కేన్ విలియమ్సన్
సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్ లేని లోటు పూడ్చలేనిదని ప్రస్తుత సారథి కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. అలెక్స్ హేల్స్ కానీ మరొకరు కానీ అతని స్థానాన్ని భర్తీచేయలేరని పేర్కొన్నాడు. ‘గత కొన్నేళ్లుగా వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం చాలా చేశాడు. అతను లేని లోటు పూడ్చటం అసాధ్యం. టి20ల్లో అతను ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు’ అని విలియమ్సన్ అన్నాడు. బాల్ ట్యాంపరింగ్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్‌పై ఏడాది నిషేధం విదించడంతో బీసీసీఐ అతన్ని ఐపీఎల్‌కు కూడా దూరం చేసింది.
ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో అతను మాట్లాడుతూ.... ‘పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం ఆనందకరం. ప్రతి మ్యాచ్‌లో ప్రదర్శన మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్లడం ముఖ్యం. ఐపీఎల్‌లో బలమైన జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లతో ఉన్న ఆ జట్టు ఎప్పుడూ ప్రమాదకారే’ అని తెలిపాడు. నేడు ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్, బెంగళూరుతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment