విజేత వరంగల్‌ వారియర్స్‌ | Warangal Warriors are title win | Sakshi
Sakshi News home page

విజేత వరంగల్‌ వారియర్స్‌

Oct 1 2018 4:59 AM | Updated on Mar 22 2019 2:57 PM

 Warangal Warriors are title win - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌ సీజన్‌–2లో ఆరంభం నుంచి అదరగొట్టిన వరంగల్‌ వారియర్స్‌ జట్టు చివరకు టైటిల్‌ను కైవసం చేసుకుంది. సరూర్‌నగర్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో వరంగల్‌ వారియర్స్‌ 37–28తో పాలమూరు పాంథర్స్‌పై విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. రైడింగ్, ట్యాకిల్‌లో సత్తా చాటిన వరంగల్‌ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది.

విజేత జట్టులో విక్రాంత్‌ ‘బెస్ట్‌ రైడర్‌’, చౌగులే ‘బెస్ట్‌ డిఫెండర్‌’ పుర స్కారాలను గెలుచుకున్నారు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో కరీంనగర్‌ కింగ్స్‌ 31–26తో గద్వాల్‌ గ్లాడియేటర్స్‌ను ఓడించింది. టోర్నీలో రాణించిన కరీంనగర్‌ ప్లేయర్లు మునీశ్‌ బెస్ట్‌ రైడర్, కె.శ్రీనివాస్‌ బెస్ట్‌ డిఫెండర్‌ అవార్డును గెలుచుకున్నారు. హైదరాబాద్‌  ఆటగాడు హనుమంతు మోస్ట్‌ టాలెంట్‌ ప్లేయర్‌ పురస్కారాన్ని అందుకున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement