నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ పరుగుల వరద పారించింది. కొడితే ఫోర్ లేదంటే సిక్స్ అన్న చందంగా ఇంగ్లండ్ ఆటతీరు ఉంది. 50 ఓవర్లలో ఇంగ్లండ్ చేసింది 498 పరుగులు.. కోల్పోయింది నాలుగు వికెట్లు. మరో రెండు పరుగులు చేసి ఉంటే 500 పరుగుల మార్క్ అందుకునేదే. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొత్తం ఆడింది నలుగురు బ్యాటర్లు మాత్రమే.
ఆ ముగ్గురు బ్యాటర్లు(జాస్ బట్లర్, సాల్ట్, డేవిడ్ మలాన్) సెంచరీలు చేస్తే.. లియామ్ లివింగ్ స్టోన్ అర్థ సెంచరీతో మెరిశాడు. మరి మిగతా ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లో ఒకరు గోల్డెన్ డక్ అయితే.. మరొకరు ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. గోల్డెన్ డక్ అయింది కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కాగా.. ఒక్క పరుగుకే ఔటయ్యింది జేసన్ రాయ్. తాజాగా మోర్గాన్, రాయ్‌లను ఉద్దేశించిన టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
''ముగ్గురు సెంచరీలు.. ఒక అర్థసెంచరీ.. ఒక గోల్డెన్ డక్.. ఒక్క పరుగుకే ఔట్.. వారెవ్వా మోర్గాన్, జేసన్ రాయ్ ఏం ఎనర్జీ భయ్యా మీ ఇద్దరిది. వేగంగా ఆడిన నలుగురు క్రికెటర్లకు అంతే పోటీగా.. అదే ఎనర్జీతో అంతే తొందరగా పెవిలియన్ చేరారు. అంతా ఓకే కాని.. మీ ఇద్దరి పరిస్థితి(మోర్గాన్, రాయ్) తలుచుకుంటే త్రీ ఇడియట్స్ సినిమా గుర్తుకువచ్చింది. అందులో తాము పరీక్షలో ఫెయిలయ్యామనే బాధలో మాధవన్, శర్మాన్ జోషిలు ''నీకు నేను.. నాకు నువ్వు'' అన్నట్లుగా అనుకుంటూ నడుస్తారు.. ఇక్కడ మోర్గాన్.. కూడా రాయ్ భుజం తడుతూ ''బాధపడకూ.. నీకు నేను తోడుగా ఉన్నా రాయ్'' అన్నట్లుగా మీమ్‌తో జాఫర్ సెటైర్ వేశాడు.
Same energy 😅 #ENGvsNED pic.twitter.com/DrrfpT9lNm
— Wasim Jaffer (@WasimJaffer14) June 17, 2022
చదవండి: ENG vs NED: నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోస .. బంతి కోసం చెట్లు, పుట్టల్లోకి
Comments
Please login to add a commentAdd a comment