వార్నర్‌ స్థానంలో వచ్చాడు.. డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు | Jason Roy Maiden Fifty In SRH Debute Match Vs Rajastan Royals | Sakshi
Sakshi News home page

వార్నర్‌ స్థానంలో వచ్చాడు.. డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు

Published Mon, Sep 27 2021 11:21 PM | Last Updated on Sun, Oct 17 2021 4:50 PM

Jason Roy Maiden Fifty In SRH Debute Match Vs Rajastan Royals - Sakshi

Jason Roy Maiden Fifty In SRH Debute Match.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ అద్భుత అర్థ సెంచరీతో మెరిశాడు. కాగా జేసన్‌ రాయ్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున ఇదే తొలి మ్యాచ్‌. కాగా తొలి మ్యాచ్‌లోనే డెబ్యూ అర్థశతకం సాధించిన రాయ్‌ చరిత్ర సృష్టించాడు. ఫామ్‌లో లేని వార్నర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన రాయ్‌ ఫోర్లు, సిక్సర్‌తో మెరుపులు మెరిపించాడు. మొత్తం 42 బంతులెదుర్కొన్న జేసన్‌ రాయ్‌ 8 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో​ 60 పరుగులు సాధించాడు.  ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన  రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ 82 పరుగలతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. యశస్వి జైశ్వాల్‌ 36, లామ్రోర్‌ 29 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం దిశగా పయనిస్తుంది. 18 ఓవర్ల ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement