
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్‌లో వరంగల్ వారియర్స్ మూడో విజయాన్ని సాధించింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ 38–23తో హైదరాబాద్ బుల్స్‌ను ఓడించింది. వరంగల్ జట్టులో విక్రాంత్‌కు ‘బెస్ట్ రైడర్’, నీలేశ్‌కు ‘బెస్ట్ డిఫెండర్’ అవార్డులు లభించాయి.
మరో మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్ 28–20తో మంచిర్యాల టైగర్స్‌పై విజయం సాధించింది. నల్లగొండ ఈగల్స్ తరఫున మల్లికార్జున ‘బెస్ట్ రైడర్’ అవార్డును అందుకోగా... మంచిర్యాల టైగర్స్ జట్టులో జి. రమేశ్ ‘బెస్ట్ డిఫెండర్’ పురస్కారాన్ని గెలుచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment