ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 21 పరుగులతో విజయాన్ని అందుకుంది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహిపాల్ లామ్రోర్ 34, దినేశ్ కార్తిక్ 22 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా.. సుయాష్ శర్మ, ఆండ్రీ రసెల్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.
16 ఓవర్లలో ఆర్‌సీబీ 145/6
16 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. దినేశ్ కార్తిక్ 15, హసరంగా ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆర్‌సీబీ గెలవాలంటే 24 బంతుల్లో 56 పరుగులు చేయాలి.
కోహ్లి ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ
విరాట్ కోహ్లి(54) రసెల్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఆర్‌సీబీ 115 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
కోహ్లి ఫిఫ్టీ.. ఆర్‌సీబీ 106/3
కేకేఆర్‌తో మ్యాచ్‌లో 33 బంతుల్లో కోహ్లి అర్థసెంచరీ మార్క్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ మూడు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. లామ్రోర్ 28 పరుగులతో కోహ్లికి సహకరిస్తున్నాడు.
8 ఓవర్లలో ఆర్‌సీబీ 72/3
8 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. కోహ్లి 41, మహిపాల్ లామ్రోర్ ఏడు పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. అంతకముందు షాబాజ్ అహ్మద్, మ్యాక్స్‌వెల్‌లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు.
డుప్లెసిస్(18) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ
201 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్‌సీబీ డుప్లెసిస్(17) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.
Photo Credit : IPL Website
రాణించిన జేసన్ రాయ్, నితీశ్ రానా.. ఆర్‌సీబీ టార్గెట్ ఎంతంటే?
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జేసన్ రాయ్ 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ రానా 48, వెంకటేశ్‌అయ్యర్ 27 పరుగులు చేశారు. ఆఖర్లో రింకూ సింగ్(10 బంతుల్లో 18 నాటౌట్), డేవిడ్ వీస్(3 బంతుల్లో 12 నాటౌట్) సిక్సర్లు బాదడంతో కేకేఆర్ 200 మార్క్ అందుకుంది. ఆర్‌సీబీ బౌలర్లలో హసరంగా, విజయ్ కుమార్ వైశాక్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
Photo Credit : IPL Website
14 ఓవర్లలో కేకేఆర్ 126/2
14 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 20, నితీశ్ రానా 18 పరుగులతో ఆడుతున్నారు.
Photo Credit : IPL Website
జేసన్ రాయ్(56) క్లీన్‌బౌల్డ్.. కేకేఆర్ 105/2
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన జేసన్ రాయ్ విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 14, నితీశ్ రానా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Photo Credit : IPL Website
తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్..
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన జగదీషన్(27 పరుగులు) డేవిడ్ విల్లేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. రాయ్ 55 పరుగులతో ఆడుతున్నాడు.
Photo Credit : IPL Website
దంచి కొడుతున్న జేసన్ రాయ్.. కేకేఆర్ 6 ఓవర్లలో 66/0
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ జేసన్ రాయ్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 20 బంతుల్లోనే 48 పరుగులు చేసిన రాయ్ ఖాతాలో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. షాబాజ్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం కేకేఆర్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది.
Photo Credit : IPL Website
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా బుధవారం 36వ మ్యాచ్‌లో బెంగళూరు వేదికగా ఆర్‌సీబీ, కేకేఆర్‌లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్‌సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ(కెప్టెన్), షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేసాయి, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, విజయ్‌కుమార్ వైషాక్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఎన్ జగదీసన్ (వికెట్‌కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, వైభవ్ అరోరా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
The Roar for King Kohli is huge 🔥pic.twitter.com/azZZvMdp3j
— Johns. (@CricCrazyJohns) April 26, 2023
కోహ్లి స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన ఆర్‌సీబీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మరోవైపు కేకేఆర్ వరుస ఓటములతో డీలా పడింది. ఆర్‌సీబీపై విజయంతో మళ్లీ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. తొలి అంచె పోటీల్లో కేకేఆర్.. ఆర్‌సీబీపై 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరుజట్లు ఐపీఎల్‌లో 31 సార్లు తలపడగా.. ఆర్‌సీబీ 17 సార్లు గెలుపొందగా.. కేకేఆర్ 14 సార్లు విజయాలు అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment