Telangana Premier League
-
జిల్లాకు రూ. 1 కోటి చొప్పున...
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ గల యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు త్వరలోనే తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్)ను నిర్వహిస్తామని... హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు వెల్లడించారు. శనివారం ఉప్పల్ స్టేడియంలో జగన్మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు మాట్లాడుతూ... ‘క్రికెట్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఐపీఎల్ అనంతరం యువ క్రికెటర్ల కోసం టీపీఎల్ నిర్వహిస్తాం. ఉమ్మడి 10 జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి కోటి రూపాయల చొప్పున ఖర్చు చేయనున్నాం. ప్రతి జిల్లాలో ఒక చోట 10 ఎకరాల స్థలం కొనుగోలు చేసి కొత్త మైదానాలను నిరి్మస్తాం. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న తెలంగాణ ప్లేయర్లను సత్కరించేందుకు వచ్చే నెలలో హెచ్‌సీఏ అవార్డులు అందిస్తాం. బీసీసీఐ నిబంధనలకు అనుగుణంగా ఉప్పల్ స్టేడియాన్ని ఆధునీకరిస్తాం. మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థను అభివృద్ధి పరుస్తాం’ అని వెల్లడించారు. ఈ సమావేశంలో హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, కార్యదర్శి దేవ్‌రాజ్, కోశాధికారి శ్రీనివాస్, బసవరాజు, సునీల్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా మేనేజర్‌గా ఎంపికైన దేవ్‌రాజ్‌ను అపెక్స్ కౌన్సిల్ సభ్యులు అభినందించారు. -
తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ క్వార్టర్స్‌లో ఆర్య వారియర్స్
తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మూడో సీజన్ హోరాహోరీగా సాగుతోంది. టైటిల్ ఫేవరెట్ ఆర్య వారియర్స్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్ళింది. కల్వకుంట్ల నర్సింగ్‌రావు ఓనర్‌గా ఉన్న ఈ టీమ్‌లో వికాస్ రెడ్డి, వీరన్బాబు, ఫహీమ్, నాగిరెడ్డి యర్రం, రమేశ్ బాబు డిసైడింగ్ రౌండ్ లో అదరగొట్టారు. అద్భుత ఆటతీరుతో కీలక పాయింట్లు సాధించారు. 18.5 పాయింట్లు సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. ఓవరాల్ గా ఆ జట్టు 48 పాయింట్లు సాధించింది. మిగిలిన ప్లేయర్స్‌లో దీపక్ సింగ్ ఠాకూర్, చక్రధర్ కూడా రెండేసి పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. టోర్నీ ఆరంభం నుంచీ నిలకడగా రాణిస్తున్న ఆర్య వారియర్స్ ప్రదర్శనపై ఆ జట్టు ఓవర్ కల్వకుంట్ల నర్సింగ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువ గోల్ఫర్లకు తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ చక్కని వేదికగా నిలుస్తోందన్నారు. టాలెంట్ ఉన్న గోల్ఫ్ ప్లేయర్స్ ను ఇలాంటి లీగ్ ద్వారా ప్రోత్సహించడం ఆనందంగా ఉందని చెప్పారు. కాగా తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు ఈ నెల 29 నుంచి మొదలు కానున్నాయి. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. చిన్న చిన్న తప్పులు సహజం! అతడొక మాస్టర్ క్లాస్: రోహిత్ శర్మ -
విజేత వరంగల్ వారియర్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ సీజన్–2లో ఆరంభం నుంచి అదరగొట్టిన వరంగల్ వారియర్స్ జట్టు చివరకు టైటిల్‌ను కైవసం చేసుకుంది. సరూర్‌నగర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో వరంగల్ వారియర్స్ 37–28తో పాలమూరు పాంథర్స్‌పై విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. రైడింగ్, ట్యాకిల్‌లో సత్తా చాటిన వరంగల్ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. విజేత జట్టులో విక్రాంత్ ‘బెస్ట్ రైడర్’, చౌగులే ‘బెస్ట్ డిఫెండర్’ పుర స్కారాలను గెలుచుకున్నారు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో కరీంనగర్ కింగ్స్ 31–26తో గద్వాల్ గ్లాడియేటర్స్‌ను ఓడించింది. టోర్నీలో రాణించిన కరీంనగర్ ప్లేయర్లు మునీశ్ బెస్ట్ రైడర్, కె.శ్రీనివాస్ బెస్ట్ డిఫెండర్ అవార్డును గెలుచుకున్నారు. హైదరాబాద్ ఆటగాడు హనుమంతు మోస్ట్ టాలెంట్ ప్లేయర్ పురస్కారాన్ని అందుకున్నాడు. -
వరంగల్ వారియర్స్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్‌లో వరంగల్ వారియర్స్ మూడో విజయాన్ని సాధించింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ 38–23తో హైదరాబాద్ బుల్స్‌ను ఓడించింది. వరంగల్ జట్టులో విక్రాంత్‌కు ‘బెస్ట్ రైడర్’, నీలేశ్‌కు ‘బెస్ట్ డిఫెండర్’ అవార్డులు లభించాయి. మరో మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్ 28–20తో మంచిర్యాల టైగర్స్‌పై విజయం సాధించింది. నల్లగొండ ఈగల్స్ తరఫున మల్లికార్జున ‘బెస్ట్ రైడర్’ అవార్డును అందుకోగా... మంచిర్యాల టైగర్స్ జట్టులో జి. రమేశ్ ‘బెస్ట్ డిఫెండర్’ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. -
తెలంగాణ ప్రీమియర్ లీగ్ షురూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ లీగ్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ పోటీలను ప్రారంభించారు. ఖైరతాబాద్ తెరాస ఇన్చార్జ్ మన్నెం గోవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 1 వరకు ఎల్బీస్టేడియంలో జరిగే ఈ లీగ్‌లో 12 జట్లు పాల్గొంటున్నాయి. లీగ్‌లో పాల్గొనే జట్లు: నల్లగొండ నవాబ్స్, రంగారెడ్డి రాయల్స్, డెక్కన్ థండర్స్, ఖమ్మం కమాండర్స్, హైదరాబాద్ కింగ్స్, మహబూబ్‌నగర్ స్టార్స్, వరంగల్ రైడర్స్, సికింద్రాబాద్ సూపర్ కింగ్స్, మెదక్ లయన్స్, సైబరాబాద్ చాంప్స్, నిజామాబాద్ నిజామ్స్, కరీంనగర్ లెజెండ్స్.