Wasim Jaffer Shares Funny Memes About Ind Vs WI T20 Match Delayed - Sakshi
Sakshi News home page

IND vs WI 2nd T20: మ్యాచ్‌ గెలవాలని.. ముందస్తు ప్లాన్‌ అయితే కాదుగా!.. వసీం జాఫర్‌ ఫన్నీ ట్రోల్‌ 

Published Tue, Aug 2 2022 1:12 PM | Last Updated on Tue, Aug 2 2022 2:00 PM

Wasim Jaffer Hillarous Troll WI Is-It Planned Before Match Delayed - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ట్రోల్‌ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. అవకాశం దొరికిన ప్రతీసారి జాఫర్‌ ఏదో ఒక ఫన్నీ ట్వీట్‌తో అలరిస్తాడు. తాజాగా భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగిన రెండో టి20పై జాఫర్‌ అదే తరహా ఫన్నీ ట్వీట్‌తో మెరిశాడు. కాగా మ్యాచ్‌ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఆటగాళ్ల లగేజీ సకాలంలో చేరుకోలేకపోవడమే.'' ట్రినిడాడ్‌ నుంచి సెంట్‌కిట్స్‌కు ఆటగాళ్ల లగేజీలు ఇంకా చేరుకోలేదు. అందుకే మ్యాచ్‌ను రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించనున్నాం'' అంటూ విండీస్‌ క్రికెట్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ప్రకటనపై జాఫర్‌ తనదైన శైలిలో ట్రోల్‌ చేశాడు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విండీస్‌ కెప్టెన్‌ నిలోలస్‌ పూరన్‌ను ఏదో విషయంలో ప్రశ్నిస్తున్న  ఫోటోను షేర్‌ చేస్తూ..'' ముందస్తు ప్లాన్‌ అయితే కాదు కదా'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ''మ్యాచ్‌ గెలవడానికి.. లగేజీ లేట్‌ కావడానికి మీరే పక్కా ప్లాన్‌ చేయలేదు కదా అని రోహిత్‌ పూరన్‌ ప్రశ్నించడం జాఫర్‌ చేసిన క్యాప్షన్‌కు అర్థం. జాఫర్‌ ట్వీట్‌ను నిజం చేస్తూ టీమిండియా కూడా ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

రెండో టి20లో 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 5 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఈ విజయంతో విండీస్‌ ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే జాఫర్‌ ఫన్నీ ట్వీట్‌ను సాకుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇరుజట్ల మధ్య మూడో టి20 మ్యాచ్‌ మంగళవారం(ఆగస్టు 2న) జరగనుంది.

చదవండి: SuryaKumar Yadav: అయ్యో.. సూర్యకుమార్‌కు ఎంత కష్టం!

Obed Mccoy: విండీస్‌ బౌలర్‌ సంచలనం.. టి20 క్రికెట్‌లో ఐదో బౌలర్‌గా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement