Sunraisers hyderabad
-
Kaviya Maran: వేలకోట్లకు ఏకైక వారసురాలు.. కావ్యా మారన్ గురించి ఈ విషయాలు తెలుసా? (ఫోటోలు)
-
'ప్రపంచంలో ఎక్కడా లేని సరకు మన దగ్గరే ఉండాది'...పుష్ప ట్వీట్ వైరల్ !
-
సన్ రైజర్స్ రికార్డ్ బ్రేక్ : వీణ శ్రీవాణి మాస్ బీట్ సాంగ్ వైరల్!
ఐపీఎల్ పోరులో మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసి తన రికార్డ్‌ను (287/3)తానే బ్రేక్ చేసింది. చిన్నస్వామి స్టేడియంలో హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల మోత మోగించారు. ముఖ్యంగా బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించిన హెడ్ విధ్వంసమే సృష్టించాడు. దీంతో పవర్ ప్లేలో కేవలం 7.1 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ 100 పరుగులు దాటడం విశేషం. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ సందర్భాన్ని వీణ శ్రీవాణి కూడా సెలబ్రేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో ఎ పుడూచురుగ్గా ఉంటూ తన అభిమానులను అలరించే శ్రీవాణి సన్‌రైజర్స్ విజయాన్ని స్పెషల్‌గా ఎంజాయ్ చేసింది. ఐపీఎల్ 2024 కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ రిలీజ్ చేసిన సాంగ్‌ను తన వీణతో అదరగొట్టేసింది శ్రీవాణి. తన వీణా వాయిద్యాన్ని కేవలం క్లాసిక్ మ్యూజిక్కు పరిమితం కాకుండా, మాస్ సాంగ్స్‌ను కూడా వాయిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్న శ్రీవాణి తాజాగా మాస్‌బీట్ ‘‘మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో’ తో ఇరగదీసింది. ఇది ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
IPL 2023: హౌస్ ఫుల్.. జోష్ నిల్.. చీర్ గర్ల్స్‌కు పెద్దగా పనేలేకుండా పోయింది!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత భాగ్యనగరంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇరు జట్లలోనూ భారత స్టార్ ఆటగాళ్లెవరూ లేకపోయినా స్టేడియం దాదాపుగా నిండిపోవడం విశేషం. హెచ్‌సీఏ అధికారిక లెక్క ప్రకారం 37,731 మంది ప్రేక్షకులు వచ్చారు. ఆదివారం కావడం, నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ చూడాలనే ఉత్సాహం ప్రేక్షకులను పెద్ద సంఖ్యలో మైదానానికి తీసుకొచ్చాయి. మిట్టమధ్యాహ్నం తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా వారంతా స్టేడియంలోకి అడుగు పెట్టారు. కాగా.. సన్‌రైజర్స్ అభిమానులకు మాత్రం సరైన ఆనందం దక్కలేదు. పేలవమైన ఆట తీరుతో భారీ పరాజయాన్ని అందుకున్న హైదరాబాద్ జట్టు ఏ దశలోనూ తగిన వినోదాన్ని అందించలేకపోయింది. అందుకే చాలా మంది అభిమానుల్లో తీవ్ర నిరాశ కనిపించింది. ఇన్నింగ్స్ మొత్తంలో రైజర్స్ బ్యాటర్లు 8 ఫోర్లు, 5 సిక్స్‌లు మాత్రమే కొట్టడంతో ఫ్యాన్స్‌కే కాదు, చీర్ గర్ల్స్‌కు కూడా పెద్దగా పని లేకుండా పోయింది. ఆరంభంలో రాజస్తాన్ ప్లేయర్లు కొట్టిన మెరుపు షాట్లే కాస్త చప్పట్లు కొట్టేలా చేశాయి. వచ్చే ఆదివారం కూడా మరో మ్యాచ్ హైదరాబాద్‌లోనే ఉంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగే ఆ పోరులోనైనా లోకల్ ఫ్యాన్స్ సంబరపడే క్షణాలు వస్తాయేమో చూడాలి. -
స్టెయిన్ కొత్త అవతారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కీలక ఒప్పందం
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ ఇకపై సరికొత్త అవతారం ఎత్తనున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌గాను సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చెపట్టే అవకాశం ఉంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం... ఇప్పటికే స్టెయిన్‌తో సన్‌రైజర్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన వచ్చే వారం వెలువడనున్నట్లు ఈ నివేదిక తెలుపుతుంది. కాగా ఐపీఎల్లో 2013-2015 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున స్టెయిన్ ఆడాడు. 38 ఏళ్ల స్టెయిన్ తన కెరీర్లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. టెస్టులు, వన్డేలు, టి20ల్లో కలిపి 699 వికెట్లు పడగొట్టాడు. 95 ఐపీఎల్ మ్యాచుల్లో 97 వికెట్లు తీశాడు. చదవండి: Rohit Sharma: గాయంతో సిరీస్‌కు దూరం.. 9 కోట్లతో భార్య పేరిట ప్రాపర్టీ కొనుగోలు చేసి! -
వార్నర్ కు అప్పుడు అండగా నిలిచింది వాళ్లే కదా.. అది గుర్తు లేదా?
Irfan Pathan defends SRH in David Warner chapter: ఐపీఎల్-2022 మెగా వేలం ముందు 8 ఫ్రాంఛైజీలు తాము రీటైన్ చేసుకోనే ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే.. కెప్టెన్ విలియమ్సన్, అబ్దుల్ సమాద్, ఉమ్రాన్ మాలిక్‌ను మాత్రమే రీటైన్ చేసుకుంది. అయితే ఆ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రీటైన్ చేసుకోలేదు. ఐపీఎల్-2021 సీజన్లో డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ కెప్టెన్ తొలగించబడ్డాడు. అంతే కాకుండా ఆ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా చోటు దక్కలేదు. ముందు నుంచి అంతా అనుకున్నట్టే డేవిడ్ భాయ్‌ను ఈసారి హైదరాబాద్ రీటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో ఆరెంజ్ ఆర్మీ అభిమానులు హైదరాబాద్ ఫ్రాంఛైజీపై తీవ్రస్ధాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విమర్శకులు భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చెక్ పెట్టాడు. వార్నర్ జాతీయ జట్టుకు దూరమై కష్టాల్లో ఉన్నప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ అండగా నిలిచింది అని అతడు తెలిపాడు. "ఒక విదేశీ ఆటగాడి రీటైన్ గురించి ఫ్రాంచైజీ నిర్ణయాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ వాళ్లందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. తన సొంత దేశం అతనిని ఆడకుండా నిషేధించినప్పుడు అదే ఫ్రాంచైజీ అతనికి మద్దతు ఇచ్చి అండగా నిలిచిందని గుర్తుంచుకోవాలి" అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీటర్ వేదికగా పేర్కొన్నాడు. అయితే ఈ ట్వీట్లో పఠాన్ వార్నర్ పేరుగానీ, సన్ రైజర్స్ పేరు గానీ ప్రస్తావించడకపోవడం గమనార్హం. కాగా 2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న వార్నర్ ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: T10 League: బ్యాట్స్‌మన్ వీరబాదుడు.. 20 నిమిషాల్లోనే మ్యాచ్ ఖేల్‌ఖతం -
వార్నర్ స్థానంలో వచ్చాడు.. డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు
Jason Roy Maiden Fifty In SRH Debute Match.. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ జేసన్ రాయ్ అద్భుత అర్థ సెంచరీతో మెరిశాడు. కాగా జేసన్ రాయ్‌కు ఎస్ఆర్హెచ్ తరపున ఇదే తొలి మ్యాచ్. కాగా తొలి మ్యాచ్‌లోనే డెబ్యూ అర్థశతకం సాధించిన రాయ్ చరిత్ర సృష్టించాడు. ఫామ్‌లో లేని వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన రాయ్ ఫోర్లు, సిక్సర్‌తో మెరుపులు మెరిపించాడు. మొత్తం 42 బంతులెదుర్కొన్న జేసన్ రాయ్ 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 60 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 82 పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వి జైశ్వాల్ 36, లామ్రోర్ 29 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ విజయం దిశగా పయనిస్తుంది. 18 ఓవర్ల ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. -
మాతో టెస్టు రద్దు చేసుకున్నారు.. ఐపీఎల్ కూడా రద్దు చేస్తారా!
Michael Vaughan Comments On Natarajan Tests Covid Positive: ఐపీఎల్ 2021 ఫేజ్2లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ నేడు తలపడనుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలు ముందు హైదరాబాద్ ఫాస్ట్‌బౌలర్ నటరాజన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో అతడితో సన్నిహితంగా ఉన్న విజయ్ శంకర్ సహా మరో ఐదుగురు సహాయ సిబ్బందిని ఐసోలేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో బీసీసీఐపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఘాటు వాఖ్యలు చేశాడు. ‘చివరి టెస్ట్ రద్దు చేసుకున్నట్లు ఐపీఎల్‌ను కూడా రద్దు చేసుకుంటారా?... అలా చేయరని నేను హామీ ఇస్తా...’ అంటూ మైకెల్ వాన్ ట్వీట్ చేశాడు. కాగా టీమిండియా శిబిరంలో కరోనా కరోనా కేసులు నమోదు కావడంతో ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు అర్ధాంతరంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే కాసులు కురిపించే క్యాష్ రిచ్ లీగ్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే భారత క్రికెటర్లు చివరి టెస్ట్ నుంచి తప్పుకున్నారని, వారికి దేశం తరఫున ఆడే టెస్ట్ మ్యాచ్ కంటే ఐపీఎల్ మ్యాచ్‌లంటేనే ముఖ్యమని ఐదో టెస్ట్ వాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: IPL 2021 2nd Phase DC VS SRH: నటరాజన్‌కు కరోనా.. అయినా మ్యాచ్ యథాతథం -
సన్‌రైజర్స్ తొలి మ్యాచ్.. విక్టరీ విషెస్
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా ఆలస్యమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు అసలైన మజాను ఇస్తోంది. ముగిసింది రెండో మ్యాచ్‌లు అయినా.. క్రికెట్ కిక్‌ను అందించింది. ఇక తమ అభిమాన జట్ల మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక హాట్ పేవర్ టీమ్‌గా బరిలోకి దిగిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్(ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మధ్య ఐపీఎల్ సీజన్ 2020 తొలి మ్యాచ్ నేడు (సోమవారం) జరుగనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులతో పాటు ఆటగాళ్లూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగు జట్టు సన్ రైజర్స్ ఈ సీజన్లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగుతోంది. దీంతో నేటి తొలిమ్యాచ్‌లో విజయం సాధించాలని అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (రైనా విలవిల.. నాకే ఎందుకిలా?) దీనిలో భాగంగానే టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు ఆల్‌ది బెస్ట్ చెప్పాడు. తొలి మ్యాచ్‌లో ఆడుతున్నందున విషెస్ తెలియజేసిన విక్టరీ.. తమ మద్దతు ఎప్పుటికీ ఉంటుందని మరోసారి తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. క్రికెట్‌పై వెంకీకి మొదటి నుంచీ మక్కువ ఎక్కువే. హైదరాబాద్‌లో మ్యాచ్ జరిగితే మైదానంలో వాలిపోవాల్సిందే. ఇక సొంత జట్టుకు మద్దతు విషయంలో ఎప్పుడూ ముందువరుసలోనే ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు వెంకటేష్‌తో పాటు టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్‌తో సహా మరికొంత మంది సన్‌రైజర్స్‌కు గుడ్‌లక్ చెప్పారు. ఇక ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్లకు ఇదే తొలి మ్యాచ్ కావడం.. విధ్వంసం సృష్టించే ఆటగాళ్లకు కొదవలేకపోవడంతో అభిమానులకు అసలైన ఐపీఎల్ మజా అందనుంది. ఇక తొలిలో విజయం కోసం ఇరు జట్లూ వ్యహాలను సిద్ధం చేశాయి. (రైజింగ్‌కు వేళాయె...) -
రాయుడు చెడుగుడు
ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే చెన్నైకు కీలక మ్యాచ్... ఆ జట్టు సామర్థ్యం ముందు విజయం కష్టం కాదు... అటుచూస్తే ప్రత్యర్థి సన్‌రైజర్స్ భీకర బౌలింగ్! దానికి తగ్గట్లే ఎదురుగా భారీ లక్ష్యం... అందుకే ఏ మూలనో అనుమానాలు... కానీ రాయుడు వాటిని పటాపంచలు చేశాడు... శతకంతో చితక్కొటి సూపర్ కింగ్స్‌ను గెలిపించాడు. పుణే: ఈ ఐపీఎల్లో అద్భుత ఫామ్‌లో ఉన్న తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడు మరోసారి మెరిశాడు. దూకుడైన ఆటతో సన్‌రైజర్స్ దుమ్ము దులిపాడు. అజేయ శతకంతో చెన్నైను ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. రెండు జట్ల మధ్య ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాయుడు (62 బంతుల్లో 100 నాటౌట్, 7 ఫోర్లు, 7 సిక్స్‌లు)తో పాటు ఓపెనర్ షేన్ వాట్సన్ (35 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరవడంతో సూపర్ కింగ్స్ 8 వికెట్లతో హైదరాబాద్‌ను అలవోకగా ఓడించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్... ఓపెనర్ శిఖర్ ధావన్ (49 బంతుల్లో 79; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (39 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరులుగు చేసింది. అనంతరం చెన్నై 19 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అటు ఇద్దరు... మొత్తం ఆరుగురు బ్యాటింగ్‌కు దిగినా హైదరాబాద్ ఇన్నింగ్స్‌కు ధావన్, విలియమ్సన్‌లే మూల స్తంభాలుగా నిలిచారు. చహర్‌ను ఎదుర్కొనలేక ఇబ్బంది పడిన ఓపెనర్ అలెక్స్ హేల్స్ (2) అతడి బౌలింగ్‌లోనే నిష్క్రమించాడు. దీంతో ధావన్‌కు విలియమ్సన్ జత కలిశాడు. వీరు ఆచితూచి ఆడటంతో పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు 29/1తో నిలిచింది. అయితే, తర్వాత నుంచి ఇద్దరూ జోరు పెంచుకుంటూ పోయారు. రెండో వికెట్‌కు 123 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక సన్‌రైజర్స్ తడబడింది. సెంచరీ భాగస్వామ్యం... భువనేశ్వర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ బౌలింగ్ వనరులు, లీగ్‌లో వారి రికార్డును చూస్తే లక్ష్యం కొంత క్లిష్టమైనదే. కానీ చెన్నై ఓపెనర్లు నిలదొక్కుకుని అవలీలగా ఆడేశారు. ఇద్దరిలో ముందుగా వాట్సనే బాదుడు మొదలుపెట్టాడు. భువీ, సందీప్ శర్మల ఓవర్లలో మూడు సిక్స్‌లు బాది చూస్తుండగానే 20ల్లోకి వెళ్లిపోయాడు. సిక్స్, ఫోర్‌తో రాయుడు సైతం వేగం పెంచాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్, షకీబ్ ఇలా ఒక్కో బౌలర్ మెడలు వంచారు. పవర్ ప్లే ఆఖరుకు చెన్నై 53/0తో నిలిచింది. అంబటి ధాటికి ఎక్కువగా సిద్ధార్థ్ కౌల్ బలయ్యాడు. అతడు వేసిన 7, 11వ ఓవర్లలో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు సహా 28 పరుగులు రాబట్టాడు. వాట్సన్ 31 బంతుల్లో, రాయుడు 31 బంతుల్లో అర్ధశతకాలు చేశారు. దీంతో ఓపెనింగ్ భాగస్వామ్యం వంద దాటింది. తొలి వికెట్‌కు 134 పరుగులు జతయ్యాక వాట్సన్ రనౌట్‌తో ఎట్టకేలకు బ్రేక్ పడింది. రైనా (2) ఇలా వచ్చి అలా వెళ్లాడు. అయితే రాయుడు, కెప్టెన్ ధోని (14 బంతుల్లో 20 నా టౌట్, 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి పని పూర్తి చేశాడు. శతకం ముంగిట సంకటం... ఓవైపు ధోని పరుగులు చేస్తూ లక్ష్యాన్ని తగ్గిస్తుండటంతో రాయుడు సెంచరీ ముంగిట కొంత ఉత్కంఠ నెలకొంది. వాట్సన్ ఉండగానే 50 నుంచి 70ల్లోకి వేగంగా వెళ్లిన రాయుడు... అనంతరం కొంత తగ్గాడు. షకీబ్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో 90ల్లోకి చేరుకున్నాడు. ఇక్కడి నుంచి కొంత డ్రామా నడిచింది. 18 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని సిక్స్ కొట్టి సమీకరణాన్ని 12 బంతుల్లో 8గా మార్చాడు. భువీ బౌలింగ్‌లో అంబటి 98 మీద ఉండగా షార్ట్ థర్డ్మ్యాన్లోకి ఆడిన బంతి పైకి లేచింది. అక్కడెవరూ లేకపోవడంతో లైఫ్ దక్కింది. లక్ష్యం 7 పరుగులు ఉండగా ధోని ఫోర్ కొట్టాడు. దీంతో శతకం పూర్తవుతుందా లేదా అనే అనుమానం తలెత్తింది. కానీ, మహి సింగిల్ తీసి స్ట్రయికింగ్ ఇచ్చాడు. రాయుడు స్క్వేర్ లెగ్‌లోకి బంతిని పంపి సెంచరీ సాధించి మునుపెన్నడూ లేనంతటి సంబరం చేసుకున్నాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ధావన్ (సి) హర్భజన్ (సి) బ్రేవో 79; హేల్స్ (సి) రైనా (బి) చహర్ 2; విలియమ్సన్ (సి) బ్రేవో (బి) శార్దుల్ 51; పాండే (సి) విల్లీ (బి) శార్దుల్ 5; హుడా నాటౌట్ 21; షకీబ్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–18, 2–141, 3–141, 4–160. బౌలింగ్: చహర్ 4–0–16–1, శార్దుల్ 4–0–32–2, విల్లీ 2–0–24–0, హర్భజన్ 2–0–26–0, వాట్సన్ 2–0–15–0, బ్రేవో 4–0–39–1, జడేజా 2–0–24–0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: వాట్సన్ రనౌట్ 57; రాయుడు నాటౌట్ 100; రైనా (సి) విలియమ్సన్ (బి) సందీప్ శర్మ 2; ధోని నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (19 ఓవర్లలో 2 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–134, 2–137. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–36–1, భువనేశ్వర్ 4–0–38–0, రషీద్ ఖాన్ 4–0–25–0, షకీబ్ 4–0–41–0, కౌల్ 3–0–40–0. 13: ఐపీఎల్లో సెంచరీ చేసిన 13వ భారతీయ క్రికెటర్ అంబటి రాయుడు. 4: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో నమోదైన సెంచరీలు. ఈ నాలుగింటిలో మూడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పైనే రావడం గమనార్హం. -
వార్నర్ స్థానం భర్తీ చేయలేనిది
సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్ లేని లోటు పూడ్చలేనిదని ప్రస్తుత సారథి కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. అలెక్స్ హేల్స్ కానీ మరొకరు కానీ అతని స్థానాన్ని భర్తీచేయలేరని పేర్కొన్నాడు. ‘గత కొన్నేళ్లుగా వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం చాలా చేశాడు. అతను లేని లోటు పూడ్చటం అసాధ్యం. టి20ల్లో అతను ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకడు’ అని విలియమ్సన్ అన్నాడు. బాల్ ట్యాంపరింగ్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్‌పై ఏడాది నిషేధం విదించడంతో బీసీసీఐ అతన్ని ఐపీఎల్‌కు కూడా దూరం చేసింది. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో అతను మాట్లాడుతూ.... ‘పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం ఆనందకరం. ప్రతి మ్యాచ్‌లో ప్రదర్శన మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్లడం ముఖ్యం. ఐపీఎల్లో బలమైన జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్మెన్లతో ఉన్న ఆ జట్టు ఎప్పుడూ ప్రమాదకారే’ అని తెలిపాడు. నేడు ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్, బెంగళూరుతో తలపడనుంది. -
వార్నర్ ఆట ఒక ఎత్తు అయితే మిగతా..
2014లో 528 పరుగులు ...2015లో 562...2016లో 848...2017లో 641...సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున గత నాలుగేళ్లు డేవిడ్ వార్నర్ ప్రదర్శన ఇది. ఒంటి చేత్తో అతను మ్యాచ్‌లు గెలిపించాడు. 2014 నుంచి 59 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 52.63 సగటు, 147.71 స్ట్రైక్ రేట్‌తో 2,579 పరుగులు చేశాడు. ఇందులో 26 అర్ధ శతకాలు, ఒక శతకం ఉన్నాయి. ఇదే సమయంలో జట్టంతా చేసిన పరుగులు 6,292. సగటు23.74 కాగా, స్ట్రైక్ రేట్ 123.98 మాత్రమే. వీటిలో 28 అర్ధ శతకాలున్నాయి. ఇప్పటివరకు సన్‌రైజర్స్ జట్టులో వార్నర్ ఆట ఒక ఎత్తు అయితే మిగతా ఆటగాళ్ల ఆట అంతా ఒక ఎత్తు. 2016లో విశ్వరూపం చూపించిన వార్నర్ ఏకంగా 848 పరుగులు చేసి ఫ్రాంచైజీని విజేతగా నిలిపాడు. 10 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా తన హార్డ్ హిట్టింగ్తో మెరుపు ఆరంభం దక్కేది. చివరకు జట్టుకు గౌరవప్రద స్కోరు అందేది. బ్యాటింగ్‌లో వార్నర్ వేసిన పునాదిపై భువనేశ్వర్, రషీద్‌ఖాన్ వంటి బౌలర్లు గెలుపు మేడ కట్టేవారు. అతడి చురుకైన ఫీల్డింగ్ కూడా ఎంతో మేలు చేసేది. నిలకడ లేమితో సతమతం అవుతున్న శిఖర్ ధావన్ వార్నర్ సహచర్యంతోనే తిరిగి గాడిన పడ్డాడని చెప్పొచ్చు. ఇలాంటి ఆటగాడు ఇప్పుడు ఐపీఎల్‌కు దూరం కావడం ఫ్రాంచైజీకి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. కొత్త సీజన్లో భారమంతా ధావన్, మనీశ్ పాండేలపై పడనుంది. వార్నర్ స్థానంలో మంచి హిట్టర్లయిన గప్టిల్, కుశాల్ పెరీరా, హేల్స్, మోర్గాన్, లెండిల్ సిమ్మన్స్, క్లాసెన్లలో ఒకరిని ఎంచుకుంటే సన్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండవచ్చు. విలియమ్సన్ ఏం చేస్తాడో! వార్నర్ స్థానంలో కెప్టెన్ ఎవరా..? అని ఆలోచిస్తున్న అభిమానులకు విలియమ్సన్ నియామకం ఆశ్చర్యపర్చింది. జట్టులో చోటే కష్టమైన అతడికి ఏకంగా సారథ్యం అప్పగించడం సాహసమే అని చెప్పాలి. గత మూడు సీజన్లలో సన్‌రైజర్స్‌కు 15 మ్యాచ్‌లాడిన విలియమ్సన్ 411 పరుగులే చేశాడు. ఇందులో మూడే అర్ధ శతకాలు. స్వదేశంలో ఇటీవలి ముక్కోణపు టి20 టోర్నీ సందర్భంగానూ పొట్టి ఫార్మాట్లో అతడి ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. అయితే... తర్వాతి మ్యాచ్‌లో అతడు 46 బంతుల్లో 72 పరుగులు చేసి వాటికి జవాబిచ్చాడు. సాంకేతికతలో తిరుగులేని ఈ కివీస్ సారథి మూడేళ్ల ఐపీఎల్ స్ట్రైక్ రేట్ 129.24. దీనిని అతడు మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో ధావన్, మనీశ్ పాండే వంటివారితో మంచి భాగస్వామ్యాలు నమోదు చేయాలి. చివర్లో యూసుఫ్ పఠాన్, హుడా వంటి హిట్టర్లు చెలరేగితే జట్టు భారీ స్కోరు చేయగలుగుతుంది. ఇక వైస్ కెప్టెన్ హోదా దక్కిన పేసర్ భువనేశ్వర్పైన కూడా పెద్ద బాధ్యత ఉంది. తక్కువ స్కోరు చేసిన మ్యాచ్‌లో భువీ, రషీద్‌ఖాన్, షకిబ్‌ల బౌలింగ్ ప్రతిభే గట్టెక్కించగలుగుతుంది. వనరులను వినియోగించుకోవడం, వ్యూహాలు పన్నడం వంటివి కెప్టెన్‌గా విలియమ్సన్ సామర్థ్యానికి పరీక్షే. సన్‌రైజర్స్: విలియమ్సన్ (కెప్టెన్), ధావన్, మనీశ్ పాండే, రికీ భుయ్, సచిన్ బేబీ, తన్మయ్ అగర్వాల్, భువనేశ్వర్, రషీద్‌ఖాన్, థంపి, సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, నటరాజన్, సందీప్‌శర్మ, స్టాన్లేక్, షకీబ్, హుడా, కార్లోస్ బ్రాత్‌వైట్, యూసుఫ్ పఠాన్, నబీ, జోర్డాన్, బిపుల్ శర్మ, మెహదీ హసన్, వద్ధిమాన్ సాహా, శ్రీవత్స్ గోస్వామి. – సాక్షి క్రీడా విభాగం -
కేసీఆర్ కు థాంక్స్: సన్ రైజర్స్ యజమాని
హైదరాబాద్: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ ను ప్రోత్సహించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆ జట్టు యజమాని కళానిధి మారన్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లో గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ ను మారన్, సన్ గ్రూప్ సీఈఓ షణ్ముగం, జెమినీ టీవీ ఎండీ కిరణ్, జీఎం బాలకృష్ణన్ కలిశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవడం .. హైదరాబాద్, తెలంగాణకు గర్వకారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రారంభ, ఫైనల్ మ్యాచ్ లు హైదరాబాద్ లోనే నిర్వహిస్తారని, ఆ రెండు మ్యాచ్ లకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరినట్లు మారన్ తెలిపారు. వచ్చే సీజన్లో ఐపీఎల్ మ్యాచ్ లను మరింత ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని కళానిధి మారన్ వెల్లడించారు. -
గెలిస్తే క్వాలిఫయర్-2.. ఓడితే ఇంటికే!
న్యూఢిల్లీ: ఐపీఎల్ 9 లో భాగంగా న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారమిక్కడ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి కోల్‌కతా జట్టుకు 163 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత ఓపెనర్‌గా బరిలోకి దిగిన శిఖర ధావన్ తొలి ఓవర్లో (10 బంతులు; రెండు ఫోర్లు) 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దాంతో సన్‌రైజర్స్ 12 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ధావన్ ఔట్ కావడంతో కాస్తా తడబడిన హైదరాబాద్ ఆటగాళ్లు హెన్రిక్స్, వార్నర్ మ్యాచ్‌ను సరిదిద్దే ప్రయత్నం చేశారు. తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి హెన్రిక్స్ 71 పరుగుల వద్ద కులదీప్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి 31 పరుగులతో వెనుతిరిగాడు. అదే ఓవర్లో వెంటనే డేవిడ్ వార్నర్ 28 పరుగులకే చేతులేత్తేశాడు. మూడు వికెట్లు కోల్పోవడంతో ఢీలా పడిన సన్‌రైజర్స్ జట్టు 15 ఓవర్లు ముగిసే సరికి 124 పరుగులతో నిలకడగా ఆటను కొనసాగించింది. అంతలోనే హుడా 21 పరుగుల వద్ద రన్ ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన ఆటగాడు కటింగ్ కనీసం ఖాతా తెరవకుండానే వెనుతిరిగాడు. పీకల్లోతు కష్టాల్లోకి కురుకపోయిన సన్‌రైజర్స్ జట్టు యువరాజ్ సింగ్ రాకతో కాస్తా తెరుకున్నా.. యువరాజు 44 పరుగులకే ఔట్ అయ్యాడు. అనంతరం ఓజా (7), భువనేశ్వర్ కుమార్ (1) సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కాగా బిపుల్ శర్మ (14), శరణ్ (0) నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లు మోర్కెల్, హోల్డర్ తలో రెండు వికెట్లు తీసుకోగా, కులదీప్ యాదవ్ ఏకంగా మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ సీజన్లో కోల్‌కతా చేతిలో రెండుసార్లు ఓడిన హైదరాబాద్... ఈసారి ఓడితే ఇంటి దారి పట్టాలి. అటు కోల్‌కతా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పైనే గెలిచి ప్లేఆఫ్‌కు చేరి ఆత్మవిశ్వాసంతో ఉంది. సీజన్ ఆరంభంలో కాస్త తడబడ్డా... బౌలర్ల నిలకడ, వార్నర్ మెరుపులతో సన్‌రైజర్స్ జట్టు మిగిలిన జట్లు అన్నింటికంటే ముందుగా ప్లే ఆఫ్‌కు చేరింది. కానీ ఆఖరి రెండు లీగ్ మ్యాచ్‌లలో ఓడిపోవడం జట్టును ఆందోళనపరుస్తోంది. ఏమైనా చిన్న తప్పు చేసినా మరో అవకాశం లేని నాకౌట్ మ్యాచ్ కాబట్టి రెండు జట్లూ సర్వశక్తులూ ఒడ్డాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం ఢిల్లీలోనే జరిగే క్వాలిఫయర్-2లో ఆడుతుంది. అక్కడ గెలిస్తే ఫైనల్‌కు చేరుతుంది. బ్యాటింగ్‌లో తడబడినా సన్‌రైజర్స్ జట్టు. మ్యాచ్ జరిగే ఫిరోజ్ షా కోట్ల మైదానం సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇందులోనూ ఆందోళన చెందే సన్‌రైజర్స్ జట్టు.. బౌలింగ్‌లోనైనా కోల్‌తాను కట్టడి చేస్తుందో లేదా చూడాలి. -
సన్ రైజర్స్ , కోల్ కతా జట్లలో భారీ మార్పులు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 లో నేడు కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తొలి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా కెప్టెన్ గౌతం గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటిదారి పట్టనుండగా, గెలిచిన జట్టు ఫైనల్ బెర్తు కోసం గుజరాత్ లయన్స్ తో తలపడాల్సి ఉంటుంది. కోల్ కతా జట్టులో అంకిత్ రాజ్ పుత్ స్థానంలో సతీష్ స్థానం కల్పించగా, షకీబుల్ ఈ మ్యాచులో చోటు దక్కించుకోలేక పోయాడు. హైదరాబాద్ జట్టులో... స్పిన్నర్ కరణ్ శర్మ స్థానంలో బిపుల్ శర్మ, బ్యాట్స్ మన్ కేన్ విలియమ్సన్ స్థానంలో కటింగ్ కు అవకాశం కల్పించారు. ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఈ కీలక మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడం కోల్ కతాకు కాస్త ఇబ్బందికర అంశం. హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ రాణించడంపైనే ఆ జట్టు ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. మరోవైపు గంభీర్, యూసఫ్ పఠాన్ ఫామ్ కొనసాగిస్తే కోల్ కతా జట్టుకు తిరుగుండదన్న విషయం తెలిసిందే.