సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత భాగ్యనగరంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇరు జట్లలోనూ భారత స్టార్ ఆటగాళ్లెవరూ లేకపోయినా స్టేడియం దాదాపుగా నిండిపోవడం విశేషం. హెచ్‌సీఏ అధికారిక లెక్క ప్రకారం 37,731 మంది ప్రేక్షకులు వచ్చారు. ఆదివారం కావడం, నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ చూడాలనే ఉత్సాహం ప్రేక్షకులను పెద్ద సంఖ్యలో మైదానానికి తీసుకొచ్చాయి.
మిట్టమధ్యాహ్నం తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా వారంతా స్టేడియంలోకి అడుగు పెట్టారు. కాగా.. సన్‌రైజర్స్ అభిమానులకు మాత్రం సరైన ఆనందం దక్కలేదు. పేలవమైన ఆట తీరుతో భారీ పరాజయాన్ని అందుకున్న హైదరాబాద్ జట్టు ఏ దశలోనూ తగిన వినోదాన్ని అందించలేకపోయింది. అందుకే చాలా మంది అభిమానుల్లో తీవ్ర నిరాశ కనిపించింది.
ఇన్నింగ్స్ మొత్తంలో రైజర్స్ బ్యాటర్లు 8 ఫోర్లు, 5 సిక్స్‌లు మాత్రమే కొట్టడంతో ఫ్యాన్స్‌కే కాదు, చీర్ గర్‌ల్స్‌కు కూడా పెద్దగా పని లేకుండా పోయింది. ఆరంభంలో రాజస్తాన్ ప్లేయర్లు కొట్టిన మెరుపు షాట్లే కాస్త చప్పట్లు కొట్టేలా చేశాయి. వచ్చే ఆదివారం కూడా మరో మ్యాచ్ హైదరాబాద్‌లోనే ఉంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగే ఆ పోరులోనైనా లోకల్ ఫ్యాన్స్ సంబరపడే క్షణాలు వస్తాయేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment