మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో సియాటిల్ ఓర్కాస్ తొలి విజయాన్ని నమోదు చేసింది. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌తో నిన్న (జులై 9) జరిగిన మ్యాచ్‌లో ఓర్కాస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్.. జేసన్ రాయ్ (52 బంతుల్లో 69; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (22 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
సునీల్ నరైన్ (5), ఉన్ముక్త్ చంద్ (18), షకీబ్ అల్ హసన్ (7), ఆండ్రీ రసెల్ (14) నిరాశపరిచారు. ఓర్కాస్ బౌలర్లలో జమాన్ ఖాన్, హర్మీత్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. గానన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఓర్కాస్.. ర్యాన్ రికెల్టన్ (66 బంతుల్లో 103; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో విజృంభించడంతో 19.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. రికెల్టన్‌కు జతగా క్వింటన్ డికాక్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (51 నాటౌట్) ఆడాడు. ఓర్కాస్ కోల్పోయిన ఏకైక వికెట్ (నౌమన్ అన్వర్ (9)) స్పెన్సర్ జాన్సన్‌కు దక్కింది.
ఎంఎల్‌సీ ప్రస్తుత ఎడిషన్‌లో ఆరు మ్యాచ్‌లు అయిన అనంతరం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ ఫ్రీడం టాప్‌లో ఉంది. శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, ఎంఐ న్యూయార్క్, లాస ఏంజెలెస్ నైట్‌రైడర్స్, సీయాటిల్ ఓర్కాస్, టెక్సస్ సూపర్ కింగ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment