కేన్ విలియమ్సన్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్‌ను ఎంపిక చేశారు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా చేసిన డేవిడ్ వార్నర్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన నేపథ్యంలో అతని స్థానంలో విలియమ‍్సన్‌ను సారథిగా నియమిస్తూ సన్ రైజర్స్ యాజమాన్యం నిర‍్ణయం తీసుకుంది. వచ్చే నెలలో ఆరంభమయ్యే ఐపీఎల్ సీజన్‌లో భాగంగా సన్ రైజర్స్ తన తొలి మ్యాచ్‌ను రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఏప్రిల్ 9 వ తేదీన సన్ రైజర్స్ ..రాజస్తాన్‌తో మొదటి మ్యాచ్‌ను ఆడనుంది. కాగా, ట్యాంపరింగ్ ఉదంతంతో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టీవ్ స్మిత్ సైతం వైదొలిగిన సంగతి తెలిసిందే.
దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఆసీస్ జట్టు ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ సీఏ నిర‍్ణయం తీసుకుంది. దాంతో వీరు అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు దేశవాళీ మ్యాచ్‌లకు కూడా సంవత్సరం పాటు దూరం కానున్నారు. ఇక బౌలర్ బాన్ క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం పడింది.
Comments
Please login to add a commentAdd a comment