డేవిడ్ వార్నర్
సాక్షి, హైదరాబాద్ : ట్యాంపరింగ్ వివాద సెగలు ఐపీఎల్‌కు సైతం తాకాయి. ఈ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ నుంచి తొలిగిస్తూ వేటు వేసింది. నూతన కెప్టెన్‌గా టీమిండియా క్రికెటర్, అజింక్యా రహానేను ప్రకటించింది. దీంతో ఈ వివాదంలో సంబంధమున్న మరో ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఐపీఎల్ భవితవ్యంపై అనుమానాలు నెలకొన్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్‌ను సైతం తప్పిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకునే చర్యలను బట్టే, వార్నర్ విషయంలో తాము నిర్ణయం తీసుకుంటామని సన్‌రైజర్స్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ సోమవారం మీడియాకు తెలిపారు. కేప్‌టౌన్ టెస్టులో జరిగిన ఉదంతం నిజంగా దురదృష్టకరం, కానీ వార్నర్‌పై తాము ఇప్పుడే ఏమీ చెప్పలేమని, క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం ప్రకటించిన తరువాతే తాము ఓ నిర్ణయం తీసుకుంటామని లక్ష్మణ్ పేర్కొన్నారు. వార్నర్ అసాధారణ కెప్టెన్ అని గత కొన్ని ఏళ్లుగా సన్‌రైజర్స్‌జట్టును సమర్ధవంతంగా నడిపిస్తున్నాడని, అతని విషయంలో చర్చించిన తరువాతే తుది నిర్ణయం ప్రకటిస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఇక డేవిడ్ వార్నర్ సారథ్యంలో 2016లో సన్‌రైజర్స్ జట్టు టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. వార్నర్ కెప్టెన్సీ లేక జట్టు నుంచి తొలిగించినా.. సన్‌రైజర్స్ జట్టు బలహీనం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment