IPL eliminator match
-
గెలిస్తే క్వాలిఫయర్-2.. ఓడితే ఇంటికే!
న్యూఢిల్లీ: ఐపీఎల్ 9 లో భాగంగా న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారమిక్కడ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి కోల్‌కతా జట్టుకు 163 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత ఓపెనర్‌గా బరిలోకి దిగిన శిఖర ధావన్ తొలి ఓవర్లో (10 బంతులు; రెండు ఫోర్లు) 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దాంతో సన్‌రైజర్స్ 12 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ధావన్ ఔట్ కావడంతో కాస్తా తడబడిన హైదరాబాద్ ఆటగాళ్లు హెన్రిక్స్, వార్నర్ మ్యాచ్‌ను సరిదిద్దే ప్రయత్నం చేశారు. తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి హెన్రిక్స్ 71 పరుగుల వద్ద కులదీప్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి 31 పరుగులతో వెనుతిరిగాడు. అదే ఓవర్లో వెంటనే డేవిడ్ వార్నర్ 28 పరుగులకే చేతులేత్తేశాడు. మూడు వికెట్లు కోల్పోవడంతో ఢీలా పడిన సన్‌రైజర్స్ జట్టు 15 ఓవర్లు ముగిసే సరికి 124 పరుగులతో నిలకడగా ఆటను కొనసాగించింది. అంతలోనే హుడా 21 పరుగుల వద్ద రన్ ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన ఆటగాడు కటింగ్ కనీసం ఖాతా తెరవకుండానే వెనుతిరిగాడు. పీకల్లోతు కష్టాల్లోకి కురుకపోయిన సన్‌రైజర్స్ జట్టు యువరాజ్ సింగ్ రాకతో కాస్తా తెరుకున్నా.. యువరాజు 44 పరుగులకే ఔట్ అయ్యాడు. అనంతరం ఓజా (7), భువనేశ్వర్ కుమార్ (1) సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కాగా బిపుల్ శర్మ (14), శరణ్ (0) నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లు మోర్కెల్, హోల్డర్ తలో రెండు వికెట్లు తీసుకోగా, కులదీప్ యాదవ్ ఏకంగా మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ సీజన్లో కోల్‌కతా చేతిలో రెండుసార్లు ఓడిన హైదరాబాద్... ఈసారి ఓడితే ఇంటి దారి పట్టాలి. అటు కోల్‌కతా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పైనే గెలిచి ప్లేఆఫ్‌కు చేరి ఆత్మవిశ్వాసంతో ఉంది. సీజన్ ఆరంభంలో కాస్త తడబడ్డా... బౌలర్ల నిలకడ, వార్నర్ మెరుపులతో సన్‌రైజర్స్ జట్టు మిగిలిన జట్లు అన్నింటికంటే ముందుగా ప్లే ఆఫ్‌కు చేరింది. కానీ ఆఖరి రెండు లీగ్ మ్యాచ్‌లలో ఓడిపోవడం జట్టును ఆందోళనపరుస్తోంది. ఏమైనా చిన్న తప్పు చేసినా మరో అవకాశం లేని నాకౌట్ మ్యాచ్ కాబట్టి రెండు జట్లూ సర్వశక్తులూ ఒడ్డాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం ఢిల్లీలోనే జరిగే క్వాలిఫయర్-2లో ఆడుతుంది. అక్కడ గెలిస్తే ఫైనల్‌కు చేరుతుంది. బ్యాటింగ్‌లో తడబడినా సన్‌రైజర్స్ జట్టు. మ్యాచ్ జరిగే ఫిరోజ్ షా కోట్ల మైదానం సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇందులోనూ ఆందోళన చెందే సన్‌రైజర్స్ జట్టు.. బౌలింగ్‌లోనైనా కోల్‌తాను కట్టడి చేస్తుందో లేదా చూడాలి. -
సన్ రైజర్స్ , కోల్ కతా జట్లలో భారీ మార్పులు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 లో నేడు కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తొలి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా కెప్టెన్ గౌతం గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటిదారి పట్టనుండగా, గెలిచిన జట్టు ఫైనల్ బెర్తు కోసం గుజరాత్ లయన్స్ తో తలపడాల్సి ఉంటుంది. కోల్ కతా జట్టులో అంకిత్ రాజ్ పుత్ స్థానంలో సతీష్ స్థానం కల్పించగా, షకీబుల్ ఈ మ్యాచులో చోటు దక్కించుకోలేక పోయాడు. హైదరాబాద్ జట్టులో... స్పిన్నర్ కరణ్ శర్మ స్థానంలో బిపుల్ శర్మ, బ్యాట్స్ మన్ కేన్ విలియమ్సన్ స్థానంలో కటింగ్ కు అవకాశం కల్పించారు. ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఈ కీలక మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడం కోల్ కతాకు కాస్త ఇబ్బందికర అంశం. హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ రాణించడంపైనే ఆ జట్టు ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. మరోవైపు గంభీర్, యూసఫ్ పఠాన్ ఫామ్ కొనసాగిస్తే కోల్ కతా జట్టుకు తిరుగుండదన్న విషయం తెలిసిందే. -
మిగిలేదెవరు..?
కోల్‌కతా X హైదరాబాద్ ఐపీఎల్ ఎలిమినేటర్ నేడు రాత్రి గం. 8.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం ఇన్నాళ్లూ ఒక లెక్క... ఇప్పుడొక లెక్క... ఐపీఎల్ లో లీగ్ దశలో ఎలా ఆడామన్నది కాదు... ఇప్పుడు చావోరేవో తేల్చుకునే మ్యాచ్ వచ్చేసింది. ఈ సీజన్లో కోల్‌కతా చేతిలో రెండుసార్లు ఓడిన హైదరాబాద్... ఈసారి ఓడితే ఇంటి దారి పట్టాలి. అటు కోల్‌కతా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పైనే గెలిచి ప్లేఆఫ్‌కు చేరి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో నేడు ఈ రెండు జట్ల మధ్య ఎలిమినేటర్ జరుగుతుంది. న్యూఢిల్లీ: సీజన్ ఆరంభంలో కాస్త తడబడ్డా... బౌలర్ల నిలకడ, వార్నర్ మెరుపులతో సన్‌రైజర్స్ జట్టు మిగిలిన జట్లు అన్నింటికంటే ముందుగా ప్లే ఆఫ్‌కు చేరింది. కానీ ఆఖరి రెండు లీగ్ మ్యాచ్‌లలో ఓడిపోవడం జట్టును ఆందోళనపరుస్తోంది. శిఖర్ ధావన్ ఫామ్‌లోకి వచ్చినా... బ్యాటింగ్ విభాగంలోనే జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విలియమ్సన్, మోర్గాన్ ఇద్దరూ విఫలం కావడం ప్రభావం చూపుతోంది. యువరాజ్ అడపాదడపా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నా... తన నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ ఇంకా బాకీ ఉంది. మ్యాచ్ జరిగే ఫిరోజ్ షా కోట్ల మైదానం సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇది కూడా సన్‌రైజర్స్‌ను ఆందోళన పరిచే అంశం. ఇంతకాలం పేసర్లను నమ్ముకున్న వార్నర్ సేన... కరణ్ శర్మతో పాటు బిపుల్ శర్మను కూడా ఆడించే అవకాశం ఉంది. యువరాజ్ సింగ్ కూడా స్పిన్ బౌలింగ్ చేస్తాడు. కాబట్టి ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉంది. దీపక్ హుడా మీద జట్టు చాలా అంచనాలతో ఉన్నా ఈ సీజన్లో పూర్తిగా నిరాశపరిచాడు. అటు కోల్‌కతా మాత్రం నాణ్యమైన స్పిన్నర్లతో పటిష్టంగా కనిపిస్తోంది. నరైన్, షకీబ్, పీయూష్ చావ్లాలతో పాటు నాలుగో స్పిన్నర్‌ను ఆడించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బ్యాటింగ్ విభాగంలో యూసుఫ్ పఠాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం ఈ జట్టుకు కలిసొచ్చే అంశం. ఓపెనర్లు గంభీర్, ఉతప్ప కూడా ఈ సీజన్లో బాగా ఆడారు. ఆల్‌రౌండర్ రస్సెల్ గాయం గురించి స్పష్టత లేకపోయినా... వికెట్ స్వభావం దృష్ట్యా తన అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. ఏమైనా చిన్న తప్పు చేసినా మరో అవకాశం లేని నాకౌట్ మ్యాచ్ కాబట్టి రెండు జట్లూ సర్వశక్తులూ ఒడ్డాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం ఢిల్లీలోనే జరిగే క్వాలిఫయర్-2లో ఆడుతుంది. అక్కడ గెలిస్తే ఫైనల్‌కు చేరుతుంది.