‌ సాల్ట్‌(77) పరుగులతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు.

కాగా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో మెర్గాన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు, ఇక డచ్‌ బౌలర్లలో ఆర్యన్ దత్ రెండు, టామ్‌ కూపర్‌, ప్రింగల్‌ తలా వికెట్‌ సాధించారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. అయితే తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న నెదర్లాండ్స్‌ 41ఓవర్లలలో 7 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో డేవిడ్‌ విల్లీ, రషీద్‌ చెరో రెండు వికెట్లు, బ్రైడన్ కార్స్‌, లివింగ్‌ స్టోన్‌ తలా వికెట్‌ సాధించారు. ఇరు జట్లు మధ్య అఖరి వన్డే బుధవారం జరగనుంది.
చదవండి: ENG vs NED: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌.. నెదర్లాండ్స్‌ కెప్టెన్‌ సంచలన నిర్ణయం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement