Knight Riders
-
పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్: ఒక్క ఫోర్ లేదు! అన్నీ సిక్సర్లే!
వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ కీరన్ పొలార్డ్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ అభిమానులకు కనువిందు చేశాడు. కేవలం పందొమ్మిది బంతుల్లోనే 52 పరుగులు సాధించి సత్తా చాటాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2024లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో మ్యాచ్‌లో ఈ మేరకు తుఫాన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.రోస్టన్ చేజ్ హాఫ్ సెంచరీకాగా సీపీఎల్ తాజా ఎడిషన్‌లో పొలార్డ్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లూసియా కింగ్స్ సొంత మైదానంలో మెరుగైన స్కోరు సాధించింది. ఓపెనర్లు, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(26 బంతుల్లో 34), జె.చార్ల్స్(14 బంతుల్లో 29) శుభారంభం అందించగా.. రోస్టన్ చేజ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన చేజ్ 40 బంతుల్లో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా భనుక రాజపక్స(29 బంతుల్లో 33) కూడా ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 187 పరుగులు సాధించింది. ట్రిన్‌బాగో బౌలర్లలో సునిల్ నరైన్, వకార్ సలామ్‌ఖీల్ రెండేసి వికెట్లు తీయగా.. టెర్రాన్స్ హిండ్స్, పొలార్డ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఆకాశమే హద్దుగా పొలార్డ్ఈ క్రమంలో లూసియా కింగ్స్ విధించిన లక్ష్య ఛేదనకు దిగిన ట్రిన్‌బాగోకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు జేసన్ రాయ్(15 బంతుల్లో 16), సునిల్ నరైన్(8 బంతుల్లో 14) విఫలమయ్యారు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ షకెరె పారిస్ 33 బంతుల్లో 57 పరుగులతో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.సిక్సర్ల వర్షంమిగతా వాళ్లలో నికోలస్ పూరన్(17), కేసీ కార్టీ(15) పూర్తిగా నిరాశపరచగా.. పొలార్డ్ రంగంలోకి దిగిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఈ ఆల్‌రౌండర్. ఏడు సిక్సర్ల సాయంతో 19 బంతుల్లోనే 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పందొమ్మిదో ఓవర్లోనే నాలుగు సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆఖరి ఓవర్లో అకీల్ హొసేన్ ఫోర్ బాదడంతో.. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ట్రిన్‌బాగో గెలుపు ఖరారైంది. లూయిస్ కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన కీరన్ పొలార్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.సెయింట్ లూయీస్ వర్సెస్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ స్కోర్లులూయీస్ కింగ్స్- 187/6 (20 ఓవర్లు)నైట్ రైడర్స్- 189/6 (19.1 ఓవర్లు)ఫలితం- కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ విజయం.టాప్‌లో అమెజాన్ వారియర్స్కాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో గయానా అమెజాన్ వారియర్స్ మూడు విజయాల(ఆరు పాయింట్లు)తో పట్టికలో టాప్‌లో ఉండగా.. బార్బడోస్ రాయల్స్ రెండింట రెండు గెలిచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ట్రిన్‌బాగో నైట్ రైడర్స్మూడింట రెండు గెలిచి మూడు, ఆంటిగ్వా-బర్బుడా ఫాల్కన్స్ ఆరింట రెండు గెలిచి నాలుగు, సెయింట్ లూసియా కింగ్స్ నాలుగింట రెండు గెలిచి ఐదు, సెయింట్ కిట్స్- నెవిస్ పేట్రియాట్స్ ఆరింట ఒకటి గెలిచి అట్టడుగున ఆరో స్థానంలో ఉంది.చదవండి: హిట్‌మ్యాన్ మరో 10 పరుగులు చేస్తే..! Kieron Pollard is awarded @Dream11 MVP! Well done Polly 🙌🏾 #CPL24 #SLKvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Dream11 pic.twitter.com/AASf9KO7mC— CPL T20 (@CPL) September 11, 2024 -
నరైన్, రసెల్ విఫలం.. నైట్‌రైడర్స్ ఓటమి
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో సియాటిల్ ఓర్కాస్ తొలి విజయాన్ని నమోదు చేసింది. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌తో నిన్న (జులై 9) జరిగిన మ్యాచ్‌లో ఓర్కాస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్.. జేసన్ రాయ్ (52 బంతుల్లో 69; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (22 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (5), ఉన్ముక్త్ చంద్ (18), షకీబ్ అల్ హసన్ (7), ఆండ్రీ రసెల్ (14) నిరాశపరిచారు. ఓర్కాస్ బౌలర్లలో జమాన్ ఖాన్, హర్మీత్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. గానన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఓర్కాస్.. ర్యాన్ రికెల్టన్ (66 బంతుల్లో 103; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో విజృంభించడంతో 19.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. రికెల్టన్కు జతగా క్వింటన్ డికాక్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (51 నాటౌట్) ఆడాడు. ఓర్కాస్ కోల్పోయిన ఏకైక వికెట్ (నౌమన్ అన్వర్ (9)) స్పెన్సర్ జాన్సన్‌కు దక్కింది. ఎంఎల్సీ ప్రస్తుత ఎడిషన్‌లో ఆరు మ్యాచ్‌లు అయిన అనంతరం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ ఫ్రీడం టాప్‌లో ఉంది. శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, ఎంఐ న్యూయార్క్, లాస ఏంజెలెస్ నైట్‌రైడర్స్, సీయాటిల్ ఓర్కాస్, టెక్సస్ సూపర్ కింగ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
ఇక క్రికెట్ ‘వేడి’
నేడు నగరంలో తొలి ఐపీఎల్ మ్యాచ్ సన్‌రైజర్స్‌తో నైట్‌రైడర్స్ ఢీ మండే ఎండతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులను మరో వేడి ముంచెత్తబోతోంది. ఈ సీజన్లో నగరంలో తొలి ఐపీఎల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో నేటి సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది. ఇక బౌండరీలు, సిక్సర్ల హోరులో క్రికెట్ ‘వేడి’ని ఎంజాయ్ చేయడమే..! -
మెకల్లోలమ్
64 బంతుల్లో 158 పరుగులు ఇంగ్లిష్ టి20 బ్లాస్ట్ టోర్నీ లండన్: తొలి ఐపీఎల్లో కివీస్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ విధ్వంసం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 73 బంతుల్లో 158 పరుగులతో ఔరా అనిపించి లీగ్‌కు కూడా ఎనలేని ప్రాముఖ్యాన్ని తెచ్చాడు. ఇప్పుడు కౌంటీల్లో కూడా అదే రకం ఆటతీరుతో విరుచుకుపడి రికార్డు సృష్టించాడు. ఇంగ్లిష్ టి20 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా శుక్రవారం డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్విక్షైర్ తరఫున ఆడిన మెకల్లమ్... 64 బంతుల్లోనే అజేయంగా 158 పరుగులు చేశాడు. ఇది ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఇందులో 11 ఫోర్లు, 11 సిక్సర్లు ఉండగా 42 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో వార్విక్షైర్ గెలిచింది. ఇంతకుముందు 2014లో ససెక్స్ ఆటగాడు ల్యూక్ రైట్ 153 పరుగులు సాధించాడు. అలాగే ఓవరాల్‌గా టి20 ఫార్మాట్లో తన పేరిటే ఉన్న రెండో అత్యధిక స్కోరును మెకల్లమ్ సమం చేసుకున్నాడు. తొలిస్థానంలో విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ (175) ఉన్నాడు. -
కోల్‌కతా వీధుల్లో చిందేస్తాం: షారుఖ్
నేడు ఈడెన్‌లో జట్టుకు ఘన సన్మానం కోల్‌కతా: బెంగాల్ రాజధాని కోల్‌కతా మరోసారి వేడుకలకు సిద్ధమవుతోంది. ఐపీఎల్ ఏడో సీజన్ టైటిల్‌ను గెలుచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు నేడు ఈడెన్ గార్డెన్స్‌లో ఘన సన్మానం జరుగనుంది. ముఖ్య అతిథిగా సీఎం మమతా బెనర్జీ హాజరుకానున్నారు. విజయయాత్రలో జట్టు యజమాని షారుఖ్ ఖాన్ తన నృత్యాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. కోల్‌కతా వీధులను సందడిగా మారుస్తామని చెబుతున్నాడు. ఈ విజయాన్ని తన చిన్న కుమారుడు అబ్‌రామ్‌కు అంకితమిస్తున్నట్టు చెప్పాడు. ‘ఈసారి హుగ్లీ నది ఒడ్డున డ్యాన్సులతో ఉర్రూతలూగిస్తాం. అలాగే వీధులను కూడా వదలం. మమతాజీ... ఇంతకుముందు మీకు ప్రామిస్ చేసినట్టుగానే మేం మరోసారి వస్తున్నాం. మేం ఇప్పుడు చాంపియన్లం. పార్టీ ఇప్పటికే ప్రారంభమైంది’ అని షారుఖ్ తెలిపాడు. ఫైనల్లో పంజాబ్‌ను ఓడించిన అనంతరం తమ టీమ్ హోటళ్లో తెల్లవారు జాము దాకా ఆటగాళ్లు పార్టీలో మునిగితేలారు. మరోవైపు ఫైనల్లో తమ జట్టుపై సెంచరీ చేసిన పంజాబ్ ఆటగాడు సాహాను కూడా ఈ వేడుకలకు ఆహ్వానించారు. కోల్‌కతాకు చేరిన గంభీర్ సేన ఐపీఎల్ గెలిచిన నైట్‌రైడర్స్‌కు కోల్‌కతా విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బెంగాల్ మంత్రి మదన్ మిత్రా, క్యాబ్ అధికారులు, వేలాది మంది అభిమానులు స్వాగతం పలికారు.