
ఐపీఎల్ తొలి పోరులో బెంగళూరు ఘన విజయం
7 వికెట్ల తేడాతో ఓడిన కోల్‌కతా
కోహ్లి, సాల్ట్ అర్ధ సెంచరీలు
రాణించిన కృనాల్ పాండ్యా
డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త సీజన్‌ను ఓటమితో మొదలు పెట్టింది. సొంతగడ్డ ఈడెన్ గార్డెన్స్‌లో ఆడిన మ్యాచ్‌లోనూ శుభారంభం చేయలేకపోయింది. బ్యాటింగ్‌లో రహానే, నరైన్ మెరుపులతో ఒక దశలో 200 సాధించగలదనిపించిన టీమ్ ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
ఆర్‌సీబీ బౌలర్లు కేకేఆర్‌ను సరైన సమయంలో నిలువరించడంలో సఫలమయ్యారు. ఆ తర్వాత సాల్ట్, కోహ్లి మెరుపు ఓపెనింగ్‌తో విజయానికి బాటలు వేసుకున్న బెంగళూరు ఆశావహ దృక్పథంతో తమ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. మరో 22 బంతులు మిగిలి ఉండగానే గెలిచిన మ్యాచ్‌తో రజత్ పాటీదార్ కెపె్టన్‌గా శుభారంభం చేశాడు.
కోల్‌కతా: ఐపీఎల్ తొలి పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైచేయి సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అజింక్య రహానే (31 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా... సునీల్ నరైన్ (26 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), అంగ్‌కృష్ రఘువంశీ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
రహానే, నరైన్ రెండో వికెట్‌కు 55 బంతుల్లోనే 103 పరుగులు జోడించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (3/29) కీలక సమయంలో 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం బెంగళూరు 16.2 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లి (36 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా...తొలి సారి కెప్టెన్‌గా వ్యవహరించి రజత్ పాటీదార్ (16 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడుగా ఆడాడు.
భారీ భాగస్వామ్యం...
10 ఓవర్లలో 107 పరుగులు...ఇన్నింగ్స్ తొలి భాగంలో కోల్‌కతా బ్యాటింగ్ జోరింది. డి కాక్ (4) మొదటి ఓవర్లోనే వెనుదిరిగిన తర్వాత రహానే, నరైన్ కలిసి చెలరేగిపోయారు. సలామ్ ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లు బాదిన రహానే...కృనాల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అదే ఓవర్లో సిక్స్‌తో నరైనా కూడా జత కలిశాడు. దయాళ్ ఓవర్లో కూడా ఇదే తరహాలో రహానే 2 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోయాడు.
సుయాశ్ ఓవర్లో సిక్స్‌తో 25 బంతుల్లోనే రహానే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా...చివరి రెండు బంతులను రహానే సిక్స్, ఫోర్‌గా మలిచాడు. సలామ్ తర్వాతి ఓవర్లో కూడా 4, 6 కొట్టిన నరైన్ అదే ఊపులో చివరి బంతికి అవుటయ్యాడు. ఇక్కడే కేకేఆర్ ఇన్నింగ్స్ మలుపు తిరిగింది.
ఒక్కసారిగా చెలరేగిన బెంగళూరు బౌలర్లు ప్రత్యర్థిపై పట్టు సాధించారు. 16 పరుగుల తేడాతో రహానే, వెంకటేశ్ అయ్యర్ (6) వెనుదిరగ్గా...ఐదు పరుగుల వ్యవధిలో భారీ హిట్టర్లు రింకూ సింగ్ (12), ఆండ్రీ రసెల్ (4) వికెట్లను జట్టు కోల్పోయింది. దాంతో అంచనాలకు అనుగుణంగా భారీ స్కోరును సాధించలేకపోయింది.
దూకుడుగా దూసుకుపోయి...
ఛేదనలో బెంగళూరు చెలరేగిపోయింది. ఇన్నింగ్స్ తొలి బంతినే ఫోర్‌గా మలచిన సాల్ట్ ఘనంగా మొదలు పెట్టగా, అతనికి కోహ్లి తోడవడంతో టీమ్ లక్ష్యం దిశగా సునాయాసంగా దూసుకుపోయింది. అరోరా ఓవర్లో సాల్ట్ 2 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టగా, కోహ్లి మరో ఫోర్ బాదడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి.
నైట్‌రైడర్స్ ఎంతో ఆశలు పెట్టుకున్న వరుణ్ చక్రవర్తికి తొలి ఓవర్లో బాగా దెబ్బ పడింది. వరుస బంతుల్లో సాల్ట్ 4, 6, 4, 4 బాదడంతో పరిస్థితి అంతా ఆర్‌సీబీకి అనుకూలంగా మారిపోయింది. జాన్సన్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాది తానూ తగ్గలేదని కోహ్లి చూపించగా, 25 బంతుల్లో సాల్ట్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు.
తక్కువ వ్యవధిలో సాల్ట్, పడిక్కల్ (10) వికెట్లు తీసి కోల్‌కతా కాస్త ఊరట చెందినా...తర్వాత వచ్చిన పాటీదార్ కూడా బౌండరీల వర్షం కురిపించాడు. రాణా ఓవర్లోనే అతను ఏకంగా 4 ఫోర్లు కొట్టడం విశేషం. 30 బంతుల్లో విరాట్ హాఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో వరుసగా 6, 4 కొట్టి లివింగ్‌స్టోన్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించాడు.
స్కోరు వివరాలు
కోల్‌కాత నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 4; నరైన్ (సి) జితేశ్ (బి) సలామ్ 44; రహానే (సి) సలామ్ (బి) పాండ్యా 56; వెంకటేశ్ (బి) పాండ్యా 6; రఘువంశీ (సి) జితేశ్ (బి) దయాళ్ 30; రింకూ (బి) పాండ్యా 12; రసెల్ (బి) సుయాశ్ 4; రమణ్‌దీప్ (నాటౌట్) 6; హర్షిత్ (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 5; జాన్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–4, 2–107, 3–109, 4–125, 5–145, 6–150, 7–168, 8–173. బౌలింగ్: హాజల్‌వుడ్ 4–0–22–2, యశ్ దయాళ్ 3–0–25–1, రసిఖ్ సలామ్ 3–0–35–1, కృనాల్ పాండ్యా 4–0–29–3, సుయాశ్ శర్మ 4–0–47–1, లివింగ్‌స్టోన్ 2–0–14–0.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జాన్సన్ (బి) వరుణ్ 56; కోహ్లి (నాటౌట్) 59; పడిక్కల్ (సి) రమణ్‌దీప్ (బి) నరైన్ 10; పటీదార్ (సి) రింకూ (బి) అరోరా 34; లివింగ్‌స్టోన్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (16.2 ఓవర్లలో 3 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–95, 2–118, 3–162. బౌలింగ్: వైభవ్ అరోరా 3–0–42–2, స్పెన్సర్ జాన్సన్ 2.2–0–31–0, వరుణ్ చక్రవర్తి 4–0–43–1 హర్షిత్ రాణా 3–0–32–0, సునీల్ నరైన్ 4–0–27–1.
సందడిగా ప్రారంభోత్సవం
తొలి మ్యాచ్‌కు ముందు ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు జరిగాయి. షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమం మొదలు కాగా...ఆ తర్వాత ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ తన పాటతో అలరించింది. అనంతరం దిశా పటాని తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. సింగర్ కరణ్ ఔజ్లా ఆమెకు జత కలిశాడు.
చివర్లో షారుఖ్ చిత్రం ‘పఠాన్’లోని సూపర్ హిట్ పాటకు అతనితో కలిసి విరాట్ కోహ్లి వేసిన స్టెప్పులు హైలైట్‌గా నిలిచాయి. తొలి ఐపీఎల్ నుంచి ఇప్పటి వరకు ఆడుతున్న విరాట్ కోహ్లికి బీసీసీఐ ప్రత్యేక ‘18’ జ్ఞాపికను అందించింది.

ఐపీఎల్‌లో నేడు
హైదరాబాద్ X రాజస్తాన్
వేదిక: హైదరాబాద్
మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి
చెన్నై X ముంబై
వేదిక: చెన్నై
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment