సన్ రైజర్స్ , కోల్ కతా జట్లలో భారీ మార్పులు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 లో నేడు కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తొలి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా కెప్టెన్ గౌతం గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటిదారి పట్టనుండగా, గెలిచిన జట్టు ఫైనల్ బెర్తు కోసం గుజరాత్ లయన్స్ తో తలపడాల్సి ఉంటుంది.
కోల్ కతా జట్టులో అంకిత్ రాజ్ పుత్ స్థానంలో సతీష్ స్థానం కల్పించగా, షకీబుల్ ఈ మ్యాచులో చోటు దక్కించుకోలేక పోయాడు. హైదరాబాద్ జట్టులో... స్పిన్నర్ కరణ్ శర్మ స్థానంలో బిపుల్ శర్మ, బ్యాట్స్ మన్ కేన్ విలియమ్సన్ స్థానంలో కటింగ్ కు అవకాశం కల్పించారు. ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఈ కీలక మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడం కోల్ కతాకు కాస్త ఇబ్బందికర అంశం. హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ రాణించడంపైనే ఆ జట్టు ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. మరోవైపు గంభీర్, యూసఫ్ పఠాన్ ఫామ్ కొనసాగిస్తే కోల్ కతా జట్టుకు తిరుగుండదన్న విషయం తెలిసిందే.