![HCA to provide development funds](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/1323223.jpg.webp?itok=rkZFW0WV)
అభివృద్ధి నిధులు ఇవ్వనున్న హెచ్‌సీఏ
అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్‌లో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ గల యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు త్వరలోనే తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్)ను నిర్వహిస్తామని... హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు వెల్లడించారు. శనివారం ఉప్పల్ స్టేడియంలో జగన్‌మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు మాట్లాడుతూ... ‘క్రికెట్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.
ఐపీఎల్ అనంతరం యువ క్రికెటర్ల కోసం టీపీఎల్ నిర్వహిస్తాం. ఉమ్మడి 10 జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి కోటి రూపాయల చొప్పున ఖర్చు చేయనున్నాం. ప్రతి జిల్లాలో ఒక చోట 10 ఎకరాల స్థలం కొనుగోలు చేసి కొత్త మైదానాలను నిరి్మస్తాం. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్న తెలంగాణ ప్లేయర్లను సత్కరించేందుకు వచ్చే నెలలో హెచ్‌సీఏ అవార్డులు అందిస్తాం. బీసీసీఐ నిబంధనలకు అనుగుణంగా ఉప్పల్ స్టేడియాన్ని ఆధునీకరిస్తాం.
మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థను అభివృద్ధి పరుస్తాం’ అని వెల్లడించారు. ఈ సమావేశంలో హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, కార్యదర్శి దేవ్‌రాజ్, కోశాధికారి శ్రీనివాస్, బసవరాజు, సునీల్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా మేనేజర్‌గా ఎంపికైన దేవ్‌రాజ్‌ను అపెక్స్ కౌన్సిల్ సభ్యులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment