
ఐపీఎల్ పోరులో మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసి తన రికార్డ్‌ను (287/3)తానే బ్రేక్ చేసింది. చిన్నస్వామి స్టేడియంలో హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల మోత మోగించారు. ముఖ్యంగా బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించిన హెడ్ విధ్వంసమే సృష్టించాడు. దీంతో పవర్ ప్లేలో కేవలం 7.1 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ 100 పరుగులు దాటడం విశేషం. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
ఈ సందర్భాన్ని వీణ శ్రీవాణి కూడా సెలబ్రేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో ఎ పుడూచురుగ్గా ఉంటూ తన అభిమానులను అలరించే శ్రీవాణి సన్‌రైజర్స్ విజయాన్ని స్పెషల్‌గా ఎంజాయ్ చేసింది. ఐపీఎల్ 2024 కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ రిలీజ్ చేసిన సాంగ్‌ను తన వీణతో అదరగొట్టేసింది శ్రీవాణి. తన వీణా వాయిద్యాన్ని కేవలం క్లాసిక్ మ్యూజిక్‌కు పరిమితం కాకుండా, మాస్ సాంగ్స్‌ను కూడా వాయిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్న శ్రీవాణి తాజాగా మాస్‌బీట్ ‘‘మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో’ తో ఇరగదీసింది. ఇది ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment