
తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మూడో సీజన్ హోరాహోరీగా సాగుతోంది. టైటిల్ ఫేవరెట్ ఆర్య వారియర్స్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్ళింది. కల్వకుంట్ల నర్సింగ్‌రావు ఓనర్‌గా ఉన్న ఈ టీమ్‌లో వికాస్ రెడ్డి, వీరన్‌బాబు, ఫహీమ్, నాగిరెడ్డి యర్రం, రమేశ్ బాబు డిసైడింగ్ రౌండ్ లో అదరగొట్టారు. అద్భుత ఆటతీరుతో కీలక పాయింట్లు సాధించారు.
18.5 పాయింట్లు సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. ఓవరాల్ గా ఆ జట్టు 48 పాయింట్లు సాధించింది. మిగిలిన ప్లేయర్స్‌లో దీపక్ సింగ్ ఠాకూర్, చక్రధర్ కూడా రెండేసి పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. టోర్నీ ఆరంభం నుంచీ నిలకడగా రాణిస్తున్న ఆర్య వారియర్స్ ప్రదర్శనపై ఆ జట్టు ఓవర్ కల్వకుంట్ల నర్సింగ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువ గోల్ఫర్లకు తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ చక్కని వేదికగా నిలుస్తోందన్నారు. టాలెంట్ ఉన్న గోల్ఫ్ ప్లేయర్స్ ను ఇలాంటి లీగ్ ద్వారా ప్రోత్సహించడం ఆనందంగా ఉందని చెప్పారు. కాగా తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు ఈ నెల 29 నుంచి మొదలు కానున్నాయి.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. చిన్న చిన్న తప్పులు సహజం! అతడొక మాస్టర్ క్లాస్: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment