
కొలంబో: మరో మ్యాచ్ మిగిలి ఉండగానే శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ 3–0తో సొంతం చేసుకుంది. శనివారం వరుణుడు ఆటంకం కలిగించిన నాలుగో వన్డేలో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఇంగ్లండ్ 18 పరుగులతో నెగ్గింది. మొదట లంక 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.
షనక (66; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) బౌండరీలతో రెచ్చిపోగా... డిక్‌వెలా (52; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. అనంతరం జాసన్ రాయ్ (45; 5 ఫోర్లు, 1 సిక్స్), జో రూట్ (32 నాటౌట్), కెప్టెన్ మోర్గాన్ (31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఇంగ్లండ్ 27 ఓవర్లలో 2 వికెట్లకు 132 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం పడటంతోపాటు ఆట సాధ్యపడలేదు.
Comments
Please login to add a commentAdd a comment